అడల్ట్ వుడ్ అంటే.. తెలుగులో వయోజన స్థితి. ఒక వ్యక్తి పూర్తి శారీరక, మానసిక పరిపక్వత పొందుతున్న జీవన దశను అడల్ట్‌వుడ్ అంటారు. ఈ దశలో స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ, జీవితంలో నిలదొక్కుకునే సమయంలో ఎదురయ్యే(Adulthood Telugu Movies) సవాళ్లు, కుటుంబ సమస్యలు, ప్రేమ, ఆర్థిక స్వావలంబన వంటి సామాజిక అంశాలు ప్రభావం చూపుతాయి. తెలుగులో ఈ జనర్‌లో చాలా సినిమాలే వచ్చాయి. అయితే ప్రేక్షాకాదరణ పొందిన కొన్ని చిత్రాలను ఇక్కడ అందిస్తున్నాం. మీరు ఓ లుక్ వేయండి.
Contents
- 1 Jersey
- 2 Ee Nagaraniki Emaindi
- 3 Chi La Sow
- 4 C/o Kancharapalem
- 5 Brochevarevarura
- 6 Ninnila Ninnila
- 7 Raja Raja Chora
- 8 Nootokka Jillala Andagadu
- 9 Balagam
- 10 Pareshan
- 11 Nuvvu Naaku Nachchaav
- 12 Vedam
- 13 Bommarillu
- 14 Keedaa Cola
- 15 Seethamma Vakitlo Sirimalle Chettu
- 16 Miss Shetty Mr Polishetty
- 17 Pilla Zamindar
- 18 Josh
- 19 Rowdy Boys
- 20 Middle Class Melodies
Jersey
అర్జున్ రంజీ క్రికెటర్, ఎప్పటికైనా ఇండియన్ టీమ్‌లో ఆడాలని కలలు కంటాడు. అయితే 26 సంవత్సరాల వయసులో ఓ కారణం వల్ల క్రికెట్‌కు దూరమవుతాడు. ఆ తరువాత ఆర్ధిక సమ్యసల వల్ల అలాగే తన కొడుకు కోసం 36 ఏళ్ల వయసులో మళ్లీ క్రికెట్ ఆడడం మొదలు పెడుతాడు. ఈక్రమంలో అతను ఎలాంటి పరిస్థులను ఎదుర్కున్నాడు? ఇంతకి అర్జున్ నేషనల్ టీంలో సెలక్ట్ అయ్యాడా ? అనేది మిగిలిన కథ.
Ee Nagaraniki Emaindi
నలుగురు యువకులు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. అనివార్య కారణాలతో వారు విడిపోతారు. వారిలో ఒకరి పెళ్లి ఫిక్స్ కావడంతో అందరూ ఒక్కటవుతారు. అనుకోని పరిస్థితుల్లో వారంతా గోవాకు వెళతారు? అక్కడ వారు ఏం చేశారు? గోవా ట్రిప్ వారిలో తీసుకొచ్చిన మార్పు ఏంటి? అన్నది కథ.
Chi La Sow
అర్జున్ (సుశాంత్) తల్లితండ్రులు అంజలి(రుహాని శర్మ)తో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. అంజలి ఎన్నో బాధ్యతలు ఉన్న మధ్యతరగతి అమ్మాయి. అంజలిని చూసిన అర్జున్ పెళ్లికి ఒప్పుకున్నాడా? వీరి పెళ్లి చూపులు ఎలా జరిగింది? అన్నది కథ. (Adulthood Telugu Movies)
C/o Kancharapalem
కంచరపాలెంలో మెుదలైన నాలుగు ప్రేమకథలు వారి జీవితాల్లో ఎలాంటి మలుపులకు కారణమయ్యాయి? ఈ నాలుగు జంటలకు ఉన్న సంబంధం ఏంటి? చివరకు వారి కథలు ఎలా ముగిశాయి? అన్నది కథ.
Brochevarevarura
పరీక్షల్లో ఫెయిలై ఖాళీగా సమయం వృథా చేస్తున్న ముగ్గురు విద్యార్థులు తమ కాలేజీలో మిత్ర అనే అమ్మాయితో స్నేహం చేస్తారు. ఆమెకు తండ్రితో ఓ సమస్య వస్తుంది. మిత్రను ఆ సమస్య నుంచి బయట పడేలా చేస్తారు. కానీ వారు చిక్కుల్లో పడతారు. (Adulthood Telugu Movies)
Ninnila Ninnila
పలు సమస్యలతో బాధపడుతున్న దేవ్, తార ఓ రెస్టారెంటులో చెఫ్‌గా పనిచేస్తుంటారు. అనుకోకుండా వీరిద్దరి ఆ రెస్టారెంట్‌లో రాత్రంతా ఇరుక్కుపోతారు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.
Raja Raja Chora
భాస్కర్ (శ్రీ విష్ణు) సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా సంజన (మేఘా ఆకాష్)కు పరిచయమవుతాడు. అబ్బద్దాలు చెప్పి ఆమెను ప్రేమలో పడేస్తాడు. అయితే భాస్కర్‌కు ఇదివరకే పెళ్లై ఓ బాబు కూడా ఉన్నాడని సంజన తెలుసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? విద్య (సునైనా) ఎవరు? అన్నది కథ.
Nootokka Jillala Andagadu
హీరో వంశపారంపర్యంగా వచ్చిన బట్టతలతో బాధపడుతుంటాడు. విగ్గు, టోపీతో మేనేజ్ చేస్తుంటాడు. (Adulthood Telugu Movies) ఈ విషయం దాచి సహోద్యోగి అంజలి (రుహానిశర్మ)ని ప్రేమిస్తాడు. ఈ రహస్యం ఓ రోజు అంజలికి తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ.
Balagam
ఓ పల్లెటూరిలో అందరితో సరదాగా ఉండే ఓ ముసలాయన కొమురయ్య( సుధాకర్ రెడ్డి). అతడి మనవడు సాయిలు (ప్రియదర్శి). విపరీతంగా అప్పులు చేసిన సాయిలు పెళ్లి చేసుకుని ఆ కట్నం డబ్బులతో అప్పు తీర్చాలనుకుంటాడు. కానీ సరిగ్గా వరపూజ రోజున అతడి తాత కొమురయ్య చనిపోతాడు.
Pareshan
ఇస్సాక్ , పాషా, సత్తి, RGV అనే నలుగురు యువకులు సింగరేణి ప్రాంతంలో నివసిస్తుంటారు.. వీరంతా మద్యానికి బానిసలు కావడంతో ఎలాంటి పరిస్థితి వచ్చినా మద్యం తాగుతూనే ఉంటారు. సత్తి, పాషాలకు డబ్బు అవసరం కావడంతో, ఇస్సాక్ తన తండ్రి డబ్బును వారికి ఇస్తాడు. ఇదే క్రమంలో ఇస్సాక్‌కు ఓ సమస్య వచ్చి డబ్బు అవసరమవుతుంది. కానీ సత్తి, పాషా డబ్బు తిరిగి ఇవ్వరు. మరి ఇస్సాక్ వారి నుంచి డబ్బు వసూలు చేశాడా? ఇంతకు అతనికి వచ్చిన సమస్య ఏమిటి? అన్నది మిగతా కథ.
Nuvvu Naaku Nachchaav
వెంకీని అతని తండ్రి శేఖరం.. తన చిన్ననాటి స్నేహితుడు శ్రీనివాస్ దగ్గరికి ఉద్యోగం కోసం పంపిస్తాడు. అయితే పెళ్లి నిశ్చయమైన శ్రీనివాస్ కూతురు నందిని వెంకీని ప్రేమిస్తుంది. కానీ వెంకీ, శ్రీనివాస్‌తో తన తండ్రి స్నేహం చెడిపోవద్దని ప్రేమను త్యాగం చేయాలని అనుకుంటాడు.
Vedam
రాజు, సరోజ, రాములు, వివేక్ చక్రవర్తి, రహీముద్దీన్ ఖురేషీ అనే ఐదుగురు వ్యక్తులు తమ జీవితంలో విభిన్నమైన లక్ష్యాలు ఉన్నవారు. అయితే వీరంతా ఓ ఆస్పత్రిలో జరిగే ఉగ్రవాద దాడిలో బాధితులైనప్పుడు ఏం జరిగిందనేది కథ.
Bommarillu
సిద్ధూ తండ్రి అతనికి ఓ ధనవంతుడి కూతురితో పెళ్లి ఖాయం చేస్తాడు. అయితే సిద్ధూ తన తండ్రి తెచ్చిన సంబంధాన్ని కాదని హాసిని అనే యువతితో ప్రేమలో పడటంతో కథ ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది.
Keedaa Cola
ఓ కూల్ డ్రింక్ లో బొద్దింక వస్తే… కోర్టు వరకు ఆ విషయాన్ని తీసుకువెళ్తే వచ్చే డబ్బు కంటే.. సదరు కార్పొరేట్ సంస్థనే బ్లాక్ మెయిల్ చేస్తే వచ్చే డబ్బు ఎక్కువ అని భావించిన కొందరు కుర్రాళ్ళు ఎలాంటి చిక్కుల్లో పడ్డారు? అనేది కీడా కోలా కథ. ఈ చిత్రంలో బ్రహ్మానందంతో పాటు తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
Seethamma Vakitlo Sirimalle Chettu
ఇది మధ్య తరగతి కుటుంబంలో ఉన్న ఇద్దరు అన్నదమ్ములు పెద్దోడు, చిన్నోడు జీవితాలను చుట్టూ తిరుగుతుంది. ఈ కథలో వాళ్ళ బంధం, వారి ప్రేమ, తల్లిదండ్రుల పట్ల గౌరవం చూపిస్తుంది. ఈ సినిమాలో సాంప్రదాయ విలువలు, కుటుంబం మీద ప్రేమ, విభేదాల మధ్య కూడా కలిసి ఉండటం ఎంత ముఖ్యమో చూపిస్తుంది.
Miss Shetty Mr Polishetty
మాస్టర్ చెఫ్ అయిన అన్విత రవళి తల్లి అనారోగ్యంతో చనిపోతుంది. ఈక్రమంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. పెళ్లిచేసుకోవద్దని నిశ్చయించుకుంటుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన సిద్దు పొలిశెట్టిస్టాండప్ కమెడియన్‌గా అలరిస్తుంటాడు. అన్విత అతని కామెడీ ఇష్టపడుతుంటుంది. ఈక్రమంలో సిద్దూ ఆమెతో ప్రేమలో పడతాడు. అన్విత తన నుంచి ఏమి ఆశిస్తుందో చెప్పినప్పుడు సిద్దూ షాక్‌కు గురవుతాడు. ఇంతకు అన్విత సిద్ధుని ఏం అడిగింది? అందుకు సిద్ధు అంగీకరించాడా? అన్నది మిగతా కథ.
Pilla Zamindar
అల్లరి చిల్లరగా తిరిగే ప్రవీణ్ పెద్ద భూస్వామి మనవడు. తన తాతగారి ఆస్తిని వారసత్వంగా పొందడం కోసం తన చదువును పూర్తి చేసేందుకు ఓ బోర్డింగ్ కాలేజీకి వెళ్తాడు. అక్కడ అతను జీవితం గురించి ఎలాంటి పాఠాలు నేర్చుకున్నాడన్నది మిగతా కథ.
Josh
దుర్గరావు అనే స్థానిక రాజకీయ మాఫియా నాయకుడు విద్యార్థులను తన అవసరాల కోసం వాడుకుంటుంటాడు. కాలేజీలో చేరిన సత్య అనే విద్యార్థి మిగతా విద్యార్థులను మార్చే ప్రయత్నం చేస్తాడు.
Rowdy Boys
అక్షయ్ (ఆశిష్) బాధ్యత లేకుండా తిరిగే కుర్రాడు. బీటెక్ ఫస్ట్ ఇయర్‌లో చేరడానికి కాలేజీకి వెళ్తూ మెడికల్ స్టూడెంట్ కావ్యను (అనుపమ పరమేశ్వరన్) చూసి తొలిచూపులోనే ప్రేమిస్తాడు. ఆ మెడికల్ కాలేజీకి, ఆశిష్ చేరబోయే కాలేజీకి అస్సలు పడదు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ.
Middle Class Melodies
రాఘవ అనే యువకుడు తన తండ్రిలాగా కాకుండా.. సమీపంలోని పట్టణంలో హోటల్ బిజినెస్ చేయాలనుకుంటాడు. పట్టణంలో హోటల్ తెరిచినప్పటికీ.. వ్యాపారం సక్సెస్ కాక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాడు. వాటి నుంచి బయటపడేందుకు రాఘవ ఏం చేశాడు అనేది కథ.