ప్రపంచ చెస్ దిగ్గజాలకు ఓటమి రుచి చూపించి కొన్నేళ్లుగా చదరంగం క్రీడల్లో మకుటం లేని మహారాజుగా కొనసాగుతున్న మాగ్నస్ క్లార్‌సన్‌కి ఓ 16 ఏళ్ల భారతీయ బాలుడు షాకిచ్చాడు. విశ్వనాథన్ ఆనంద్, కొనేరు హంపి, లలిత్ కుమార్లాంటి గ్రాండ్ మాస్టర్లు సైతం ఎదుర్కొలేకపోయిన మాగ్నస్‌ని ఓడించి చరిత్ర సృష్టించాడు. ఇంతకి ఆ బాలుడు ఎవరు..? అతడి నేపథ్యం ఏంటో తెలుసా..?
నేపథ్యం ఇదే
తమిళనాడులోని చెన్నైలో(2005, ఆగస్టు 10) రమేశ్‌బాబు ప్రజ్ఞానంద జన్మించారు. ఇతడు చిన్నప్పటి నుంచి చెస్‌పై మక్కువతో కఠోర సాధన చేశాడు. ఏడేళ్ల వయసులోనే ఫిడే మాస్టర్‌గా నిలిచాడు. 2015లో అండర్-10 టైటిల్ నెగ్గి అందరి దృష్టి ఆకర్షించాడు. 2016లో ఇంటర్నేషనల్ మాస్టర్‌గా నిలిచి ప్రపంచంలోనే అతి పిన్న వయసులో ఈ ఘనత సాధించిన వ్యక్తిగా చరిత్ర క్రియేట్ చేశాడు.
ఎన్నో రికార్డులు క్రియేట్
ప్రజ్ఞానంద చెస్ టోర్నీల్లో ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాడు. ఇతడు 2013లో అండర్-8 వరల్డ్ చెస్ ఛాంపియన్ షిష్ టోర్నీ గెలుపొందాడు. 2017లో గ్రాండ్ మాస్టర్ నామ్‌కి సెలక్టయ్యాడు. 2018లో గ్రాండ్ మాస్టర్‌గా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు. 2019లో 2600 ఎలో మార్క్ దాటిన రెండో పిన్న వయస్కుడిగా నిలిచాడు. 2019, అక్టోబర్‌లో అండర్-18 వరల్డ్ యూత్ ఛాంపియన్ షిప్‌గా ఎదిగాడు. అదే ఏడాది డెన్మార్క్‌లో నిర్వహించిన ఎక్స్ట్రాకన్ చెస్ ఓపెన్ టోర్నీ నెగ్గాడు. 2022లో ఏకంగా ప్రపంచ ఛాంపియన్ అయిన మాగ్నస్పైనే గెలుపొందాడు.
కార్ల్‌సన్‌ని ఎలా ఓడించాడు..?
ఎయిర్‌థింగ్స్ మాస్టర్స్ ఆన్లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నీలో నార్వే దేశానికి చెందిన ప్రపంచ నెం.1 మాగ్నస్ అప్పటికే మూడు వరుస విజయాలు నమోదు చేశాడు. కాని ప్రజ్ఞానంద మాత్రం మొదటి రోజు ఆడిన నాలుగు గేమ్‌లలో మూడు ఓడిపోయాడు. రెండో రోజు మాగ్నస్‌ని ఎదుర్కొవడం కష్టమని తెలిసినప్పటికీ ఎంతో ఆత్మవిశ్వాసంతో నల్ల పావులతో ఆటను ఆరంభించాడు. ఎత్తులకు పై ఎత్తులు వేసి 39 ఎత్తుల్లో 8 పాయింట్లతో ప్రపంచ ఛాంపియన్ని ఓడించాడు. అదే ఆత్మవిశ్వాసంతో 10 రౌండ్లలో అండ్రీ ఎసిపెంకో, 12వ రౌండ్లో అలెగ్జాండ్రా కోస్టిన్యూక్లపై విజయం సాధించి ప్రస్తుతం 15 పాయింట్లతో 12వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. ప్రజ్ఞానంద గెలుపు పట్ల సచిన్ లాంటి ప్రపంచ దిగ్గజ క్రీడాకారులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
టోర్నీ నెగ్గాలంటే
మొత్తం 15 రౌండ్లు సాగే ఈ టోర్నీలో ప్రజ్ఞానంద ఛాంపియన్‌గా రాణించాలంటే ఇంకా దూకుడుగా ఆడాల్సి ఉంది. ప్రస్తుతం మొదటి దశలో సాగుతున్న పోటీల్లో టాప్-8గా నిలిచిన వారే నాకౌట్ దశకు చేరుకుంటారు. ప్రజ్ఞానంద తన తదుపరి మ్యాచులను జర్మనీకి చెందిన విన్సెట్ కీమర్, అమెరికా ప్లేమర్ హాన్స్ మోకె నీమన్, రష్యాకి చెందిన వ్లాదిస్లేవ్తో ఆడనున్నాడు.
Celebrities Featured Articles Hot Actress
Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి