పొన్నియన్ సెల్వన్.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పేరు వినిపిస్తోంది. మణిరత్నం తన సినిమాతో ఈ నవలకు మరింత హైప్ క్రియేట్ చేశాడు. అసలు ఎవరీ పొన్నియన్ సెల్వన్..? అతడి గొప్పదనం ఏంటి? వంటి అంశాలను క్లుప్తంగా తెలుసుకుందాం.
రాజరాజ చోళుడే పొన్నియన్ సెల్వన్..( Who is Ponniyan selvan)
చోళ సామ్రాజ్యాధినేత రాజరాజచోళుడినే పొన్నియన్ సెల్వన్‌గా పిలుస్తుంటారని చరిత్ర చెబుతోంది. సుందర చోళుడి కుమారుడు. చిన్నగా ఉన్న రాజ్యాన్ని అఖండ సామ్రాజ్యంగా తీర్చిదిద్దిన చక్రవర్తిగా పొన్నియన్ సెల్వన్ ప్రసిద్ధికెక్కాడు. సోదరి కుందవి సాయంతో చోళ సామ్రాజ్యాన్ని సముద్రాంతరాలకు విస్తరింపజేశాడు. లక్ష్యద్వీప్లను స్వాధీనం చేసుకున్నాడు. వేంగి చాళుక్యుల నుంచి అధికారాన్ని పొందాడు. కళింగను తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. ఉత్తర శ్రీలంకలో పాగా వేశాడు. ఇలా తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. వాణిజ్యం కోసం.. చైనాకు తొలి మిషన్‌ని పంపించాడు.
భూ సర్వేకు శ్రీకారం..
స్థానిక సంస్థలు బలంగా ఉండాలని పొన్నియన్ సెల్వన్ విశ్వసించేవాడు. అందుకే క్షేత్రస్థాయిలో పటిష్ఠమైన వ్యవస్థను ఏర్పాటు చేశాడు. స్వతంత్ర ప్రతిపత్తి సాధించేందుకు కృషి చేశాడు. తన పరిపాలనను ప్రజలకు చేరవేసేందుకు ఎన్నో శాసనాలను వేయించాడు. తాను వచ్చాకే.. నూతన నాణేలను ముద్రించడం ప్రారంభించారు. భూ సర్వేను చేయించాలని కంకణం కట్టుకున్న తొలిరాజు పొన్నియన్ సెల్వన్. క్రీ.శ 985 నుంచి క్రీ.శ.1014వరకు అఖండ చోళ రాజ్యాన్ని పరిపాలించిన నేతగా చరిత్రకెక్కారు.
బృహదీశ్వర ఆలయ నిర్మాత..
తంజావూరులో చరిత్రాత్మకమైన బృహదీశ్వర ఆలయాన్ని నిర్మించింది ఈయనే. క్రీ.శ.1010లో ఈ ఆలయాన్ని నిర్మించారు. యునెస్కో వారసత్వ గుర్తింపును పొందిన ఆలయం ఇది. 2010తో వెయ్యి సంవత్సరాలను పూర్తి చేసుకుంది. రాజరాజ చోళుడు గొప్ప శివ భక్తుడు అయినప్పటికీ ఎన్నో వైష్ణవ ఆలయాలను నిర్మింపజేశాడు. కవులను ఆదరించాడు. సాహిత్యాన్ని ప్రోత్సహించాడు.
Celebrities Featured Articles Movie News
Anasuya Bharadwaj: రౌడీ బాయ్‌ను మళ్లీ గెలికిన అనసూయ! దూరపు కొండలు అంటూ..