ప్రముఖ సెర్జింజిన్ సంస్థ గూగుల్ మరోమారు అధునాతన ఫోన్లతో భారతీయ మార్కెట్లో అడుగుపెట్టింది. గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ ఫోన్లను బుధవారం (అక్టోబర్ 4) రిలీజ్ చేసింది. గూగుల్ పిక్సెల్ 8 (Google Pixel 8), గూగుల్ పిక్సెల్ 8 ప్రో (Google Pixel 8 Pro) వేరియంట్లలో కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి. మేడ్ బై గూగుల్ 2023 (Made By Google 2023) లాంచ్ ఈవెంట్లో ప్రపంచానికి పరిచయం అయ్యాయి. ఈ ప్రీమియం ఫ్లాగ్ షిప్ ఫోన్లలో అధునాతన ఫీచర్లను పొందుపరిచినట్లు కంపెనీ చెబుతోంది. ఈ నేపథ్యంలో Google Pixel 8 సిరీస్ ప్రత్యేకతలు ఏంటీ? ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? ధర ఎంత ? వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం.
మెుబైల్ స్క్రీన్
గూగుల్ పిక్సెల్ 8 (Google Pixel 8) స్మార్ట్‌ఫోన్.. 6.2 అంగుళాల OLED స్క్రీన్‌ను కలిగి ఉంది. దీనికి 120Hz రిఫ్రెష్ రేట్ అందించారు. అటు గూగుల్ పిక్సెల్ 8 ప్రో (Google Pixel 8 Pro) మెుబైల్.. 6.7 అంగుళాల OLED డిస్ప్లే, 1-120Hz రిఫ్రెష్ రేటు, 2,400నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో రానుంది. గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 సేఫ్టీని కూడా అందిస్తున్నారు. ఈ రెండు వేరియంట్లు ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై వర్క్ చేస్తాయి.
బ్యాటరీ సామర్థ్యం
పిక్సెల్ 8 స్మార్ట్‌ఫోన్‌కు 4,575mAh బ్యాటరీని ఫిక్స్ చేశారు. ఇది 27W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది. అటు పిక్సెల్ 8 ప్రో మెుబైల్‌కు 5,050mAh బ్యాటరీ అమర్చారు. దీనికి 30W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతు అందించారు.
స్టోరేజ్ సామర్థ్యం
పిక్సెల్ 8 స్మార్ట్‌ఫోన్ 8GB RAM / 128GB స్టోరేజ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. పిక్సెల్ 8 ప్రో వేరియంట్ 12GB RAM / 128GB స్టోరేజ్ కెపాసిటీని అందించారు. పవర్ఫుల్ RAM, ఎక్కువ స్టోరేజ్‌తో అవసరం ఉన్న వారికి పిక్సెల్ 8 ప్రో అనుకూలంగా ఉంటుంది.
కెమెరా క్వాలిటీ
పిక్సెల్ 8 సిరీస్ స్మార్ట్ఫోన్లను అద్భుతమైన డ్యూయల్ రియర్ కెమెరా క్వాలిటీతో తీసుకొచ్చారు. పిక్సెల్ 8 మెుబైల్ వెనకవైపున 50 MP ప్రైమరి + 12 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా సెటప్ ఉంది. పిక్సెల్ 8 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 64 MP మెయిన్ కెమెరాతో పాటు, 48 MP టెలిఫొటో సెన్సార్లను అమర్చారు. ఈ రెండు వేరియంట్లు 11 MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉండటం విశేషం.
అడ్వాన్స్డ్ సెన్సార్లు
పిక్సెల్ 8 సిరీస్ స్మార్ట్ఫోన్లలో టెంపరేచర్ మానిటరింగ్ సెన్సార్‌ను అమర్చారు. అలాగే అల్ట్రాసోనిక్ ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫిక్స్ చేశారు. దాంతోపాటు ఫేషియల్ రికగ్నైజింగ్ (Facial recognition) ఫీచర్ కూడా ఇందులో ఉంది.
మెుబైల్ కలర్స్
పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రో మెుబైల్స్ మూడేసి రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. పిక్సెల్ 8.. రోజ్ (Rose), హజెల్ (Hazel), ఒబ్సిడియన్ (Obsidian) కలర్స్ కలిగి ఉంది. పిక్సెల్ 8 ప్రో స్మార్ట్‌ఫోన్.. బే బ్లూ (Bay Blue), పింగాణి (Porcelain), క్లాసిక్ ఒబ్సిడియన్ (Classic Obsidian) కలర్ ఆప్షన్స్‌తో మార్కెట్లోకి వచ్చింది.
ధర ఎంతంటే?
పిక్సెల్ 8 సిరీస్ స్మార్ట్ఫోన్లు ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్నాయి. పిక్సెల్ 8 మెుబైల్ ధర రూ.75,999గా ఉంది. పిక్సెల్ 8 ప్రో వేరియంట్ ధరను కంపెనీ రూ.1,06,999గా నిర్ణయించింది. ICICI, AXIS బ్యాంక్ క్రెడిట్ కార్డు కొనుగోళ్లపై 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!