ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ పోకో (Poco) తన మిడ్ రేంజ్ ఎక్స్ సిరీస్‌లో సరికొత్త మెుబైల్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ‘పోకో ఎక్స్6 సిరీస్’ పేరుతో కొత్త మెుబైల్‌ను లాంచ్ చేయనుంది. ఈ సిరీస్‌లో పోకో ఎక్స్6 (Poxo X6 5G), పోకో ఎక్స్6 ప్రో (Poxo X6 Pro 5G) అనే రెండు వేరియంట్లు ఉండనున్నాయి. గతంలో తీసుకొచ్చిన Poco X5 మెుబైల్‌కు అనుసంధానంగా కొత్త ఫోన్‌ను తీసుకొస్తున్నట్లు పోకో వర్గాలు ప్రకటించాయి. అయితే ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లు విడుదలకు ముందే లీకయ్యాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
మెుబైల్ స్క్రీన్
పొకో ఎక్స్6 ఫోన్.. 6.67 అంగుళాల అమోలెడ్ 1.5కే ఎల్టీపీఎస్ డిస్‌ప్లేతో రానున్నట్లు లీకైన సమాచారం చెబుతోంది. దీనికి 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందించారట. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 2 ఎస్వోసీ చిప్‌సెట్‌తో వస్తుందని భావిస్తున్నారు.
కెమెరా
ఈ పోకో మెుబైల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో తీసుకొస్తున్నట్లు తెలిసింది. ఫోన్ వెనుక భాగంలో 64 MP ప్రైమరీ సెన్సార్ కెమెరాతోపాటు 13 MP ఆల్ట్రావైడ్, 2 MP సెన్సార్ కెమెరా ఉండనున్నట్లు సమాచారం.
బ్యాటరీ
Poco X6 Seriesను పవర్‌ఫుల్ బ్యాటరీతో తీసుకొస్తున్నారు. 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు కలిగిన 5,000mAh బ్యాటరీని ఫోన్‌కు ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
కలర్ ఆప్షన్స్
Poco X6 మోడల్ ఫోన్.. బ్లాక్, గ్రే, ఎల్లో కలర్ ఆప్షన్స్‌లో లాంచ్ అవుతుందని సమాచారం. అలాగే Poco X6 Pro వేరియంట్.. బ్లాక్, బ్లూ, వైట్ రంగుల్లో లభిస్తుందని భావిస్తున్నారు.
ధర ఎంతంటే?
పొకో ఎక్స్6 సిరీస్.. జనవరి 11న భారత్‌లో లాంచ్ కానున్నట్లు టెక్ వర్గాలు భావిస్తున్నాయి. ఆ రోజే ఫోన్ ధర, ఫీచర్లపై స్పష్టత రానుంది. అయితే పొకో ఎక్స్6 సిరీస్ ప్రారంభ వేరియంట్ ధర రూ.15,999 వరకూ ఉండొచ్చని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!