వివో ఇటీవలే తన ఎక్స్ ఫోల్డ్3 ప్రో స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన కలర్ ప్యాలెట్‌ను విస్తరించింది. ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్లో లిమిటెడ్ ఎడిషన్ “లూనార్ వైట్” వేరియంట్లో అందుబాటులోకి వచ్చింది. మొదట ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం “సెలెస్టియల్ బ్లాక్” రంగులో మాత్రమే లభించేది.
కానీ ఇప్పుడు వివో, భారతీయ వినియోగదారుల కోసం “లూనార్ వైట్” కలర్ వేరియంట్‌ను విడుదల చేసింది. వివో ఎక్స్ ఫోల్డ్3 ప్రో లూనార్ వైట్ భారత మార్కెట్లో 16GB RAM మరియు 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 1,59,999 గా నిర్ణయించారు. ఈ స్మార్ట్‌ఫోన్ వివో ఇండియా ఇ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్ మరియు వివో బ్రాండ్ స్టోర్లు, అలాగే భాగస్వామి రిటైల్ అవుట్లెట్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.
బ్యాంకు ఆఫర్లు
పోటెన్షియల్ బయ్యర్లను ఆకర్షించడానికి వివో, ప్రత్యేకంగా ఆఫర్లు ప్రవేశపెట్టింది. అందులో ఒకటి ఈజీ EMI ఆప్షన్, దీని ద్వారా కస్టమర్లు నెలకు రూ. 6666 నుండి EMI ద్వారా 24 నెలల్లో పేమెంట్ చేయవచ్చు. ఈ పద్ధతిలో ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా, ముందస్తు చెల్లింపుల అవసరం లేకుండా సౌకర్యవంతంగా చెల్లింపులు చేసుకునే అవకాశం ఉంది. అంతేకాదు, HDFC బ్యాంక్, SBI బ్యాంక్, DBS బ్యాంక్ మరియు IDFC ఫస్ట్ బ్యాంక్ కార్డులు ఉపయోగించే కొనుగోలు దారులకు 10% వరకు తక్షణ క్యాష్‌బ్యాక్ కూడా అందుబాటులో ఉంది, ఇది వివో ఎక్స్ ఫోల్డ్3 ప్రోని మరింత ఆకర్షణీయంగా మారుస్తోంది.
ఫీచర్లు
వివో ఎక్స్ ఫోల్డ్3 ప్రో తన డ్యూయల్-డిస్ప్లే డిజైన్‌తో ప్రత్యేకతను పొందింది. ఇందులో 8.03-అంగుళాల 2K+ E7 AMOLED LTPO ప్రధాన డిస్ప్లే, 6.53-అంగుళాల FHD+ AMOLED LTPO కవర్ డిస్ప్లే ఉన్నాయి. ఈ రెండు స్క్రీన్లు 1-120Hz డైనమిక్ రిఫ్రెష్ రేట్, HDR 10+, డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తాయి. గరిష్ఠంగా 4500 నిట్స్ బ్రైట్‌నెస్‌ని అందిస్తాయి. ఇందులో ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ ఉపయోగించారు. ఇది 16GB LPDDR5X ర్యామ్, 512GB UFS 4.0 స్టోరేజ్‌తో పాటు వస్తుంది. ఇది అన్ని టాస్క్‌లలో స్మూత్ పనితీరును అందిస్తుంది.
ఫోటోగ్రఫీ ప్రియులకు వివో ఎక్స్ ఫోల్డ్3 ప్రో అద్భుతమైన కెమెరా సెట్‌అప్‌తో ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులోని OIS జైస్ T* కోటింగ్ కలిగిన 50MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా, 64MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఉంది. భద్రత కోసం, ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్-డిస్ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ అందుబాటులో ఉంది. వివో ఎక్స్ ఫోల్డ్3 ప్రో కేవలం పనితీరు ఫోటోగ్రఫీ మాత్రమే కాకుండా, బిల్డ్ క్వాలిటీ విషయంలోనూ ముందంజలో ఉంది. ఇది స్ప్లాష్ రెసిస్టెంట్ (IPX8) ఫీచర్ కలిగి ఉంది.
కనెక్టివిటీ విషయానికి వస్తే, 5G, Wi-Fi 802.11 ax, బ్లూటూత్ 5.4 LE, అనేక నావిగేషన్ సిస్టమ్‌లకు సపోర్ట్ ఇస్తుంది. బ్యాటరీ లైఫ్ పరంగా, ఇందులో 5700mAh బ్యాటరీ ఉంది, ఇది 100W ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్లెస్ ఛార్జింగ్, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సామర్థ్యాలతో అట్రాక్ట్ చేస్తుంది..
Celebrities Featured Articles Telugu Movies
Samantha: నన్ను ‘సెకండ్ హ్యాండ్, యూజ్డ్’ అంటున్నారు!