నటీనటులు: ఆనంద్ దేవరకొండ, నయన్ సారిక, ప్రగతి శ్రీవాస్తవ్, రాజ్ అర్జున్, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, ప్రిన్స్ యావర్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, క్రిష్ణ చైతన్య
డైరెక్టర్ : ఉదయ్ బొమ్మిశెట్టి
సంగీతం : చైతన్ భరద్వాజ్
సినిమాటోగ్రఫీ : ఆదిత్య జవ్వడి
ఎడిటర్ : కార్తిక శ్రీనివాస్
నిర్మాతలు : వంశీ కృష్ణ, కేదర్ సెలగంశెట్టి
విడుదల తేదీ : 31-05-2024
విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) నటించిన లేటెస్ట్ చిత్రం.. ‘గం గం గణేశా’ (Gam Gam Ganesha). ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకుడు. ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక కథానాయికలు. జబర్దస్త్ ఇమ్మాన్యుయెల్, వెన్నెల కిశోర్, రాజ్ అర్జున్, సత్యం రాజేష్, ప్రిన్స్ యావర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ‘బేబీ’ లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత ఆనంద్ దేవరకొండ చేస్తున్న చిత్రం కావడంతో ఈ మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈ ఏడాది విజయ్ దేరరకొండ చేసిన ‘ఫ్యామిలీ స్టార్’ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. మరి సోదరుడు ఆనంద్ దేవరకొండ సినిమా అయినా సక్సెస్ కావాలని విజయ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మే 31న విడుదలైన ‘గం గం గణేశా’ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పిచిందా? లేదా?
కథేంటి
గణేష్ (ఆనంద్ దేవరకొండ).. స్నేహితుడు శంకర్ (ఇమ్మాన్యుయెల్)తో కలిసి చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాడు. అనూహ్య ఘటనల నేపథ్యంలో అతడికి పెద్ద దోపిడి చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఈ క్రమంలో శంకర్‌తో కలిసి వేసిన ప్లాన్ బెడిసి కొడుతుంది. దీంతో గణేష్‌కు కొత్త సమస్యలు ఎదురవుతాయి. మరోవైపు నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు కష్టపడుతుంటాయి. ఇంకోవైపు ముంబయిలో రెండు గ్యాంగ్‌ల మధ్య భీకర షూటౌట్ జరుగుతుంది. అయితే వాటికి గణేష్‌కు మధ్య సంబంధం ఏంటి? ఓ పొలిటిషన్, విగ్రహాన్ని దొంగతనం చేసే బ్యాచ్ గణేష్ జీవితాన్ని ఎలా ప్రభావితం చేశారు? వాటి నుంచి హీరో ఎలా బయటపడ్డాడు? హీరోయిన్ శ్రీవాస్తవతో అతడి లవ్‌ట్రాక్ ఏంటి? అన్నది కథ.
ఎవరెలా చేశారంటే
యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ.. గణేష్ పాత్రలో ఆకట్టుకున్నాడు. సెటిల్డ్ పర్ఫార్మెన్స్తో మెప్పించాడు. బేబీ చిత్రం తర్వాత నటుడిగా మరింత పరిణితి సాధించాడు. ఇమ్మాన్యుయెల్‌తో కలిసి అతడు చేసిన కామెడీ సినిమాకు ప్లస్ అయ్యింది. అటు హీరోయిన్ ప్రగతి శ్రీవాస్తవ అదరగొట్టింది. నీలవేణి పాత్రలో మెప్పించింది. హీరో హీరోయిన్ల మధ్య కెమెస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. మరో కథానాయిక నయన్ సారిక కూడా శ్రుతి పాత్రలో ప్రేక్షకులను అలరించింది. హాస్యనటులు వెన్నెల కిషోర్, ఇమ్మాన్యుయెల్ తమదైన కామెడీ ఆకట్టుకున్నారు. విలన్‌గా రాజ్ అర్జున్ నటన మెప్పిస్తుంది. మిగిలిన పాత్రధారులు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు ఉదయ్ బొమిశెట్టి రొటీన్ కథనే తీసుకున్నప్పటికీ సినిమాను క్రైమ్ & ఎంటర్టైనింగ్ ఫార్మెట్లో అద్భుతంగా రూపొందించారు. కథనం, కామెడీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ను దర్శకుడు బాగా వర్కౌట్ చేశాడు. ముఖ్యంగా హీరో – ఇమ్మాన్యుయెల్ – వెన్నెల కిషోర్ చుట్టూ రాసుకున్న కామెడీ ట్రాక్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. ఇక సెకండాఫ్‌లో వచ్చే ఊహించని ట్విస్టులు సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయి. ఆడియన్స్‌కు థ్రిల్‌ను పంచేలా దర్శకుడు ఆ సీన్లను తీర్చిదిద్దాడు. అయితే కొన్ని చోట్ల అసంబద్ద నారేషన్ సినిమాకు మైనస్‌గా మారింది. ఫస్టాఫ్ ఎంటర్టైన్మెంట్, సెకండాఫ్ ట్విస్టులు, థ్లిల్లింగ్ క్లైమాక్స్‌తో ఒక మంచి చిత్రాన్ని అందించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు.
టెక్నికల్‌గా
ఈ సినిమాకు పనిచేసిన టెక్నికల్ టీమ్ మంచి పనితీరును కనబరిచింది. మరి ముఖ్యంగా నేపథ్య సంగీతం మూవీకి హైలెట్‌గా నిలిచింది. చైతన్ భరద్వాజ్ తన క్యాచీ బీజీఎంతో సన్నివేశాలకు అదనపు ఆకర్షణను అందించాడు. సినిమాటోగ్రాఫర్ ఆదిత్య జవ్వడి పనితనం బాగుంది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడలేదు.
ప్లస్ పాయింట్స్
- ఆనంద్ దేవరకొండ నటన
- కామెడీ
- ట్విస్టులు
మైనస్ పాయింట్స్
- కథలో కొత్తదనం లేకపోవడం
- స్టోరీ నారేషన్‌లో తడబాటు
Telugu.yousay.tv Rating : 3/5
పబ్లిక్ టాక్ ఎలా ఉంది?
గం గం గణేశా చిత్రాన్ని చూసిన ఓ నెటిజన్.. ఇది పక్కా కామెడీ ఎంటర్టైనర్ అని చెబుతున్నారు. ఈ వీకెండ్ ఫుల్లుగా నవ్వుకోవచ్చని ఎక్స్‌లో పోస్టులు పెడుతున్నారు. ఆనంద్ ఖాతాలో మరో హిట్ చేరిందని కామెంట్ పెట్టాడు.
‘గం గం గణేశా’ డీసెంట్ సినిమా అని.. ట్విస్టులు, వినోదం సినిమాకు హైలెట్‌గా నిలిచాయని మరో నెటిజన్ పోస్టు పెట్టాడు.
స్టోరీలో కంటెంట్ మిస్ అయ్యిందని మరో నెటిజన్ పోస్టు పెట్టాడు. ఆనంద్ దేవరకొండ తన శక్తిమేర నటించాడని పేర్కొన్నాడు. కానీ అప్ టూ ద మార్క్ చేరుకోలేకపోయడని పోస్టు పెట్టాడు.
‘గం గం గణేశా’.. రిలాక్స్‌గా సీట్లో కూర్చొని ఎంజాయ్ చేసే మూవీ అని ఇంకో నెటిజన్ వ్యాఖ్యానించాడు. సందర్భానుసారంగా వచ్చే కామెడీ సూపర్బ్‌గా వర్కౌట్ అయ్యిందని చెప్పాడు.