తిరుపతిలో వైకుంఠద్వార దర్శనం టోకెన్ల జారీ సమయంలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్షమాపణలు తెలిపారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన భక్తుల కుటుంబాలకు సానుభూతి తెలపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
“ఈ సంఘటన జరగకూడదు. ప్రభుత్వ పరంగా బాధ్యత వహిస్తున్నాం. క్షమాపణలు కోరుతున్నాం. ఈ దుర్ఘటనలో క్షతగాత్రులకే కాకుండా, రాష్ట్ర ప్రజలందరికీ, వేంకటేశ్వర స్వామి భక్తులకు, హైందవ ధర్మాన్ని నమ్మిన ప్రతి ఒక్కరికి క్షమాభిప్రాయాలు తెలుపుతున్నాం,” అని ఆయన తన ఆవేదన వ్యక్తం చేశారు.
తితిదే సిబ్బందిపై నిప్పులు చెరిగిన పవన్
తొక్కిసలాటకు అధికారుల క్రమశిక్షణ లోపమే కారణమేనని ఆరోపించారు. “క్రౌడ్ మేనేజ్‌మెంట్‌లో తితిదే సిబ్బంది వైఫల్యం చెందిందన్నారు. పోలీసులు, అధికారులు అక్కడ ఉన్నా ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోవడం దారుణం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలి,” అని అన్నారు.
వీఐపీలు కాక సామాన్యులపై దృష్టి పెట్టాలి
“తితిదే, వీఐపీలపై మాత్రమే కాకుండా సామాన్య భక్తుల అవసరాలపైనా దృష్టి పెట్టాలి. తితిదే పాలక మండలి సభ్యులు మృతుల కుటుంబాలను కలసి క్షమాపణలు చెప్పాలి. తితిదే ఈవో, అదనపు ఈవో తమ బాధ్యతను స్వీకరించాలి,” అని పవన్ కల్యాణ్ సూచించారు.
పోలీసులపై విమర్శలు
తొక్కిసలాట సమయంలో పోలీసులు తమ బాధ్యత నిర్వహించలేదనే ఆరోపణలు వచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ, “పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతమంది అధికారులు ఉన్నా తొక్కిసలాట ఎందుకు జరిగిందో పరిశీలించాల్సి ఉంది. ఇది కావాలని చేసారా అనే అనుమానాలపై దర్యాప్తు అవసరం,” అని ఆయన పేర్కొన్నారు.
వేచిచూడే పరిస్థితులు మారాలి
పవన్ కల్యాణ్ తిరుమలలో భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మాట్లాడుతూ, “శ్రీవారి దర్శనానికి 8-9 గంటల వేచి చూడడం బాధాకరం. ఇది పూర్తిగా తొలగించాలి. భక్తులకు 1-2 గంటల్లో దర్శనం అయ్యేలా తితిదే చర్యలు తీసుకోవాలి,” అని డిమాండ్ చేశారు.
బాధ్యత వహిస్తాం
“తొక్కిసలాట సమయంలో ఎమర్జెన్సీ ప్రణాళికలు అమలు చేయడంలో లోపాలు ఉన్నాయి. అధికారులు చేసిన తప్పులు ప్రభుత్వంపై ప్రభావం చూపుతున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సమగ్ర పునర్వ్యవస్థాపన చేయాలని ముఖ్యమంత్రికి నివేదించబోతున్నాను,” అని పవన్ కల్యాణ్ తెలిపారు.
తిరుపతిలో జరిగిన ఈ ఘటన భక్తులందరికీ శోకాన్ని కలిగించింది. బాధితులకు ప్రభుత్వం సరైన న్యాయం చేయాలని, తితిదే మరియు పోలీసులు తమ విధుల్లో మరింత జాగ్రత్తగా ఉండాలని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. భక్తులకు సురక్షితమైన మరియు సజావుగా దర్శనం కల్పించేందుకు తితిదే పునరాలోచన చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్