రామ్‌చరణ్, ఉపాసన దంపతులకు కుమార్తె జన్మించడంతో మెగా కాంపౌండ్‌లో సంబరాలు మొదలయ్యాయి. సినీ, రాజకీయ వర్గాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. రామ్‌చరణ్ మాదిరిగానే తొలి సంతానంగా కుమార్తెకు జన్మనిచ్చిన హీరోలు తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు. మరి, ఆ సెలబ్రిటీలు ఎవరో తెలుసుకుందాం.
చిరంజీవి- సుస్మిత
చిరంజీవికి తొలి సంతానం అమ్మాయే. చిరు పెద్ద కూతురు సుస్మిత. ప్రస్తుతం సుస్మిత కాస్ట్యూమ్ డిజైనర్, నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
బాలకృష్ణ- బ్రాహ్మణి
నటసింహం బాలకృష్ణకు ముగ్గురు సంతానం. పెద్ద కూతురు బ్రాహ్మణి. ఆ తర్వాత తేజస్విని, మోక్షజ్ఞ జన్మించారు. బ్రాహ్మణి నారా లోకేశ్ భార్య. హెరిటేజ్ గ్రూప్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
మోహన్ బాబు- లక్ష్మి
మంచు వారింట మహాలక్ష్మిలా తొలుత అడుగు పెట్టింది లక్ష్మి. మంచు లక్ష్మి తర్వాత విష్ణు, మనోజ్‌లకు మోహన్‌బాబు తండ్రయ్యారు. మంచు లక్ష్మి ప్రజెంటర్, ప్రొడ్యూసర్, నటిగా రాణిస్తున్నారు.
వెంకటేశ్- ఆశ్రిత
విక్టరీ వెంకటేశ్‌కి మొదట అమ్మాయే పుట్టింది. పెద్ద కూతురు ఆశ్రిత ఫుడ్ వ్లాగర్. ‘ఇన్ఫినిటీ ఫ్లాటర్’ పేరుతో సోషల్ మీడియా హ్యాండిల్స్‌ని మెయింటేన్ చేస్తుంటారు.
రజినీ- సౌందర్య
సూపర్ స్టార్ రజినీకాంత్‌కి ఇద్దరూ అమ్మాయిలే. పెద్ద కుమార్తె సౌందర్య నిర్మాతగా వ్యవహరిస్తుంది. ఐశ్వర్య దర్శకురాలిగా పనిచేస్తుంది. ఐశ్వర్య మాజీ భర్తే హీరో ధనుష్.
కమల్- శృతి
విలక్షణ నటుడు కమల్ హాసన్‌కి తొలుత శృతి హాసన్ పుట్టింది. నటిగా, సింగర్‌గా శృతి హాసన్ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించింది. కమల్ చిన్న కుమార్తె అక్షర.
రాజశేఖర్- శివాణి
రాజశేఖర్, జీవిత దంపతులకు ఇద్దరు సంతానం. పెద్ద కూతురు శివాణి. చిన్న కుమార్తె పేరు శివాత్మిక. వీరిద్దరూ ఇండస్ట్రీలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
రవితేజ- మోక్షద
రవితేజకు తొలి సంతానంగా కూతురు జన్మించింది. మోక్షద భూపతిరాజు అని పేరు పెట్టాడు. ఆ తర్వాత తనయుడు మహాధన్ జన్మనిచ్చాడు.
అనిల్- సోనమ్ కపూర్
బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్‌కి సోనమ్ కపూర్ జన్మించింది. సోనమ్ పలు సినిమాలలో హీరోయిన్గా చేసింది. ఆనంద్ అహుజను పెళ్లి చేసుకుంది.
మరికొంత మంది..
మంచు విష్ణు, దివంగత నందమూరి తారకరత్న, ఆది సాయికుమార్, అల్లరి నరేష్, రణ్‌బీర్ కపూర్, అజయ్ దేవ్గన్, సైఫ్ అలీఖాన్, షాహిద్ కపూర్, అభిషేక్ బచ్చన్.. ఇలా పలువురు సెలబ్రిటీలకు మొదటి సంతానం అమ్మాయే.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!