దీపావళికి కొత్త ఫోన్ కొనాలని భావిస్తున్నవారికి జియో శుభవార్త చెప్పింది. తక్కువ బడ్జెట్లో ‘Jio Phone Prima 4G’ మెుబైల్‌ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది ఫీచర్ ఫోన్ అయినప్పటికీ ఇందులో ప్రీమియం డిజైన్‌ను ఉపయోగించారు. ఈ ఫీచర్ ఫోన్లో అనేక సోషల్ మీడియా యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. దీపావళి వరకూ ఈ ఫోన్లు విక్రయానికి అందుబాటులో ఉంటాని జియో ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ ఫోన్ ప్రత్యేకతలు ఏంటి? ధర, ఫీచర్లు వంటి విశేషాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
ఫోన్ స్క్రీన్
Jio Phone Prima 4G ఫోన్‌కు 2.4 అంగుళాల TFT డిస్ప్లేను అందించారు. ఇది 320×240 రిజల్యూషన్ పిక్సెల్స్‌ను కలిగి ఉంది. ఇక ఫోన్ వెనుక ప్యానెల్‌పై రెండు సర్కిల్లు డ్రా చేయబడ్డాయి. అందులో జియో లోగో ఉంది.
ప్రొసెసర్
Jio నుంచి వచ్చిన ఈ ఫోన్ KaiOS ఆధారంగా పని చేస్తుంది. అలాగే ఇది సింగిల్ సిమ్ హ్యాండ్సెట్. ఇందులో ARM Cortex A53 ప్రాసెసర్ ఉంది. ఈ ఫోన్లో బ్లూటూత్ వెర్షన్ 5.0 అందుబాటులో ఉంటుంది.
23 భాషలు
ఈ ఫోన్‌ను 23 భాషల్లో ఆపరేట్ చేసుకోవచ్చు. మీ ప్రాంతీయ భాషను ఎంచుకొని ఎంతో తేలిగ్గా దీన్ని వినియోగించవచ్చు. అలాగే ఈ ఫోన్లో 4G కనెక్షన్ సపోర్ట్, 512 ఎంబీ RAM, 1800mAh బ్యాటరీ ఉంది. కెమెరా విషయానికొస్తే 0.3MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది.
ప్రత్యేకతలు
ఈ జియో ప్రైమా ఫోన్.. YouTube, JioTV, Jio Cinema, JioSaavn, JioNews లాంటి ఎంటర్టైన్మెంట్ యాప్‌లకు మద్దతు ఇస్తుంది. అయితే JioSaavn, JioCinema, JioPay దీనిలో ముందే లోడ్ చేసి ఉంటాయి.
వాట్సప్ సపోర్ట్
ఇతర స్మార్ట్ఫోన్ల లాగే ఇందులోనూ సోషల్ మీడియా యాప్స్‌ను వినియోగించవచ్చు. వాట్సప్, Jiochat, Facebook యాప్‌లకు ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా FM రేడియోతో పాటు 3.5mm ఆడియో జాక్‌కు మద్దతు ఇస్తుంది.
కలర్స్
Jio Phone Prima 4G మెుబైల్ రెండు రంగుల్లో లభిస్తోంది. పసుపు, నీలం కలర్ ఆప్షన్స్‌లో ఇది అందుబాటులో ఉంది. జియో కంపెనీ ఈ ఫోన్‌కు ఒక సంవత్సరం వారంటీని అందిస్తోంది.
ధర ఎంతంటే?
ఇప్పటికే Jio Mart ఈ-కామర్స్ వెబ్సైట్లో Jio Phone Prima 4G అందుబాటులోకి వచ్చింది. ధరను రూ.2599గా రిలయన్స్ జియో ఫిక్స్ చేసింది. దీనిపై క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, బ్యాంక్ ఆఫర్లు, కూపన్లు అందుబాటులో ఉంచుతున్నట్లు జియో ప్రకటించింది.
Celebrities Featured Articles Movie News Telugu Movies
Drishyam 3: ట్రెండింగ్‌లో ‘దృశ్యం 3’ హ్యాష్‌ట్యాగ్.. కారణం ఇదే!