• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Best 5G Smart Phones: అతి తక్కువ ధరలో మంచి ఫీచర్లు ఉన్న 5G స్మార్ట్ ఫొన్లు ఇవే

    దసరా, దీపావళి పండుగలు సీజన్ ప్రారంభమయ్యాయి. మీరు మంచి ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని అనుకుంటే ఇది మీకొక సదవకాశం.  ప్రత్యేకంగా రూ. 12,000 లోపు 5G స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, మీకు ఇది ఉపయోగపడే సమాచారం. ఇక్కడ మీరు కోరుకున్న ఫీచర్లకు అనుగుణంగా టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లను అందిస్తున్నాం.

    ఫస్ట్  టైం  కొనుగోలు చేసేవారిని దృష్టిలో ఉంచుకుని పలు స్మార్ట్ ఫొన్ కంపెనీలు బడ్జెట్ స్థాయిలో స్మార్ట్‌ఫోన్‌లు విడుదల చేస్తున్నాయి. భారత మార్కెట్లో రూ. 12,000లోపు కూడా చాలా మంచి 5G-స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

    రూ. 12,000 లోపు 5 ఉత్తమ 5G స్మార్ట్‌ఫోన్‌లు:

    1. Samsung Galaxy M15 5G:

    ధర: రూ.10,999
    ఇది 2024లో రూ. 11,000 లోపు బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటి. 6.5-అంగుళాల AMOLED డిస్ప్లే, 6000mAh భారీ బ్యాటరీతో పాటు, స్టోరేజ్ విస్తరణ కోసం మైక్రో SD కార్డ్ స్లాట్ ఉంది.

    2. Motorola G45 5G:

    ధర: రూ.11,999
    ఇది 8GB RAM, 128GB స్టోరేజ్, స్నాప్‌డ్రాగన్ 6S Gen 3 ప్రాసెసర్, Android 14 OS తో అందుబాటులో ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 6.5-అంగుళాల HD+ డిస్ప్లే వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.

    3. iQOO Z9 Lite 5G:

    ధర: రూ.10,498
    ఇది 5G సపోర్ట్‌తో కూడిన సరికొత్త ఎంట్రీ లెవల్ ఫోన్. 6.56 అంగుళాల 90Hz డిస్ప్లే, 50MP ప్రధాన కెమెరా, 5000mAh బ్యాటరీతో పాటు IP64 వాటర్ రేసిస్టెన్స్ కూడా ఉంది.

    4. Nokia G42 5G:

    ధర: రూ.11,499
    స్టాక్ ఆండ్రాయిడ్‌ను అందించే ఈ ఫోన్ HMD Global నుండి వచ్చింది. ఇది 6GB RAM, 5000mAh బ్యాటరీ, 20W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు 50MP AI కెమెరా వంటి ఫీచర్లను కలిగి ఉంది.

    5. POCO M6 Pro 5G

    ధర: రూ.10,749
    ఇది స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్‌తో, 6.79-అంగుళాల FHD+ డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్‌ వంటి ప్రత్యేకతలు కలిగిన ఉత్తమ బడ్జెట్ ఫోన్.

    స్మార్ట్‌ఫోన్ కొనుగోలులో పరిశీలించాల్సిన ముఖ్యాంశాలు:

    1. డిస్‌ప్లే: AMOLED లేదా FHD+ డిస్‌ప్లేలు మంచి వీక్షణ అనుభవాన్ని అందిస్తాయి. 90Hz లేదా 120Hz రిఫ్రెష్ రేట్ గేమింగ్, స్క్రోలింగ్ కోసం ఫ్లూయిడ్ అనుభవం ఇస్తుంది. మీ స్మార్ట్‌ ఫొన్ ఇలాంటి డిస్‌ప్లే కలిగి ఉండేలా చూసుకోండి.
    2. ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ లేదా మిడియా టెక్ ప్రాసెసర్‌లు ఎంట్రీ-లెవల్ ఫోన్‌లో మంచి పనితీరు, వేగం మరియు మల్టీటాస్కింగ్ సామర్థ్యాన్ని అందిస్తాయి.
    3. బ్యాటరీ: ఎక్కువ మిలీఆంపియర్ (mAh) బ్యాటరీలు నిరంతరం పనిలో ఉండే వారికి ఉపయోగకరంగా ఉంటాయి. 5000mAh పైగా ఉండే బ్యాటరీలు ఎక్కువ కాలం స్టాండ్బై టైం అందిస్తాయి.
    4. కెమెరా: 50MP లేదా అంతకంటే ఎక్కువ MPతో ఉండే కెమెరాలు మంచి చిత్రాలను తీస్తాయి. AI కెమెరా ఫీచర్లు కూడా క్వాలిటీ ఇమేజ్‌ ప్రాసెసింగ్‌కి సహాయపడతాయి.
    5. స్టోరేజ్ & ర్యామ్: 6GB లేదా 8GB RAM ఎక్కువ అప్లికేషన్లు యాక్సెస్ చేయడంలో మరియు స్మూత్‌గా పనిచేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. 128GB స్టోరేజ్ కూడా అధిక డేటా సేవ్ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది.
    6. సాఫ్ట్‌వేర్: Android 14 వంటి లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫీచర్లు, కొత్త అప్డేట్స్ మరియు సెక్యూరిటీ ప్యాచ్‌లు ఈ ఫోన్‌లను భద్రంగా ఉంచుతాయి.

    కొనుగోలు సమయంలో సూచనలు:

    1. కస్టమర్ రివ్యూలు: వివిధ పరికరాలపై యూజర్ ఫీడ్‌బ్యాక్‌ను పరిశీలించడం ఉత్తమం.
    2. వారంటీ: కనీసం 1 సంవత్సరపు మాన్యుఫ్యాక్చరర్ వారంటీతో ఉన్న ఫోన్ కొనుగోలును పరిగణించండి.
    3. ఆఫ్టర్ సేల్స్ సపోర్ట్: మంచి సర్వీస్ సెంటర్ మరియు ఆఫ్టర్ సేల్స్ సపోర్ట్ ఉండటం అవసరం. ముఖ్యంగా చిన్న నగరాలు లేదా పట్టణాలలో ఉండే వినియోగదారులు ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.

    ఈ సమాచారంతో, మీరు మంచి ఎంట్రీ లెవల్ 5G స్మార్ట్‌ఫోన్‌ను ఈ పండుగ సీజన్‌లో సులభంగా ఎంపిక చేసుకోవచ్చు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv