అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘పుష్ప 2’ దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా రిలీజ్ కోసం సినీ లవర్స్ కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. మరో తొమ్మిది రోజుల్లో సినిమా రిలీజ్ ఉండటంతో మేకర్స్ వరుసగా ప్రమోషన్స్ నిర్వహిస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం (నవంబర్ 24) చెన్నైలో స్పెషల్ ఈవెంట్ నిర్వహించారు. ‘కిస్సిక్’ ఐటెం సాంగ్‌ను సైతం రిలీజ్ చేశారు. అనంతరం బన్నీ తన మెస్మరైజింగ్ స్పీచ్‌తో తమిళ ఆడియన్స్ ఆకట్టుకున్నారు. అయితేే ఇది బన్నీ ఓన్ స్పీచ్ కాదని ‘కేజీఎఫ్’ హీరో యష్ గతంలో చేసిన ప్రసంగాన్ని కాపీ కొట్టాడని నెట్టింట ప్రచారం జరుగుతోంది. అటు కేజీఎఫ్ 2 స్టోరీ, ప్రచార చిత్రాలను (Pushpa 2 vs KGF 2) సైతం మూవీ టీమ్ మక్కీకి మక్కీ దించిందని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
స్పీచ్.. సేమ్ టూ సేమ్
కన్నడ స్టార్ యష్ (Yash) హీరోగా ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో రూపొందిన కేజీఎఫ్: ఛాప్టర్ 1 (KGF: Chapter 1) బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. 2018లో ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లో గ్రాండ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకలో హీరో యష్ తెలుగులో మాట్లాడి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. మనం ఎక్కడికి వెళ్తే అక్కడి నేలను, భాషను, సంస్కృతిని గౌరవించాలని యష్ అన్నాడు. అయితే ‘పుష్ప 2’ చెన్నై ఈవెంట్‌లో బన్నీ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేయడం గమనార్హం. తమిళంలో మాట్లాడిన బన్నీ ఇక్కడి మట్టి (నేల అర్థం వచ్చేలా)ని తాను గౌరవిస్తానని చెప్పాడు. తాను ఎక్కడ నిలబడితే ఆ నేలను గౌరవిస్తానని అన్నాడు. దుబాయి వెళ్తే అరబిక్, పాట్నా వెళ్తే హిందీ, కేరళ వెళ్తే మలయాళంలో సొల్లుతా అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో అక్కడి వారంతా చప్పట్లు కొడుతూ బన్నీని అభినందించారు. అయితే యష్ చెప్పిన మాటలకు బన్నీ స్పీచ్ (Pushpa 2 vs KGF 2) దగ్గర ఉండటంతో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. కేజీఎఫ్ కాన్సెప్ట్, పోస్టర్లు, ఎలివేషన్సే కాకుండా స్పీచ్ కూడా కాపీ కొట్టావా? అంటూ నవ్వు ఎమోజీలను షేర్ చేస్తున్నారు.
కథ కూడా కాపీయేనా?
‘కేజీఎఫ్ 2’కు ‘పుష్ప 2’ అన్ అఫిషియల్ రీమేక్ (Pushpa 2 vs KGF 2) అంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ‘పుష్ప 2’ ట్రైలర్‌ను గమనిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుందని కామెంట్స్ కూడా చేస్తున్నారు. ట్రైలర్‌లోని కొన్ని సీన్స్ ‘కేజీఎఫ్ 2’ను ప్రతిబింబిస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు. ‘కేజీఎఫ్ 2’ చివర్లో రాకీభాయ్ సైతం భార్య మాట వింటాడు. అలాగే ‘పుష్ప 2’ ట్రైలర్‌లో శ్రీవల్లి మాట వింటానని పుష్పరాజ్ చెబుతాడు. ‘కేజీఎఫ్ 2’ క్లైమాక్స్‌లో శత్రువుల దాడిలో రాకీభాయ్ భార్య చనిపోతుంది. ‘పుష్ప 2’ ట్రైలర్‌లో చితి దగ్గర బన్నీ నిలబడటం చూపించారు. అది శ్రీవల్లిదేనని జోరుగా ప్రచారం చేస్తున్నారు. భార్య మరణం తర్వాత రాకీభాయ్ సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. అలాగే పుష్ప రాజ్ కూడా క్లైమాక్స్‌లో విశ్వరూపం చూపిస్తాడని ట్రైలర్ చివర్లో హింట్ ఇచ్చారు. అంతేకాదు ‘కేజీఎఫ్: ఛాప్టర్ 1’లో రాకీభాయ్ పేరు స్థానికంగా మాత్రమే తెలుస్తుంది. ‘పార్ట్ 2’కు వచ్చేసరికి దేశవ్యాప్తంగా అతడి పేరు మార్మోగుతుంది. అదే విధంగా ‘పుష్ప’లో నల్లమల్ల ప్రాంతానికే పరిమితమైన పుష్పరాజ్ క్రేజ్ సెకండ్ పార్ట్‌కు వచ్చేసరికి దేశం దాటి అంతర్జాతీయ లెవల్లోకి వెళ్లిపోయినట్లు చూపించారు. వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని ‘కేజీఎఫ్ 2’కి కాపీగా ‘పుష్ప 2’ వస్తోందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. డిసెంబర్ 5న దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.
