నటీనటులు: వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల, శియా గుప్తా, రవితేజ మహాదాస్యం, మురళీధర్ గౌడ్, అనీష్ కురువిల్లా, బాహుబలి ప్రభాకర్, భద్రం, నాగ్ మహేశ్, ప్రభావతి తదితరులు
రచన, దర్శకత్వం: రైటర్ మోహన్
సంగీతం: సునీల్ కశ్యప్
సినిమాటోగ్రఫీ: ఎన్.మల్లికార్జున్
నిర్మాత: వెన్నపూస రమణారెడ్డి
విడుదల తేదీ: 25-12-2024
వెన్నెల కిషోర్ (Vennela Kishore) హీరోగా నటించిన తాజా చిత్రం ‘శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్’ (Srikakulam Sherlock Holmes). ప్రముఖ రచయిత మోహన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అనన్య నాగళ్ల, స్నేహ గుప్తా తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ మూవీ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
షెర్లాక్ హోమ్స్‌గా (Srikakulam sherlock holmes Review) పిలవబడే ఓం ప్రకాష్ (వెన్నెల కిషోర్) శ్రీకాకుళంలో ఓ డిటెక్టివ్‌గా పని చేస్తుంటాడు. ఈ క్రమంలో అతడికి వైజాగ్‌లో జరిగిన ఓ మర్డర్ కేసు సాల్వ్ చేయమని ఛాలెంజ్ వస్తుంది. ఈ కేసులో మొత్తం ఏడుగురు అనుమానితులు బాలకృష్ణ (రవితేజ మహాదాస్యం), భ్రమరాంబ (అనన్య నాగళ్ళ), రమేష్ పట్నాయక్(ప్రభాకర్) తదితరులని మార్క్ చేస్తాడు. ఇంతకీ ఆ మర్డర్‌లో చనిపోయింది ఎవరు? హత్యతో ఈ ఏడుగురికి నిజంగానే సంబంధం ఉందా? ఎందుకు చంపారు? నిజంగానే ఓం ప్రకాష్ ఈ కేసు సాల్వ్ చేశాడా? లేదా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
డిక్టెటివ్ షెర్లాక్ పాత్రకు వెన్నెల కిషోర్ న్యాయం చేశాడు. అయితే శ్రీకాకుళం యాసలో ఆయన పలికే సంభాషణలో సహజత్వం లోపించింది. తనకు ఎంతో బలమైన కామెడీని ఈ పాత్రలో పండించలేకపోయాడు. నిజానికి కామెడీకి పెద్దగా స్కోప్ ఇవ్వలేదు. అనన్య నాగళ్లకు మంచి పాత్ర లభించింది. భ్రమరాంబ పాత్రలో బాగా చేసింది. పాత్రకు తగ్గట్లు వేరియేషన్స్ చూపించింది. అనీష్ కురివెళ్ల రోల్ బాగున్నప్పటికీ ఆతడి పాత్రకు వేరొకరి చేత డబ్బింగ్ చెప్పించడం సింక్ కాలేదు. రవితేజ మహద్యం, బాహుబలి ప్రభాకర్, మురళీధర్ గౌడ్, నాగ్ మహేష్ తదితరులు తమ పరిధిమేరకు చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు రైటర్ మోహన్ ఓ వినోదాత్మక క్రైమ్ థ్రిల్లర్ స్టోరీని ఎంచుకున్నప్పటికీ స్క్రీన్‌ప్లే విషయంలో తడబడ్డాడు. 1991 నాటి ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కోణం నుంచి సినిమాను మెుదలపెట్టిన డైరెక్టర్.. ఆ వెంటనే కథకు సంబంధించిన మర్డర్‌ను చూపించి ఆసక్తి పెంచాడు. మెుత్తం ఏడుగురు అనుమానితులను తెరపైకి తీసుకొచ్చి అసలు దోషి ఎవరన్న దానిపై సెస్పెన్స్ క్రియేట్ చేశాడు. చివరి వరకూ హంతకుడ్ని రివీల్ చేయకుండా ఆసక్తిని మెయిన్‌టెన్ చేయడంలో దర్శకుడు సఫలమయ్యాడు. అయితే హంతకుడ్ని పట్టుకొనే క్రమంలో వచ్చే పరిశోధన ఏమాత్రం ఆసక్తిగా అనిపించదు. మధ్య మధ్యలో వచ్చే కామెడీ కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టులు మాత్రం ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తాయి. ప్రధానంగా డిటెక్టివ్ చిత్రాల్లో కనిపించే థ్రిల్లింగ్ మూమెంట్స్ మిస్ అయ్యాయి.
సాంకేతికంగా..
టెక్నికల్ అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ బాగుంది. సునీల్ కశ్యప్ అందించిన సంగీతం ఏమాత్రం మెప్పించలేదు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పదునుపెడితే బాగుండేంది. నిర్మాణ విలువలు మాత్రం కథకు తగ్గట్లు ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
- కథలో కొత్తదనం
- అనన్య నాగళ్ల నటన
- సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టులు
మైనస్ పాయింట్స్
- ప్రథమార్ధం
- థ్రిల్లింగ్ మూమెంట్స్ లేకపోవడం
- సంగీతం
Celebrities Featured Articles
Revanth Reddy: సీఎం రేవంత్‌పై విరుచుకుపడ్డ హీరోయిన్.. సినీ పెద్దల భేటిపై మరో నటి ఫైర్!