భారతీయులు అమితంగా ఇష్టపడే మెుబైల్ బ్రాండ్లలో రెడ్మీ కచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే రెడ్మీ అతి తక్కువ ధరకే అత్యాధునిక ఫోన్‌ను అందిస్తుంది. అంతేగాక మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో ఫోన్స్ లాంచ్ చేస్తుంటుంది. ఈ నేపథ్యంలోనే చాలా మంది మెుబైల్ ప్రియులు రెడ్మీ ఫోన్స్ కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతుంటారు. అయితే చాలా మందికి రెడ్మీ ఫోన్ కొనాలని ఉన్నప్పటికీ ఏది తీసుకోవాలో తెలియక సతమతమవుతుంటారు. ఈ నేపథ్యంలో రెడ్‌మీలోని టాప్ రేటెడ్ మెుబైల్స్‌ను YouSay మీ ముందుకు తీసుకొచ్చింది. మరి ఆ ఫోన్స్ ప్రత్యేకతలు, ఫీచర్లు, ధర చూసి ఏదీ కొనాలో మీరే డిసైడ్ చేసుకోండి.
Redmi Note 12 Pro
రెడ్మీ నోట్ 12 ప్రో 5G మెుబైల్ ఈ ఏడాది మేలో రిలీజైంది. ఈ ఫోన్ MediaTek Dimensity 1080 processorతో పనిచేస్తుంది. అలాగే 6.67 అంగుళాల AMOLED డిస్ప్లేను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేటును కూడా ఫోన్‌కు అందించారు. ఈ ఫోన్ వెనకవైపున 50MP మెయిన్, 8MP అల్ట్రావైడ్, 2MP మాక్రో కెమెరాలను ఫిక్స్ చేశారు. 5000mAh బ్యాటరీతో 67W ఫాస్ట్ చార్జింగ్కు ఫోన్ సపోర్టు చేస్తుంది.
Redmi K50i
రెడ్మీ ఫోన్ కోసం ఎదురుచూస్తున్న వారికి రెడ్మీ కే 50i మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు. ఈ ఫోన్‌ను సరికొత్త MediaTek Dimensity 8100 CPUతో తీసుకొచ్చారు. Liquid FFS displayను కూడా అందించారు. అత్యుత్తమ సౌండ్ క్వాలిటీ దీని సొంతం. అలాగే 64MP ట్రిపుల్ కెమెరా సెటప్, 4K వీడియో రికార్డింగ్‌కు ఇది సపోర్టు చేస్తుంది. బ్లూ, క్విక్ సిల్వర్, స్టీల్త్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. మెుబైల్ ధర, ఇతర వివరాలకు కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయండి.
Redmi Note 12 5G
రెడ్ నోట్ 12 5G ఫోన్ ఫ్రెండ్లీ బడ్జెట్ మెుబైల్ అని చెప్పొచ్చు. ఈ మెుబైల్‌ను MediaTek Dimensity 700 ప్రాసెసర్, 6.6 అంగుళాల Full HD+ డిస్ప్లేతో తీసుకొచ్చారు. అలాగే 48MP మెయిన్ , 2MP మాక్రో కెమెరాలను ఈ ఫోన్‌కు ఫిక్స్ చేశారు. 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు చేసే 5000mAh బ్యాటరీని ఫోన్‌కు అమర్చారు. మెుత్తం 4GB/64GB, 4GB/128GB, 6GB/128GB వేరియంట్లలో ఈ మెుబైల్ లభించనుంది. స్టోరేజ్ కేపాసిటీ ఆధారంగా ఫోన్ ధరను నిర్ణయించారు.
Redmi Note 11T
రెడ్మీలో మరో అద్భుతమైన ఫోన్… రెడ్మీ నోట్ 11టీ. MediaTek Dimensity 810 Octa-core CPUతో ఈ ఫోన్ తీసుకొచ్చారు. సన్‌లైట్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ ప్లస్ స్క్రీన్ దీని సొంతం. అలాగే 50MP AI కెమెరా, 16MP సెల్ఫీ కెమెరాను ఫిక్స్ చేశారు. అక్వామెరైన్ బ్లూ, స్టార్‌డస్ట్ వైట్, మాటీ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.
Redmi Note 10S
రెడ్మీ నోట్ 10ఎస్ స్మార్‌ఫోన్ 64MP AI Quad cameraను కలిగి ఉంది. 13MP ఫ్రంట్ కెమెరాను ఫిక్స్ చేశారు. వీటితో అత్యంత నాణ్యమైన ఫొటోలు తీసుకోవచ్చు. అలాగే ఈ ఫోన్‌ను సూపర్ అమోల్డ్ డిస్ప్లేతో రూపొందించారు. 33W క్విక్ ఛార్జింగ్‌కు ఈ ఫోన్ బ్యాటరీ సపోర్టు చేస్తుంది. కాస్మిక్ పర్పుల్, డీప్ సీ బ్లూ, షాడో బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.
Redmi 10 Prime
రెడ్మీ 10 ప్రైమ్ ఫోన్‌ను HyperEngine Game Technology 2.0తో తీసుకొచ్చారు. ఇది యూజర్లకు అద్భుతమైన గేమింగ్ అనుభవాన్ని ఇస్తుంది. అటు ఫోన్‌కు 50MP ప్రైమరీ కెమెరా సెటప్‌ను అమర్చారు. అలాగే 8MP సెల్ఫీ కెమెరాను ఫిక్స్ చేశారు. అలాగే ఈ మెుబైల్ బ్యాటరీ 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది. అస్ట్రాల్ వైట్, ఫాంటమ్ బ్లాక్ కలర్స్‌లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
Redmi 9 Activ
మార్కెట్లో రూ.10 వేల లోపున్న రెడ్మీ ఫోన్లలో రెడ్మీ 9 యాక్టివ్ మెుబైల్ మంచి ఎంపిక అని చెప్పొచ్చు. ఈ ఫోన్‌ను HyperEngine Game Technologyతో తీసుకొచ్చారు. అలాగే వెనుక వైపు 13MP+2MP కెమెరా సెటప్‌ను ఫిక్స్ చేశారు. అలాగే 5MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. ఈ ఫోన్ FHD+IPS డిస్ప్లేను కలిగి ఉంది. కార్బన్ బ్లాక్, మెటలిక్ పర్పుల్, కోరల్ గ్రీన్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.
Redmi A2 Series
తక్కువ బడ్జెట్లో ఫోన్ ఆశించే వారి కోసం ఈ ఏడాది మేలో రెడ్మీ A2 సిరీస్ అందుబాటులోకి వచ్చింది. Redmi A2, Redmi A2+ వేరియంట్లలో ఈ ఫోన్ మార్కెట్లో లభిస్తోంది. Redmi A2 వేరియంట్.. MediaTek Helio G36 ప్రాసెసర్, 6.52 అంగుళాల HD+ డిస్ప్లే, 13MP మెయిన్ కెమెరా, 5MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంది. అటు Redmi A2+ వేరియంట్‌ను.. MediaTek Helio G37 processor, 6.53 అంగుళాల HD+ డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జర్ ఫీచర్లతో తీసుకొచ్చారు.
Celebrities Featured Articles Telugu Movies
Game Changer: ‘మేము మూలాలు మర్చిపోలే’.. బన్నీకి పవన్ చురకలు?