టాలీవుడ్‌కు చెందిన యంగ్ హీరోయిన్లలో ప్రియాంక జావల్కర్ (Priyanka Jawalkar) ఒకరు. సెకండ్ చిత్రం ‘టాక్సీవాలా’తో సాలిడ్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ తన అందంతో అందరి దృష్టి ఆకర్షించింది. ఆ తర్వాత సత్యదేవ్, కిరణ్ అబ్బవరం వంటి స్టార్స్‌తో సినిమాలు చేసిన పెద్దగా కలిసి రాలేదు. రీసెంట్గా టిల్లు స్క్వేర్ చిత్రంలో స్పెషల్ అప్పిరియన్స్ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇదిలా ఉంటే ఇవాళ (నవంబర్ 12) ప్రియాంక జావల్కర్ పుట్టిన రోజు (HBD Priyanka Jawalkar). 31వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో ఆమె లైఫ్‌లోని ఆసక్తికర విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ప్రియాంక జావల్కర్ను చూసి హిందీ బ్యూటీ అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఆమె అచ్చ తెలుగు అమ్మాయి.
ఏపీలోని అనంతపురంలో 1992 నవంబర్ 12 ప్రియాంక జన్మించింది. హైదరాబాద్‌లో ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సు చదివింది.
ఆపై స్టాటిస్టిక్స్‌లో 8 నెలల కోర్సు చేసేందుకు అమెరికా వెళ్లింది. అది పూర్తయ్యాక ఓ మల్టీనేషనల్ కంపెనీలో ఆరు నెలల పాటు జాబ్ చేసింది.
ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో తన ఫొటోలు అప్లోడ్ చేయడం మెుదలు పెట్టింది. అవి చూసి ఇంప్రెస్ అయిన ‘కలవరం ఆయె’ టీమ్.. ఆమెకు హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చింది.
అయితే ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. కానీ ఈ అమ్మడు అందం, అభినయానికి మాత్రం తెలుగు ఆడియన్స్ ఫిదా అయ్యారు.
దీంతో విజయ్ దేవరకొండ సరసన ‘టాక్సీవాలా’లో అమ్మడికి ఛాన్స్ దొరికింది. ఆ సినిమా సాలిడ్ హిట్ అందుకోవడంతో ప్రియాంక పేరు మార్మోగింది.
ఆ సినిమా సక్సెస్‌తో ఈ అమ్మడికి ఇక తిరుగుండదని అంతా భావించారు. కానీ అనూహ్యంగా తన నెక్స్ట్ సినిమా రిలీజ్‌కు ప్రియాంక మూడేళ్ల సమయం తీసుకుంది.
టాక్సీవాల సక్సెస్ తర్వాత సరైన కథల కోసం ఎదురుచూసినట్లు ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక జావల్కర్ తెలిపింది. ఈ క్రమంలో 25 స్టోరీలను రిజెక్ట్ చేసినట్లు చెప్పింది.
‘టాక్సీవాలా’ తర్వాత సత్యదేవ్‌తో చేసి ‘తిమ్మరుసు’ మూవీ చేసింది. ఇది కూడా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇందులో ప్రియాంక నటనకు మరోమారు ఆడియన్స్ ఫిదా అయ్యారు.
దాని తర్వాత కిరణ్ అబ్బవరంతో చేసిన ‘ఎస్.ఆర్. కళ్యాణమండపం’ కూడా మంచి విజయాన్ని అందుకుంది.
‘తిమ్మరుసు’, ‘ఎస్.ఆర్. కళ్యాణమండపం’ చిత్రాలు ఒకే వారంలో రిలీజ్ కావడం విశేషం. తను చేసిన రెండు మూవీస్ సెక్సెస్ సాధించడంతో ఈ అమ్మడి సంతోషానికి అవధులు లేకుండా పోయింది.
‘తిమ్మరుసు’ సినిమాలో బొద్దుగా కనిపించడంతో ప్రియాంకపై విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. ఆమె శరీరాకృతి కొందరు విమర్శలు గుప్పించారు.
అయితే ట్రోల్స్, గాసిప్స్ గురించి తాను అస్సలు పట్టించుకోనని ప్రియాంక జావల్కర్ ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది. తనపై వచ్చే గాసిప్స్‌ను ఫ్రెండ్స్‌కు షేర్ చేసి మరి సంతోషిస్తానని తెలిపింది.
ఆ తర్వాత ‘గమనం’ అనే ఆంథాలజీ ఫిల్మ్‌లో ప్రియాంక నటించింది. అందులో జారా అనే ముస్లిం యువతి పాత్రలో ఆకట్టుకుంది.
ఈ ఏడాది సిద్ధు జొన్నలగడ్డ హీరోగా చేసిన ‘టిల్లు స్క్వేర్’లో ఈ అమ్మడు స్పెషల్ క్యామియో ఇచ్చింది. పబ్ సీన్లో హాట్ హాట్‌గా కనిపించి కుర్రకారు హృదయాలను మెలిపెట్టింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే తనకు క్రష్ అని ప్రియాంక ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. పుష్ప చిత్రం తనను ఎంతగానో ఆకట్టుకుందని తెలిపింది.
ప్రియాంక జావల్కర్‌కు బాగా ఇష్టమైన నటి ఐశ్వర్యరాయ్. తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో ఈ అమ్మడు అనర్గళంగా మాట్లాడగలదు.
ఈ భామ ఫేవరేట్ కలర్స్ రెడ్, బ్లాక్. న్యూయార్ అంటే తనకు చాలా ఇష్టమని ఓ ఇంటర్వూలో తెలిపింది.
సినిమాల విషయానికి వస్తే భాషతో సంబంధం లేకుండా అన్ని సినిమాలు చూస్తానని ప్రియాంక తెలిపింది. అయితే మలాయళంలో వచ్చిన ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ అంటే బాగా ఇష్టమని తెలిపింది.
ప్రస్తుతం ఏ ప్రాజెక్ట్స్ చేతిలో లేకపోవడంతో ప్రియాంక సోషల్ మీడియాపై ఈ అమ్మడు ఫోకస్ పెట్టింది. హాట్ ఫొటోలను షేర్ చేస్తూ దర్శక నిర్మాతలను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది.
ప్రస్తుతం ప్రియాంక ఇన్స్టాగ్రామ్ ఖాతాను 2.1 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఈ అమ్మడు ఏ ఫొటో షేర్ చేసిన వెంటనే ట్రెండింగ్ చేస్తున్నారు.
Celebrities Featured Articles Movie News
Anasuya Bharadwaj: రౌడీ బాయ్‌ను మళ్లీ గెలికిన అనసూయ! దూరపు కొండలు అంటూ..