పోస్టర్లకు సైతం ‘కేజీఎఫ్ 2’ రిఫరెన్స్!
ప్రమోషన్స్‌లో భాగంగా రిలీజ్ చేసిన ‘పుష్ప 2’ (Pushpa 2 vs KGF 2) పోస్టర్లు సైతం ‘కేజీఎఫ్ 2’ సినిమాలో యష్ పోస్టర్స్‌కు దగ్గరగా ఉన్నాయంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. గతంలో కేజీఎఫ్ టీమ్ రిలీజ్ చేసిన తరహాలోనే రెడ్ థీమ్‌తో ‘పుష్ప 2’ బిగ్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ ఉండటాన్ని హైలెట్ చేస్తున్నారు. అలాగే ‘కేజీఎఫ్ చాప్టర్ 1’కు సంబంధించి పోస్టర్‌లో రాకీభాయ్ (యష్) భుజానా గన్ పెట్టుకొని ఉంటాడు. ‘పుష్ప 2’ కూడా బన్నీ భుజానా గన్ పెట్టుకొని నడుస్తూ వస్తున్న పోస్టర్‌ను రిలీజ్ చేసింది. అలాగే ‘కేజీఎఫ్ 2’ రిలీజ్ డేట్ పోస్టర్‌లో యష్‌ను బ్యాక్ సైడ్ నుంచి చెప్పారు. అలాగే ‘పుష 2’ 75 డేస్ టూ గో పోస్టర్‌లో సైతం బన్నీని వెనకి వైపు నుంచి చూపించారు. ఈ రెండింటి ఫొటోల కలర్ థీమ్ కూడా యాజ్ ఇట్ ఈజ్‌గా ఉన్నయంటూ కామెంట్స్ వచ్చాయి. ఇలా ‘పుష్ప 2’ నుంచి వచ్చిన చాలా వరకూ ప్రమోషన్ పోస్టర్స్ ‘కేజీఎఫ్’, ‘కేజీఎఫ్ 2’ చిత్రాలకు దగ్గరగా ఉండటం ఆరోపణలకు ఊతం ఇచ్చింది. ఓసారి ఆ పోస్టర్లను మీరూ చూసేయండి.
‘పుష్ప’ రిలీజ్ సమయంలోనూ ఇంతే!
2021లో వచ్చిన ‘పుష్ప’ (Pushpa: Part 1) ఎవరూ ఊహించని విధంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. టాలీవుడ్‌కు మాత్రమే పరిమితం అవుతుందనుకున్న ఈ సినిమా జాతీయ స్థాయిలో బ్లాక్ బాస్టర్‌గా నిలిచింది. అయితే ‘పుష్ప’ స్టోరీ ఫార్మూలా కేజీఎఫ్’ (KGF)కు సిమిలర్‌గా ఉందంటూ అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ప్రతీ సీన్‌ను కనెక్ట్ చేస్తూ నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ‘కేజీఎఫ్’లో బంగారం ఉంటే ‘పుష్ప’ (Pushpa 2 vs KGF 2)లో ఎర్రచందనం పెట్టారని ఆరోపించారు. కేజీఎఫ్ తరహాలోనే కేశవ వాయిస్ ఓవర్‌తో కథను నడిపించారని ఆరోపించారు. ఈ రెండు చిత్రాల్లో హీరోయిన్స్ తొలుత హీరోలను వ్యతిరేకించారని, చివరికీ వారితో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారని గుర్తుచేశారు. ఇద్దరు హీరోలకు బాల్యంలో తల్లితో శాడ్ సెంటిమెంట్ ఉందని గుర్తుచేశారు. సాధారణ వ్యక్తిగా విలన్ల గ్రూప్‌లోకి వచ్చిన హీరో వారందరినీ తొక్కుకుంటా నాయకుడైన తీరు కూడా సిమిలర్‌గా ఉందని చెప్పారు. స్టోరీలో డిఫరెన్స్ ఉన్నప్పటికీ ఓవరాల్ థీమ్ చూస్తే ‘కేజీఎఫ్’ను ‘పుష్ప’తో కాపీ కొట్టారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి.
Celebrities Featured Articles Telugu Movies
Samantha: నన్ను ‘సెకండ్ హ్యాండ్, యూజ్డ్’ అంటున్నారు!