నటీనటులు : అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి, ఎన్.టి. రామస్వామి, గణేష్ డి.ఎస్, రవి కళాబ్రహ్మ, వాణి గౌడ తదితరులు
రచన, దర్శకత్వం : స్మరణ్ రెడ్డి
సంగీతం : ప్రిన్స్ హెన్రీ
సినిమాటోగ్రఫీ : మోహన్ చారీ, అస్కర్ అలీ
ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాత : హేమలతా రెడ్డి
విడుదల తేదీ: 18-10-2024
అంజన్ రామచంద్ర, శ్రావణిరెడ్డి కీలక పాత్రల్లో స్మరన్‌రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘లవ్‌రెడ్డి’ (Love Reddy Movie Review). ఎన్.టి. రామస్వామి, గణేష్ డి.ఎస్, రవి కళాబ్రహ్మ, వాణి గౌడ పాత్రలు పోషించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను రిలీజ్ చేయడంతో ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల వచ్చిన ట్రైలర్ కూడా సినిమాపై ఆసక్తిని పెంచింది. ఈ క్రమంలో అక్టోబరు 18న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆడియన్స్‌ను మెప్పించిందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
నారాయణ రెడ్డి (అంజన్ రామచంద్ర)కి 30 ఏళ్ల వయసు వచ్చినా పెళ్లి కాదు. ఇంట్లో వాళ్లు ఎన్ని సంబంధాలు చూసినా అమ్మాయి నచ్చలేదని రిజెక్ట్ చేస్తుంటాడు. ఓ రోజు బస్‌లో దివ్య(శ్రావణి రెడ్డి)ని చూసి తొలి చూపులోనే ప్రేమిస్తాడు. లవ్‌రెడ్డిగా మారి ఆ అమ్మాయియే లోకంగా మారిపోతాడు. దివ్య కూడా నారాయణ రెడ్డితో స్నేహం చేస్తుంది. ఓ రోజు ధైర్యం చేసి నారాయణ తన ప్రేమ విషయాన్ని దివ్యతో చెబుతాడు. దివ్య మాత్రం అతని ప్రపోజల్‌ని రిజెక్ట్ చేస్తుంది. లవ్‌రెడ్డిపై ఇష్టం ఉన్నప్పటికీ దివ్య ఎందుకు రిజెక్ట్ చేసింది? దివ్య ఎంట్రీతో నారాయణ రెడ్డి లైఫ్ ఎలాంటి మలుపు తిరిగింది? వీరి ప్రేమ కథ చివరికి సుఖాంతం అయ్యిందా? లేదా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
‘లవ్‌రెడ్డి’ సినిమాలో నటించినవారంతా కొత్త వాళ్లే. భగ్నప్రేమికుడు నారాయణరెడ్డి పాత్రలో అంజన్ రామచంద్ర ఒదిగిపోయాడు. తొలి సినిమానే అయినా తనదైన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. ఇక దివ్య పాత్రకు శ్రావణి రెడ్డి న్యాయం చేసింది. హీరోయిన్ తండ్రిగా చేసిన ఎన్.టి రామస్వామి నటన అందరినీ ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌లో ఆయన ఇచ్చే ట్విస్ట్ మెప్పిస్తుంది. హీరోని ఇష్టపడే అమ్మాయి స్వీటీగా జ్యోతి మదన్ కొన్ని చోట్ల నవ్వులు పూయించారు. హీరో తమ్ముడిగా చేసిన నటుడుతో పాటు ఇతర పాత్రదారులు తమ పరిధిమేరకు మెప్పించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
పరువు ప్రతిష్ట అనే కీలకమైన అంశంతో సాగే స్వచ్ఛమైన ప్రేమ కథగా దర్శకుడు స్మరణ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. రొటిన్ స్టోరీనే అయినప్పటికీ ఆంధ్రా – కర్ణాటక నేటివిటితో చాలా సహజంగా తెరకెక్కించారు. పెళ్లి చూపుల సీన్‌తో సినిమాను ప్రారంభించిన డైరెక్టర్, హీరో లవ్‌రెడ్డిగా మారిన తర్వాత నుంచి కథను ఆసక్తికరంగా మార్చారు. అయితే తన ప్రేమను వ్యక్తం చేయడానికి హీరో చేసే ప్రయత్నాలు రొటీన్‌గా అనిపిస్తాయి. లవ్ రెడ్డిని దివ్య ప్రేమిస్తుందా? లేదా? అన్న క్యూరియాసిటీతోనే ఫస్టాఫ్ గడిచిపోతుంది. సెకండాఫ్‌లో హీరో ప్రేమను రిజెక్ట్ చేయడం, అందుకు చెప్పిన కారణం నేటి యూత్‌కు బాగా కనెక్ట్ అవుతుంది. చివరి 20 నిమిషాలు అయితే చాలా ఎమోషనల్‌గా నడిపారు దర్శకుడు. క్లైమాక్స్‌తో ప్రేక్షకుల హృదయాలను బరువెక్కించాడు. ఓవరాల్‌గా దర్శకుడిగా స్మరణ్ రెడ్డి మంచి మార్కులు సంపాదించుకున్నాడని చెప్పాలి
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే ప్రిన్స్ హేన్రి సంగీతం సినిమాకు ప్రధాన బలం. తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. పాటలు ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి ఫ్రేమ్‌ని తెరపై రిచ్‌గా చూపించాడు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్
- నటీ నటులు
- భావోద్వేగాలు
- సంగీతం
మైనస్ పాయింట్స్
- రొటీన్ స్టోరీ
- ఫస్టాఫ్‌లో సాగదీత సీన్స్