• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Hide N Seek Movie Review: సిటీలో భయభ్రాంతులకు గురిచేసే మిస్టరీ మర్డర్స్‌.. ‘హైడ్‌ అండ్‌ సీక్‌’ మెప్పించిందా?

    నటీనటులు : విశ్వంత్‌, శిల్పా మంజునాథ్‌, రియా సచ్‌దేవా, తేజస్విని నాయుడు, వైవా రాఘవ, సుమంత్‌ వెరేళ్ల తదితరులు

    రచన, దర్శకత్వం : బాసిరెడ్డి రానా

    సంగీతం : లిజో కె. జోస్‌

    ఎడిటర్‌ : అమర్‌ రెడ్డి కుడుముల

    నిర్మాత : నరేంద్ర బుచ్చిరెడ్డిగారి

    విడుదల తేదీ: 20-09-2024

    కేరింత’, ‘మనమంతా’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటుడు విశ్వంత్. తాజాగా ఆయన హీరోగా నటించిన చిత్రం ‘హైడ్ ఎన్ సీక్’. సహస్ర ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై నరేంద్ర బుచ్చిరెడ్డిగారి నిర్మించారు. బసిరెడ్డి రానా దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ మూవీ టీజర్, ట్రైలర్ ఈ మూవీపై అంచనాలు పెంచాయి. ఈ శుక్రవారం (సెప్టెంబర్‌ 20) థియేటర్లో రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు అలరించిందో ఇప్పుడు చూద్దాం.

    కథేంటి

    కర్నూల్‌ నేపథ్యంలో కథ సాగుతుంది. శివ (విశ్వంత్) ఆర్మీ డాక్టర్ కావాలనే లక్ష్యంతో మెడిసిన్ చదువుతుంటాడు. తనతో పాటు కాలేజీలో చదువుతున్న వర్ష (రియా సచ్దేవ్)ను ప్రేమిస్తాడు. ఈ క్రమంలో సిటీలో ఒక డెలివరీ బాయ్‌ని ఒకతను ఏ కారణం లేకుండా రాడ్‌తో కొట్టి హత్య చేస్తాడు. అదే తరహాలో కారణం లేని హత్యలు, అర్థం కానీ నేరాలతో నగరం మొత్తం భయభ్రాంతులకు గురవుతుంది. ఈ వరుస మర్డర్ మిస్టరీలను ఛేదించేందుకు పోలీసు ఆఫీసర్ వైష్ణవి (శిల్పా మంజునాథ్‌) రంగంలోకి దిగుతుంది. అయితే ఆ హత్యలకు సంబంధించి పోలీసులు కూడా కనిపెట్టలేని క్లూస్‌ను శివ కనిపెడుతుంటాడు. దీంతో తమకు సాయం చేస్తున్నప్పటికీ శివనే సైకో కిల్లర్ అని పోలీసులు భావిస్తారు. అసలు శివను ఈ హత్యల్లో ఇరికించింది ఎవరు? ఈ వరుస హత్యల వెనుక ఉన్నది ఎవరు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

    ఎవరెలా చేశారంటే

    శివ పాత్రలో యువ నటుడు విశ్వాంత్‌ చక్కటి నటన కనబరిచాడు. హావభావాలను చక్కగా ప్రదర్శించాడు. కన్నడ హీరోయిన్ శిల్పా మంజునాథ్ లుక్స్ వైజ్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా సూట్ అయ్యింది. తెలుగు డైలాగ్స్ విషయంలో ఎక్కడా లిప్ సింక్ మిస్ అవ్వకుండా జాగ్రత్తపడిన తీరు ప్రశంసనీయం. హీరోయిన్‌గా రియా సచ్ దేవా కొన్ని సీన్లకే పరిమితమైంది. నటుడు సాక్షి శివ తన వాయిస్‌లోని బేస్‌తో నెగిటివ్ క్యారెక్టర్‌కు మంచి వేల్యూ యాడ్ చేశాడు. తన నటనతో ఆకట్టుకున్నాడు. మిగిలిన నటీనటులు తమ పరిధిమేరకు నటించి పర్వాలేదనిపించారు. 

    డైరెక్షన్ ఎలా ఉందంటే

    దర్శకుడు బసిరెడ్డి రానా ఈ సినిమాను ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్‌ గా మలచడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. మొదటి సీన్ నుంచి సినిమా అయిపోయే వరకు ప్రేక్షకుడిని సీటులోంచి కదలనీయకుండా చేయడంలో దర్శకుడు చాలా వరకూ సఫలీకృతమయ్యాడు. మొదటి మర్డర్ నుంచి విరామం వరకు స్క్రీన్ ప్లేను ఎంతో గ్రిప్పింగ్ రాసుకున్నారు. తరువాత ఏం జరగబోతుందో ఎవరి ఊహలకు అందనంతగా తెరపై ప్రెజెంట్ చేశారు. కథలో భాగంగా క్యారెక్టర్స్‌ను డిజైన్ చేసిన విధానం బాగుంది. పురాణాలలో ఒక కథకు లింక్ చేస్తూ స్టోరీని చెప్పడం ఆకట్టుకుంది. అయితే ఈ మోడ్రన్‌ వార్‌ ఫేర్‌ను కర్నూల్‌ లాంటి చిన్న సిటీలో ఇరికించడం కన్విన్సింగ్‌గా అనిపించదు. గేమింగ్‌కు యువత ఏ విధంగా బానిస అవుతున్నారో అన్న పాయింట్‌ను సరిగా ఎస్టాబ్లిష్‌ చేయలేకపోయారు. అక్కడక్కడ హ్యూమన్‌ ఎమోషన్స్ సరిగా క్యారీ కాలేదు. ఓవరాల్‌గా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సినిమాలను ఇష్టపడే వారిని ఈ సినిమా మెప్పిస్తుంది. 

    టెక్నికల్‌గా

    సాంకేతిక అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రాఫర్‌ మంచి ప్రతిభ కనబరిచాడు. లిజో కె. జోస్‌ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. సస్పెన్స్‌ ఇంకాస్త బాగా ఎలివేట్‌ చేయడంలో బీజీఎం ఉపయోగపడింది. ఎడిటింగ్ వర్క్‌ ఓకే. నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి. 

    ప్లస్‌ పాయింట్స్‌

    • విశ్వాంత్‌ నటన
    • కథలో కొత్తదనం
    • థ్రిల్లింగ్ అంశాలు

    మైనస్‌ పాయింట్స్‌

    • బలహీనమైన డ్రామా
    • స్పష్టత లేని సీన్స్‌

    Telugu.yousay.tv Rating : 2.5/5 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv