ప్రస్తుతం ప్రతీ ఇంట్లో రిఫ్రిజిరేటర్ భాగమైపోయింది. పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ ఫ్రిజ్‌లను కొనుగోలు చేస్తున్నారు. ఇంట్లోని ఆహార పదార్థాలను అందులో ఉంచి త్వరగా చెడిపోకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే కొంతమంది ఒకేసారి ఎక్కువ మెుత్తంలో ఆహారం వండి ఫ్రిజ్‌లో పెడుతుంటారు. తినేముందు వాటిని వేడి చేసుకుంటారు. ఇలా చేస్తే అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్లేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఫుడ్ పాయిజనింగ్
ఫ్రిజ్‌లో ఉంచిన ఆహారాన్ని వేడి చేయడం వల్ల కడుపులో ఇన్ఫెక్షన్లు, ఫుడ్ పాయిజనింగ్ వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలా అనీ ఫ్రిజ్‌లోని ఆహారాన్ని పడేయాలంటే ప్రతీ ఒక్కరికీ కష్టమే. అలాంటి సందర్భాల్లో ఈ సూచనలు పాటిస్తే ముప్పు తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
నేరుగా వేడి చేయోద్దు
ఫ్రిజ్‌లో నిల్వ చేసి తినే పదార్థాలను ముందే తీసి బయట పెట్టుకోవాలి. చల్లదనం అంతా పోయేవరకూ ఆగాలి. ఆహారం సాధారణ టెంపరేచర్‌కి వచ్చిన తర్వాత దానిని వేడి చేసుకోవాలి. అంతేగానీ ఫ్రిజ్‌లో నుంచి నేరుగా స్టవ్ మీద పెట్టి వేడి చేయకూడదు.
అలా చేస్తే డేంజర్!
మిగిలిపోయిన ఆహారాన్ని పదే పదే వేడిచేసినప్పుడు ఆహారం దాని పోషకాలను కోల్పోతుంది. ఇది ఫుడ్ పాయిజనింగ్ అవకాశాలని పెంచుతుంది. అటు ఆహారాన్ని స్థిరమైన మోస్తరు ఉష్ణోగ్రత వద్ద మాత్రమే వేడి చేయాలని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.
పోషకాలు క్షీణిస్తాయి
కూరగాయాల్ని ఫ్రిజ్‌లో పెట్టకపోవడమే మంచిది. ఎక్కువ సమయం అవి ఫ్రిజ్‌లో ఉంటే వాటిలోని పోషకాలు తగ్గిపోతాయి. పైగా అవి వాటి సహజసిద్ధమైన రుచిని కోల్పోయే అవకాశం కూడా ఉంది. అటు ఆరోగ్య నిపుణులు కూడా తాజా కూరగాయాలనే తినాలని సూచిస్తుంటారు. కాబట్టి ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా వెజిటెబుల్స్ తినడానికి ప్రయత్నించండి.
రెడీమేడ్ ఫుడ్ ఫ్రిజ్‌లో వద్దు
రెడీమేడ్ చపాతీలు, పరాటాలు, పూరీలు, ముందు రోజు రాత్రి కలిపిపెట్టిన పిండిని ఫ్రిజ్‌లో పెట్టకూడదు. అలా చేస్తే అవి విషతుల్యంగా మారే ప్రమాదముంది. ఎప్పటికప్పుడు తెచ్చుకొని/ కలుపుకొని చేయడం మంచిది.
పదే పదే ఓపెన్ చేయోద్దు
ఫ్రిజ్ డోర్‌ను పదే పదే ఓపెన్ చేస్తుంటే బయటి గాలి లోపలికి చొరబడుతుంది. దీంతో నిల్వ ఉంచిన ఆహారం పాడయ్యే అవకాశముంది. ఫ్రిజ్ డోర్ తీసినప్పుడు క్లోరోఫ్లోరో కార్బన్ విడుదలవుతుంది. ఇది ఓజోన్ పొరను దెబ్బతీస్తుంది. అందుకే ఫ్రిజ్‌ను వీలైనంత తక్కువ ఉపయోగించాలి.
జాగ్రత్తలు తప్పనిసరి
ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లో పెట్టేటపుడు దాని కోసం కేటాయించిన కంటైనర్‌లో మాత్రమే పెట్టాలి. వండిన ఆహారాన్ని మూతలు బిగుతుగా ఉన్న డబ్బాల్లో పెట్టి ఫ్రిజ్‌లో నిల్వ చేయాలి. అప్పుడే అవి తాజాగా ఉంటాయి.
మాంసం పెట్టకపోవడమే బెటర్!
ఉడికించిన గుడ్డు, మాంసం ఫ్రిజ్‌లో నిల్వ ఉంచడం వల్ల అవి వాటి రుచిని కోల్పోతాయి. మాంసం ముక్కలు రుచిపచిలేకుండా గట్టిగా తయారవుతాయి. కాబట్టి మాంసం వంటకాలను తక్కువ పరిమాణంలో వండుకొని అప్పటికప్పుడే తింటే బెటర్.
చల్లారిన పదార్థాలే ఉత్తమం
ఏ పదార్థాలనైనా వేడిగా ఉన్నప్పుడు ఫ్రిజ్‌లో పెట్టకూడదు. ముందు ఆ పదార్థాన్ని సాధారణ టెంపరేచర్‌లోకి రానివ్వాలి. ఆ తర్వాత ఫ్రిజ్‌లో నిల్వ ఉంచాలి.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం