• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Lucky Bhaskar Movie Dialogues: లక్కీ భాస్కర్ చిత్రంలో గూస్‌బంప్స్ తెప్పించిన టాప్ డైలాగ్స్ ఇవే

    ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో లక్కీ భాస్కర్  మంచి జనాదారణ పొందింది. ఆ చిత్రంలోని  డైలాగ్‌లు సగటు మధ్యతరగతి జీవి జీవన చిత్రాన్ని కళ్లకు కట్టాయి. ప్రస్తుతం ఈ సంభాషణలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ డైలాగ్స్‌ కోసం నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ చిత్రంలో వచ్చిన టాప్ డైలాగ్స్ ఇప్పుడు చూద్దాం.

    lucky Bhaskar Movie Dialogues

    “ఈ సముద్రంలో ఉన్న ప్రశాంతత జనాల్లో ఉండదు, పరుగెడుతూనే ఉంటారు. కారణం డబ్బు”.

    “ఒక రోజులో ఒక్క అరగంట నాకు నచ్చినట్లుగా జరగలేదు, దానికే జీవితాంతం ఏడుస్తూ కూర్చోలేను కదా!”

    “ఇన్ని కష్టాల్లో నేనున్నా, బోర్డర్‌లైన్‌ దరిద్రంలో బతుకుతున్నా, వాళ్లింట్లో ఇష్టం లేకపోయినా, నేనే కావాలని నన్ను చేసుకుంది. సుమతి, నా బలం, నా భార్య “.

    “అన్ని సార్లూ డబ్బులతో పని అవ్వదు సార్, కొన్నిసార్లు ఇలాంటి పార్టీలు కూడా ఇవ్వాలి.“

    “మావాడికి నమ్మకం ఎక్కువ, నాకు జాగ్రత్త ఎక్కువ సార్. పదండి మనం వెళ్దాం.”

    లక్కీ భాస్కర్ కొడుకు చెప్పే డైలాగ్

    “నా ఫ్రెండ్స్ నన్ను ఏడిపించేవాళ్లు నాన్న, కార్తీక్ గాడు అందరి బర్త్‌డేస్‌లకి వచ్చి, ఫ్రీగా కేక్ తినేసి వెళ్తాడు, కానీ ఎప్పుడూ బర్త్‌డే పార్టీ ఇవ్వడు అని. ఈరోజు తర్వాత వాళ్లెవరూ నన్ను ఏడిపించరు. ఆ అరుణ్, ఏరా మా ఇంటికి ఎప్పుడొచ్చినా, సేమ్ టీషర్ట్ వేసుకుని వస్తావ్, నీకు వేరే టీషర్టే లేదా అని అరుణ్ అనేవాడు, ఈరోజు నన్ను ఈ టీషర్ట్‌లో చూసి షాక్ అయిపోయాడు అమ్మా. ఈరోజు నుంచి మీరు ఏం చెప్తే, అది చేస్తా, పొద్దున్నే లేస్తా, బాగా చదువుతా. ఇంకా, మీరు పెద్దయ్యే వరకు బొమ్మలు కూడా కొనియ్యొద్దు.“

    “జూదం అలవాటైన ప్రతి ఒక్కడూ, మానేద్దామనే అనుకుంటాడు.కానీ, ఆశ తలకి తగలగానే కొత్త కారణం వెతుక్కుని, మళ్లీ మొదలుపెడతాడు, నేనూ మొదలుపెట్టాను, దిస్ టైమ్ బిగ్గర్, బెటర్.“

    “ఇలాంటప్పుడే అనిపిస్తుంది, ఫ్యామిలీ కోసం ఎంత చేసినా తప్పు లేదని”.

    “భాస్కర్ అమ్ముడుపోవాలని డిసైడ్ అయితే, భాస్కర్ రేటు భాస్కర్ చెబుతాడు.”

    “మిడిల్ క్లాస్ మెంటాలిటీ సార్, ఖర్చులన్నీ తగ్గించుకుని రూపాయి రూపాయి దాచుకుంటాం, పంతం వస్తే ఒక్క రూపాయి కూడా మిగలకుండా ఖర్చు పెట్టేస్తాం సార్.“

    నగల షాపులో చెప్పే డైలాగ్

    “నేను వెళ్లింది నగలు మాత్రమే కొనడానికి కాదు సార్, వాడి అహంకారాన్ని కొనడానికి. అవమానించిన వాడితోనే సలాం కొట్టించుకున్నాను సార్, ఎవ్రీ రూపీ వర్త్ ఇట్ సార్.“ lucky Bhaskar Movie Dialogues

    “దిస్ ఈజ్ ఇండియా, వస్తువు కావాలంటే డబ్బుతో కొనాలి, రెస్పెక్ట్ కావాలంటే డబ్బు మన వంటి మీద కనపడాలి.“

    “సుమతీ, ఐ యామ్ నాట్ బ్యాడ్, ఐ యామ్ జస్ట్ రిచ్, డబ్బు ఉన్నవాడిని ఈ సమాజం ఎప్పుడూ చెడ్డోడిలా చూస్తుంది. అన్‌పోర్చునేట్లీ నువ్వు కూడా నన్ను అలానే చూస్తున్నావు…!

    ”ఆకలికి మించిన ఆహారం, అవసరానికి మించిన సంపాదన, రెండూ విషంతో సమానం. ఆ విషం నా తలకెక్కుతున్న రోజులవి.”

    “దేవుడు సార్, పొగరు బలిసినప్పుడల్లా జీవితం మీద ఒక్క లెంపకాయ వేస్తుంటాడు సార్, అంతే సెట్ అయిపోతాం.”

    డబ్బు ఇచ్చే కిక్కు డైలాగ్

    “సిగరెట్, ఆల్కహాలు, డ్రగ్స్ ఇచ్చే కిక్కు కన్నా, డబ్బు ఇచ్చే కిక్కే ఎక్కువ, స్టాక్ మార్కెట్లో వచ్చేంత డబ్బులు, ఇంకా ఏ వ్యాపారంలో రావు సార్. ఇంతే ఒక రోజు గెలిచినా, ఇంకోరోజు ఓడినా, ఈరోజు ఒకడు చచ్చినా ఆపబుద్ధి కాదు, ఆపలేము సార్.”

    “వాడు కామన్ మ్యాన్… అన్ని ప్రాబ్లమ్స్ తీర్చేసుకుని ప్రశాంతంగా పడుకోగలడు“

    “డబ్బుంటేనే మర్యాద.. ప్రేమ.“


    “కుటుంబం కోసం మొదలుపెడతాం, కానీ వెళ్లే కొద్దీ ఆట మత్తులో కుటుంబాన్నే మర్చిపోతాం… భాస్కర్, వేగంగా నడిపే బండి, వేగంగా వచ్చే రూపాయి, రెండూ మనిషిని ఎప్పుడో ఒకప్పుడు కింద పడేస్తాయి”.(lucky Bhaskar Movie Dialogues)

    “ఎందుకంటే, జూదంలో నువ్వు ఎంత గొప్పగా ఆడావన్నది ముఖ్యం కాదు, ఎప్పుడు ఆపావన్నదే ముఖ్యం.”

    “గెలిచి ఓడితే ఆ ఓటమే గుర్తుంటుంది, ఓడి గెలిస్తే ఆ గెలుపు చరిత్రలో నిలుస్తుంది, ఎందుకంటే హిస్టరీ ఓన్లీ రిమెంబర్స్ హౌ యూ ఫినిష్డ్.“

    దేవుడు రెడ్ సిగ్నల్ వేశాడు అంటే.. అన్నీ ఆపేయమని అర్థం!

    మాటల్లో ఇంత అహంకారం….అహంకారం కాదు.. ధైర్యం!

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv