• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Akhanda 2: ‘అఖండ 2’ లేటెస్ట్‌ ప్రోమోలో ఇది గమనించారా? మతిపోవాల్సిందే!

    నట సింహం బాలక‌ష్ణ (Balakrishna), యాక్షన్‌ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ’ (Akhanda) ఎలాంటి బ్లాక్ బస్టర్ సాధించిందో అందరికీ తెలిసిందే.  ఈ సూపర్ హిట్ మూవీకి ఇప్పుడు సీక్వెల్‌గా ‘అఖండ 2’ (Akhanda 2) తెరకెక్కుతోంది. రీసెంట్‌గా ఈ మూవీని  గ్రాండ్‌గా లాంచ్ కూడా చేశారు. దీంతో ఈ మూవీ అప్‌డేట్స్ కోసం బాలయ్య ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ‘అఖండ 2’ నుంచి క్రేజీ అప్‌డేట్‌ బయటకొచ్చింది. 

    వచ్చే దసరాకు రిలీజ్‌..

    బాలయ్య – బోయపాటి కాంబోలో రానున్న ‘అఖండ 2’ (Akhanda 2) రిలీజ్‌కు సంబంధించి మేకర్స్‌ అదిరిపోయే అనౌన్స్‌మెంట్‌ ఇచ్చారు. ఈ మూవీ రిలీజ్ డేట్ (Release Date) అనౌన్స్ చేస్తూ స్పెషల్‌ పోస్టర్‌, ప్రోమో వీడియోను విడుదల చేశారు. వచ్చే ఏడాది దసరాకు ఈ సినిమా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. సెప్టెంబర్‌ 25, 2025న ఈ సినిమాను వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ స్పష్టం చేశారు. లేటెస్ట్‌ ప్రోమోలో బాలయ్య చెప్పిన డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. మూవీ లాంచ్‌ టైమ్‌లో బాలయ్య చెప్పిన డైలాగ్‌ను ఈ ప్రోమోకు బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే చేశారు. దానికి శివుడు తాండవం చేస్తున్నట్లు గ్రాఫిక్స్‌ విజువల్స్‌ చూపించారు. ప్రస్తుతం ఈ ప్రోమో బాలయ్య అభిమానులకు గూస్‌బంప్స్‌ తెప్పిస్తోంది.

    ‘అఖండ’తో బిగ్గెస్ట్‌ హిట్‌

    బాలయ్య – బోయపాటి శ్రీను కాంబోలో గతంలో వచ్చిన ‘అఖండ’ చిత్రం భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. 2021లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అఖండ’ (Akhanda) బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్​గా నిలిచింది. ముఖ్యంగా అఖండ సినిమాకు తమన్ అదిరిపోయే నేపథ్య సంగీతాన్ని అందించారు. థమన్‌ BGM దెబ్బకు థియేటర్స్​లో సౌండ్​ బాక్స్​లు కూడా షేక్ అయిపోయాయి. ఆ సినిమా విజయంలో తమన్ అందించిన మ్యూజిక్ కీలక పాత్ర పోషించిందనడంలో ఏమాత్రం సందేహాం లేదు. ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం చేయగా హీరోయిన్​గా ప్రగ్యా జైశ్వాల్ నటించింది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా ‘అఖండ 2’ వస్తుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 

    అది బోయపాటికే సాటి..

    ఇప్పటివరకు బాలయ్య – బోయపాటి కాంబోలో మూడు చిత్రాలు రాగా అవి సూపర్‌ హిట్‌గా నిలిచాయి. వీరి హిట్‌ జర్నీ ‘సింహా’ సినిమాతో మెుదలైంది. నందమూరి అభిమానులు బాలయ్య నుంచి ఏం కోరుకుంటున్నారో ఆ విధమైన కథ, డైలాగ్స్‌తో సినిమా తీసి విజయం సాధించారు బోయపాటి. ఆ తర్వాత వచ్చిన ‘లెజెండ్‌’, ‘అఖండ’ చిత్రాలు సైతం ఈ కోవలోనే వచ్చి భారీ విజయాలు సాధించాయి. బాలయ్యకు ఎలాంటి కథలు సెట్‌ అవుతాయి.. పాత్రకు తగ్గట్లు ఆయన్ను ఎలా మౌల్డ్‌ చేయాలన్నది బోయపాటి తెలిసినంతగా మరే డైరెక్టర్‌కు తెలియదని నందమూరి ఫ్యాన్స్‌ అంటుంటారు. అటువంటి ఈ ఇద్దరి కలయికలో నాల్గో చిత్రం వస్తుండటంతో ఫ్యాన్స్‌ తెగ ఖుషి అవుతున్నారు.

    సంక్రాంతి బరిలో బాలయ్య

    నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ కొల్లి రూపొందిస్తున్న చిత్రం ‘డాకు మహారాజ్’ (Daaku Maharaj). సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ 2025 సంక్రాంతికి థియేటర్స్‌‌‌‌లో రాబోతోంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి టీజర్, ట్రైలర్ సాంగ్స్ ఆడియన్స్లో ఆసక్తిని పెంచేశాయి. బాలయ్య కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఇది 109వ చిత్రంగా రూపొందింది. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్  హీరోయిన్స్‌‌‌‌గా నటిస్తుండగా, బాబీ డియోల్, చాందిని చౌదరి కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2025 జనవరి 12న సినిమా విడుదల కాబోతోంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv