• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Aho Vikramaarka Movie Review: నటనలో తేలిపోయిన మగధీర విలన్‌.. ‘అహో! విక్రమార్క’ ఎలా ఉందంటే?

    నటీనటులు : దేవ్‌ గిల్‌, చిత్రా శుక్ల, తేజస్విని పండిట్‌, ప్రవీణ్‌ టార్దే, పోసాని కృష్ణ మురళి, షియాజీ షిండే, కాలకేయ ప్రభాకర్‌, తదితరులు

    డైరెక్టర్‌ : పేట త్రికోఠి

    రచన, మాటలు : ప్రసాద్‌ వర్మ

    సంగీతం : రవి బస్రూర్‌

    ఎడిటర్‌ : తమ్మిరాజు, 

    నిర్మాతలు : దేవ్‌ గిల్‌, మిహిర్‌ సుధీర్‌, అశ్వనీ కుమార్‌ మిశ్రా

    విడుదల తేదీ : 30-08-2024

    మగధీరలో విలన్‌గా చేసి నటుడు దేవ్‌ గిల్‌ (Dev Gill) మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆపై మరికొన్ని తెలుగు చిత్రాల్లో ప్రతినాయకుడిగా కనిపించి ఆకట్టుకున్నాడు. ఆయన కథానాయకుడిగా చేసిన తాజా చిత్రం ‘అహో! విక్రమార్క’ (Aho Vikramaarka Movie Review). త్రికోటి దర్శకుడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? హీరోగ దేవ్‌ గిల్‌ సక్సెస్‌ అయ్యాడా? ఈ రివ్యూలో తెలుసుకుందాం. 

    కథేంటి

    పుణెలోని ఓ కాలనీకి చెందిన 1200 మంది కూలీలు పని కోసం వెళ్లి 25 ఏళ్లుగా కనిపించకుండా పోతారు. వారి ఆచూకి తెలియక, అసలు బతికున్నారో లేదో అర్థం కాక కుటుంబ సభ్యులు రోధిస్తుంటారు. ఈ క్రమంలోనే పూణే పోలీసు స్టేషన్‌కు ఎస్సైగా విక్రమార్క (దేవ్‌ గిల్‌) ట్రాన్స్‌ఫర్‌ అయ్యి వస్తాడు. ఆపై డ్రాగ్‌ మాఫియా వ్యక్తి బిలాల్‌ (పోసాని కృష్ణమురళి)తో చేతులు కలిపి అక్రమాలకు తెరలేపుతాడు. ప్రేయసి అర్చన (చిత్రా శుక్లా) ప్రభావంతో నిజాయతీ గల పోలీసు ఆఫీసర్‌గా మారతాడు. విక్రమార్కలో మార్పుకు కారణమైన ఘటన ఏంటి? కూలి కోసం వెళ్లి మిస్సైన వారు ఏమయ్యారు? వాళ్లని విక్రమార్క కాపాడగలిగాడా? లేదా? ఈ క్రమంలో అతడు ఎదుర్కొన్న సమస్యలేంటి? అన్నది స్టోరీ. 

    ఎవరెలా చేశారంటే

    దేవ్‌ గిల్‌ యాక్షన్‌ సన్నివేశాల్లో తన మార్క్ చూపించాడు. విలన్‌గా పలు చిత్రాల్లో నటించిన అనుభవం ఉండటంతో యాక్షన్‌ కోసం అతడు పెద్దగా కష్టపడినట్లు కనిపించలేదు. అయితే లవ్ సీన్స్‌, భావోద్వేగ సన్నివేశాల్లో దేవ్‌ గిల్‌ పూర్తిగా తేలిపోయాడు. ముఖంలో హావభావాలు పలికించలేక బాగా తడబడ్డాడు. హీరోయిన్‌గా చిత్రా శుక్ల నటన బాగుంది. పాత్రకు తగ్గట్లు ఆమె ఒదిగిపోయారు. విలన్‌గా చేసిన ప్రవీణ్‌, ఏసీపీ భవానీగా నటించిన తేజస్విని పండిట్ ఆకట్టుకున్నారు. పోసాని కృష్ణ మురళి, షాయాజీ షిండే సెటిల్డ్‌ నటనతో మెప్పించారు. మిగతా పాత్రదారులు కూడా ఉన్నంతలో పర్వాలేదనిపించారు. 

    డైరెక్షన్‌ ఎలా ఉందంటే

    దర్శకుడు పేట త్రికోఠి తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగులో వచ్చిన ‘టెంపర్‌’, ‘పటాస్‌’ చిత్రాలను గుర్తు చేస్తుంది. కథలో మాత్రం కొత్తదనం కనిపించదు. అటు కథనం కూడా ఏమాత్రం ఆసక్తిగా అనిపించదు. కథకు తగ్గట్లు హీరో నుంచి నటన రాబట్టడంలో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడు. హీరో-హీరోయిన్‌ మధ్య వచ్చే లవ్‌ ట్రాక్‌ చాలా బోరింగ్‌గా అనిపిస్తుంది. దేవ్‌ గిల్‌ హీరోయిన్‌ వైపు ప్రేమగా చూసిన అది విలన్‌ రోల్‌ను గుర్తు చేస్తుంటుంది. అయితే ఫైట్స్‌లో మాత్రం దర్శకుడు త్రికోఠి తన మార్క్‌ చూపించే ప్రయత్నం చేశాడు. విలన్లతో తలపడే క్రమంలో వచ్చే యాక్షన్‌ సీన్స్ కాస్త ఆసక్తికరంగా అనిపిస్తాయి. 

    సాంకేతికంగా..

    టెక్నికల్‌ అంశాల విషయానికి వస్తే ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ మంచి పనితీరు కనబరిచింది. రవి బస్రూర్‌ అందించిన సంగీతం పూర్తిగా తేలిపోయింది. నేపథ్య సంగీతం మాత్రమే అక్కడక్కడ కాస్త పర్వాలేదనిపిస్తుంది. నిర్మాణ విలువలు మాత్రం ఉన్నతంగా ఉన్నాయి. బడ్జెట్‌ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. 

    ప్లస్‌ పాయింట్స్‌

    • యాక్షన్‌ సీక్వెన్స్‌
    • నిర్మాణ విలువలు

    మైనస్‌ పాయింట్స్‌

    • కథ, కథనం
    • హీరో నటన
    • లాజిక్‌కు అందని సీన్స్‌

    Telugu.yousay.tv Rating : 1.5/5  

    .

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv