ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ Realme Narzo 60 5G సిరీస్ ఫోన్లను భారత మార్కెట్లోకి ఆవిష్కరించింది. ఈ సిరీస్‌లో రెండు ఫోన్లు ఉన్నాయి. ఒకటి బేసిక్ మోడల్ Realme Narzo 60 5G కాగా మరొకటి ప్రీమియమ్ మోడల్ Realme Narzo 60 Pro 5Gగా గ్యాడ్జెట్ ప్రియుల ముందుకు వచ్చింది. మరి ఈ ఫోన్ ప్రత్యేకతలు, ధర, ఆఫర్లు ఓసారి చూద్దాం.
Realme Narzo 60 5G ధర:
Realme Narzo 60 5G మోడల్ కాస్మిక్ బ్లాక్, మార్స్ ఆరెంజ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ప్రో మోడల్ కాస్మిక్ నైట్ మార్టిన్ సన్‌రైజ్ వేరియంట్లలో లభిస్తోంది.
Narzo 60 5G మోడల్ 8GB + 128GB వేరియంట్ ధర రూ. 17,999గా నిర్ణయించారు. 8GB + 256GB వేరియంట్ ధర రూ. 19,999గా ఉంది.
ఇక Realme Narzo 60 Pro 5G మోడల్ 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 23,999గా నిర్ణయించారు. 12GB + 256GB వేరియంట్ ఖరీదు రూ. 26,999గా ఉంది. 12GB + 1TB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 29,999గా ఉంది.
బ్యాంక్ డిస్కౌంట్స్
అయితే అమెజాన్‌లో ఈ ఫోన్లపై పలు బ్యాంకు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. రియల్మీ నార్జో60 5జీ ఫోన్‌పై icici, Sbi బ్యాంక్ కార్డులపై రూ.1,500 ఇన్స్టాంట్ డిస్కౌంట్ లభిస్తోంది.
రియల్మీ నార్జో 60 ప్రత్యేకతలు
రియల్మీ నార్జో 60 స్మార్ట్‌ఫోన్ డిస్ప్లే చూస్తే 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.43 అంగుళాల సూపర్ అమొలెడ్ కర్వ్డ్ డిస్ప్లే ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 13 + రియల్మీ యూఐ 4.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడుస్తుంది. వర్చువల్ ర్యామ్ ఫీచర్‌తో 8జీబీ ర్యామ్ అదనంగా ఉపయోగించవచ్చు. 5,000mAh బ్యాటరీ కలిగి 33W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. దీని బరువు 182గ్రామ్స్ మాత్రమే ఉండి హ్యాండీ ఫీలింగ్‌ను అందిస్తుంది.
రియల్మీ నార్జో 60 ప్రో ప్రత్యేకతలు
రియల్మీ నార్జో 60 ప్రో డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల సూపర్ అమొలెడ్ కర్వ్డ్ డిస్ప్లే కలిగి ఉంది.. మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 13 + రియల్మీ యూఐ 4.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడుస్తుంది. వర్చువల్ ర్యామ్ ఫీచర్‌తో 12జీబీ ర్యామ్ అడిషనల్‌గా యూజ్ చేయవచ్చు. 1టీబీ వరకు స్టోరేజ్ కెపాసిటీ అయితే ఉంది.
కెమెరా ఫీచర్స్
రియల్మీ నార్జో 60 ప్రో కెమెరా ఫీచర్స్ అద్భుతంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 100మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 2మెగాపిక్సెల్ పోర్ట్రైట్ సెన్సార్లతో డ్యుయెల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇది మంచి సెల్ఫీ పిక్స్ అయితే అందిస్తుంది. రియల్మీ నార్జో 60 మాదిరి ఇందులోనూ 5,000mAh బ్యాటరీ ఉండగా, 67వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.