• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • నాగ చైతన్య, అఖిల్..సీన్ రిపీట్ చేస్తారా? సీన్ మారుస్తారా?

  అక్కినేని నట వారసులుగా సినిమాల్లోకి అడుగుపెట్టిన సోదరులు నాగచైతన్య, అఖిల్. నాగ చైతన్య కెరీర్ ఆరంభంలో తన లుక్స్ పరంగా కాస్త విమర్శలు ఎదుర్కొన్నా రెండో సినిమాతోనే కెరీర్ బ్రేకింగ్ హిట్ కొట్టి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. మరోవైపు అఖిల్ ఇప్పటికి నాలుగు సినిమాలు చేసినా సరైన బ్రేక్ కోసం వేచిచూస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం చైతూ నుంచి థ్యాంక్యూ, అఖిల్ నుంచి ‘ఏజెంట్’ రాబోతున్నాయి. ఇప్పటిదాకా ఇద్దరి సినిమా సెలక్షన్ దాదాపుగా ఒకేలా సాగినా అఖిల్ కి అది కలిసి రాలేదు. మరి అక్కినేని సోదరులకు బాగా కలిసొచ్చిన రూట్ ఏంటి? ఆ రూట్ మార్చిన అఖిల్ ఈ సారి హిట్టు కొడతాడా? ఓ సారి చూద్దాం.

  మాస్ ఎంట్రీతో మొదలు పెట్టి లవర్ బాయ్ గా మారిన చైతూ

  కాలేజ్ బ్యాక్ డ్రాప్ తో నడిచే పక్కా మాస్ సినిమా ‘జోష్’తో నాగచైతన్య 2009లో వెండితెరకు పరిచయమయ్యాడు. బన్నీ, దిల్, పరుగు, బొమ్మరిల్లు వంటి హిట్ సినిమాలకు పనిచేసిన వాసు వర్మ, తొలిసారి దర్శకుడిగా తెరకెక్కించిన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ నాగచైతన్యకు బ్రేక్ ఇవ్వలేకపోయింది. కానీ తర్వాత ఏడాదిలోనే రొమాంటిక్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఏ మాయ చేశావే’ చైతన్య కెరీర్ కు బ్రేక్ ఇచ్చింది. లవర్ బాయ్ గా చైతూ అందరి మనసులూ దోచాడు. ఆ వెంటనే మరో హిట్ డైరెక్టర్ సుకుమార్ తో  ‘100% లవ్’ తీసి చైతూ మరోసారి బాక్సాఫీస్ వద్ద మెరిశాడు. కానీ మళ్లీ మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తూ వరుసగా చేసిన దడ, బెజవాడ, తఢాఖా, ఆటోనగర్ సూర్య సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. మళ్లీ లవర్ బాయ్ గా చేసిన ఒక లైలా కోసం కాస్త ఫరవాలేదనిపించగా…ప్రేమం మరోసారి చైతన్య కెరీర్ ను మలుపు తిప్పింది. మళయాళంలో హిట్ అయిన ఈ సినిమా తెలుగులోనూ భారీ విజయం సాధించింది. ఆ తర్వాత కూడా యుద్ధం శరణం, సవ్యసాచి వంటి సీరియస్ సినిమాల కన్నామజిలీ, లవ్ స్టోరీ వంటి చిత్రాలే చైతన్యకు హిట్లుగా నిలిచాయి. 

  పక్కా లవర్ బాయ్ ఇమేజ్ తో సినిమాల్లోకి వచ్చిన అఖిల్

  అఖిల్ పరిస్థితి చైతన్యతో పోలిస్తే చాలా భిన్నం. సినిమాల్లోకి రాకముందే క్యూట్ బాయ్ గా అమ్మాయిల్లో అఖిల్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. అయినా కూడా అఖిల్ అన్న చైతూ  బాటలోనే మొదటి సినిమా మాస్ ఇమేజ్ కోసం చేశాడు. కమర్షియల్ డైరెక్టర్ వి.వి. వినాయక్ తో 2015లో ‘అఖిల్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. కానీ అప్పటికే భద్రీనాథ్, నాయక్, అల్లుడు శీను వంటి సినిమాలతో 5 ఏళ్లుగా ఫ్లాపులతో ఉన్న వినాయక్, అఖిల్ కు కూడా ఓ ఫ్లాపు మూటగట్టాడు. ఇక వెంటనే మళ్లీ అన్న చైతూ లాగానే తనకున్న లవర్ బాయ్ ఇమేజ్ కు తగ్గట్టుగా ‘హలో’ మూవీ చేశాడు. అక్కినేని ఫ్యామిలీకి ‘మనం’ వంటి హిట్ అందించిన విక్రమ్ కుమార్ దీనికి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కూడా అఖిల్ కు బ్రేక్ ఇవ్వలేకపోయింది. ఆ తర్వాత ‘తొలిప్రేమ’ చిత్రంతో జోష్ మీదున్న వెంకీ అట్లూరితో ‘మిస్టర్ మజ్ను’ సినిమా చేసినా అది కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. తొలిప్రేమకు కాస్త దగ్గర ఉండే స్క్రీన్ ప్లే, ఈ సినిమాకు విజయాన్ని అందించలేకపోయింది. ఆ తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ తో చేసిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ కూడా పరవాలేదనిపించినా కెరీర్ బ్రేక్ ఇచ్చే మూవీ మాత్రం కాలేకపోయింది. 

  రాబోయే సినిమాల పరిస్థితేంటి?

  ప్రస్తుతం చైతూ తనకు బాగా కలిసొచ్చిన ప్రేమ కథతో థ్యాంక్యూ సినిమా చేస్తున్నాడు. అలాగే లాల్ సింగ్ చడ్డా లోనూ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అఖిల్ మాత్రం అక్కినేని సోదరులకు అస్సలు కలిసి రాని పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు.  చైతూ ‘థ్యాంక్యూ యూ’ మూవీ ట్రైలర్ కు ఇప్పటికే పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. మరోవైపు కిక్, రేసు గుర్రం లాంటి సూపర్ హిట్ సినిమాలు తీసిన సురేందర్ రెడ్డితో తెరకెక్కుతున్న అఖిల్ చిత్రం ‘ఏజెంట్’ టీజర్ పై మిశ్రమ స్పందన వస్తోంది. టీజర్ లో సగం వరకూ మాస్ ఎలిమెంట్స్, అఖిల్ బీభత్సమైన బాడీ  మేకోవర్ బాగా అనిపించినా..చివర్లో గన్స్ తో డ్యాన్స్ చేస్తూ ఆడుకునే సీన్లు కొందరికి నచ్చలేదు. 

  మరి తనకు బాగా కలిసొచ్చిన జానర్ తో చైతూ మరో హిట్ కొడతాడా? లేక వారికి అస్సలు కలిసిరాని మాస్ జానర్ లో హిట్ కొట్టి ‘అఖిల్’ సీను మారుస్తాడా అన్నది వేచి చూడాలి.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv