టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న స్పై యాక్షన్ సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్నీ’ త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సిరీస్‌లో వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, మరో కీలక పాత్రలో సామ్ యాక్ట్ చేస్తోంది. ఈ సిరీస్‌ను ‘ది ఫ్యామిలీ మ్యాన్’, ‘ఫర్జీ’ వంటి విజయవంతమైన సిరీస్‌లను అందించిన రాజ్ అండ్ డీకే ఈ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘సిటాడెల్’కి ఇది అధికారిక రీమేక్. ఇందులో ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో నటించింది. ప్రస్తుతం ఈ సిరీస్‌లో నటించిన నటీనటులు ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు.
ఈ వెబ్ సిరీస్ నవంబర్ 7న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్కు రానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదలైన ‘సిటాడెల్: హనీ బన్నీ’ ట్రైలర్ ఫుల్ యాక్షన్ ప్యాక్‌తో అలరించింది. ముఖ్యంగా సమంత చేసిన యాక్షన్ సీన్స్ అలరించాయి.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ ట్రైలర్ సిరీస్‌పై భారీ అంచనాలు పెంచింది.ఇప్పుడు విడుదలైన రెండో ట్రైలర్ కూడా సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. (Samantha)యాక్షన్ సన్నివేశాలతో కడుపు కట్టేసే విధంగా ట్రైలర్లో కనిపించిన సమంత ఆకట్టుకుంది. తన స్టంట్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు చూసి ఆడియెన్స్ ఆశ్చర్యపోతున్నారు. కొంతమంది అభిమానులు అయితే, సమంత నటనను ప్రియాంక చోప్రా వెర్షన్ కంటే మెరుగ్గా ఉందని ప్రశంసిస్తున్నారు.
ఈ సిరీస్‌లో సమంత “హనీ”గా, వరుణ్ ధావన్ “బన్నీ”గా అదరగొట్టారని అభిమానులు చెబుతున్నారు. సామ్ యాక్షన్ సన్నివేశాలు, అదిరిపోయే యాక్టింగ్‌తో సరికొత్తగా కనిపించింది. ఇప్పటివరకు సమంత చేసిన ఇతర యాక్షన్ రోల్స్ కంటే మరింత బలంగా, పవర్‌ఫుల్‌గా ఆమెను ఈ సిరీస్‌లో చూపిస్తున్నారు.
అయితే ఇటీవల విడుదలైన ట్రైలర్లో సమంత ఫేస్‌పై నెటిజన్లు చర్చిస్తున్నారు. మళ్లీ ఆమె ముఖానికి ఏమైంది అని కామెంట్ చేస్తున్నారు.(Samantha Ruth Prabhu) సామ్ ముఖం, హీరోయిన్ సంయుక్త మీనన్లాగా మారిపోయిందంటూ కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆ ఫొటో చూస్తే నిజంగానే ఆమె ఐస్ గతంలో కంటే కాస్త భిన్నంగా ఉన్నాయి.
ఇంకొంత మంది సమంత తన అందం కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని వాదిస్తున్నారు. మమోసైటిస్ వ్యాధి భారిన పడ్డ తర్వాత ముఖంలో వచ్చిన మార్పులను సరి చేసుకునేందుకు ఆమె పలుమార్లు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని కామెంట్ చేస్తున్నారు. అయితే ఇంకొంత మంది మాత్రం మయోసైటిస్ వ్యాధి నయం కోసం సామ్ చాలా పవర్ఫుల్ ట్యాబ్లెట్ వాడిందని.. వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఆమె ముఖంపై ప్రభావం చూపించిందని చెబుతున్నారు.
రెండేళ్ల క్రితం సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. దాదాపు ఆ వ్యాధితో సామ్ ఏడాదికిపైగా పోరాడింది. ఆ సమయంలో సమంత తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్లింది. చికిత్స తీసుకుంటూ స్నేహితులతో కలిసి దేశ విదేశీ టూర్లు చేసి ఆ బాధ నుంచి కొంత రిలీఫ్ పొందింది. మయోసైటిస్ వ్యాధి వల్ల శరీరం, ముఖంపై వస్తున్న మార్పులు గమనించిన సామ్.. పూర్తిగా ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని భావించింది. ఏడాది పాటు సినిమాలకు దూరంగా కూడా ఉంది. విజయ దేవరకొండతో కలిసి ఖుషి సినిమా ద్వారా తిరిగి రీఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత శాకుంతలం సినిమాలోనూ నటించింది. ఆ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రాణించకపోవడంతో ప్రస్తుతం సామ్.. సిటాడెల్ సిరీస్‌పైనే ఆశలు పెట్టుకుంది.