అఖిల్ అక్కినేని దాదాపు సంవత్సరం తర్వాత ప్రేక్షకులను పలకరించాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో వచ్చాడు. స్పై థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. చాలాకాలంగా సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్ ఆశలు నిజమయ్యాయా? చిత్రం ఎలా ఉంది? హీరోయిన్‌గా మారిన సాక్షి వైద్యకు ప్లస్ అయ్యిందా? మమ్ముట్టి రోల్ ఆకట్టుకుంటుందా? అభిమానులను, ప్రేక్షకులను సినిమా మెప్పించిందా అనే అంశాలు రివ్యూలో చూద్దాం.
దర్శకుడు: సురేందర్ రెడ్డి
నటీ నటులు: అఖిల్, సాక్షి వైద్య, మమ్ముట్టి తదితరులు
సంగీతం: హిపాప్ తమిజా
సినిమాటోగ్రఫీ: రసూల్ ఎల్లోర్
కథేంటి?
రిక్కీ ( అఖిల్ ) ‘రా’ ఏజెంట్ కావాలని చాలా కష్టపడుతుంటాడు. కానీ, అతడు చేసే ప్రయత్నాలన్ని విఫలం అవుతాయి. అతడికి రాలో పనిచేస్తున్న డెవిల్ ( మమ్ముట్టి )తో పరిచయం ఏర్పడుతుంది. భారత్‌లో సిండికేట్ ప్రారంభించిన మాఫియా డాన్ ది గాడ్ (డినో మోరియా )ను అడ్డుతొలగించాలని చూస్తుంటాడు డెవిల్. ఇందుకోసం అఖిల్ ఏం చేశాడు? అనేది కథ.
ఎలా ఉంది?
సినిమాలో ఫస్టాఫ్‌లో కొద్ది సేపు పాత్రల పరిచయం చేశాడు దర్శకుడు. మమ్ముట్టిని రా ఏజెంట్‌గా, సిండికేట్ ఫామ్ చేసిన డినో మోరియా, రాలో పనిచేయాలని కష్టపడుతున్న వ్యక్తిగా అఖిల్ పాత్రల గురించి చకచకా చెప్పేశాడు.
తర్వాత హీరో, హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్‌తో నింపేశాడు. ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోదు. ఇద్దరూ కలుసుకోవటం తర్వాత విడిపోవటం ఇప్పటికే చాలా సినిమాల్లో చూసిన ఫీలింగ్ వస్తుంది. సినిమా సగం పూర్తయిన తర్వాత అసలు కథ ప్రారంభమవుతుంది. ఏజెంట్ వైల్డ్‌గా రాలోకి అఖిల్ ఎంట్రీ ఇవ్వడంతో హైప్ వస్తుంది. భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయింది.
సెకాండాఫ్ మెుత్తం రొటీన్‌గా సాగిపోయింది. సిండికేట్‌ను అడ్డుకునేందుకు హీరో చేసే ప్రయత్నాలు, వాళ్లు అతడిని టార్గెట్ చేయడం వంటి సీన్లు బోర్ కొడతాయి. హైవోల్డేజ్ యాక్షన్ సీన్‌తో సినిమా క్లైమాక్స్ చేరినా ప్రేక్షకులు నిరాశకు గురవుతారు. క్లైమాక్స్ కూడా పెద్దగా ఆకట్టుకోదు. అయితే, యాక్షన్ సీక్వెన్సులు మాత్రం నెక్ట్స్ లెవల్.
ఎవరెలా చేశారు
సినిమాకు పెద్ద అసెట్ అఖిల్ అక్కినేని. తన రోల్ కోసం పూర్తిగా మారిపోయాడు. ఆ క్యారెక్టర్‌లో ఇమిడిపోయేందుకు తనవంతు కృషి చేశాడు ఈ యంగ్ హీరో. వైల్డ్ ఏజెెంట్‌గా అతడి లుక్ సెట్ అయ్యింది. నటనలోనూ కాస్త మెరుగయ్యాడు. దర్శకుడు చెప్పిన విధంగా చేయడంలో సక్సెస్ అయ్యాడు. అయితే, లవర్ బాయ్‌గా చూసిన అఖిల్‌కు యాక్షన్ డ్రామాలు సెట్ కాలేదు.
సీనియర్ నటుడు మమ్ముట్టి ఎప్పటిలాగే ఆకట్టుకున్నారు. తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. రా ఏజెంట్‌గా పరిధి మేరకు నటించారు. హీరోయిన్ సాక్షి వైద్యకి పెద్దగా అవకాశం లేదు. కానీ, స్క్రీన్‌పై గ్లామరస్‌గా కనిపించింది. పక్కా కమర్షియల్ సినిమాల్లో ఉండే పాత్రనే ఆమెకు దక్కింది. బాలీవుడ్ నటుడు డినో మోరియా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా.. గుర్తుండిపోయే క్యారెక్టర్ కాదు. అయినా తన పరిధి మేరకు నటించి మెప్పించాడు.
సాంకేతిక పనితీరు
ధృవ, సైరా చిత్రాలతో మంచి హిట్స్ అందించిన దర్శకుడు సురేందర్ రెడ్డి నుంచి వస్తున్న సినిమా అంటే అంచనాలు ఉంటాయి. అలాంటి చిత్రాన్ని అందించడంలో విఫలమయ్యాడు దర్శకుడు. కానీ, ఇప్పటివరకు తీసిన యాక్షన్ సీక్వెన్సుల్లో సూరికి ఇదే బెస్ట్ సినిమా. అంత రిచ్ లుక్‌లో తెరకెక్కించాడు. కథ, కథనంపై ఫోకస్ పెట్టి ఉంటే మరో లెవల్‌లో ఉండేది. వక్కంతం వంశీ అందించిన కథ పెద్ద మైనస్. పక్కా కమర్షియల్ స్టోరీ ఇది.
ఏజెంట్ చిత్రానికి మరో మెనస్ పాయింట్ ఏదైనా ఉందంటే అది సంగీతం.హిపాప్ తమీజా ఒక్క చాట్ బస్టర్ ఇవ్వలేకపోయాడు. ఏ పాట కూడా ప్రేక్షకులను మెప్పించలేదు. ఇక బ్యాక్‌గ్రౌండ్ స్కోరు ఫర్వాలేదు అంతే. సినిమాటోగ్రఫీ అద్భుతం. దర్శకుడు అనుకున్న ప్రతి పాయింట్‌ను చక్కగా చూపించారు. పోరాట సన్నివేశాలను తెరకెక్కించిన విధానం బాగుంది.
ఎడిటింగ్ పర్వాలేదు. కత్తెరకు మరికొంత పనిచెప్పి ఉంటే ఇంకా బాగుండేది. సినిమాకు అసలైన హైలెట్ నిర్మాణ విలువలు. ప్రతి సన్నివేశం అద్భుతంగా కనిపించిందంటే నిర్మాతనే కారణం. పెట్టిన ప్రతి పైసా స్క్రీన్‌పై కనిపిస్తుంది.
బలాలు
అఖిల్
యాక్షన్ సీన్స్
బలహీనతలు
కథ
కథనం
సంగీతం
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!