• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Amazfit Cheetah Smartwatch: ఫిట్‌నెస్‌ లవర్స్‌ కోసం అదిరిపోయే స్మార్ట్‌వాచ్‌.. ప్రత్యేకతలపై లుక్కేయండి!

    డిజిటల్‌ వాచ్‌ రంగంలో అమేజ్‌ఫిట్‌ కంపెనీకి మంచి పేరుంది. ఆ కంపెనీ నుంచి వచ్చిన స్మార్ట్‌వాచ్‌లకు కొనుగోలు చేసేందుకు టెక్‌ ప్రియులు ఆసక్తి కనబరుస్తుంటారు. భారత మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌ దృష్ట్యా ఆ అమేజ్‌ఫిట్‌ ఎప్పటికప్పుడు నూతన స్మార్ట్‌వాచ్‌లను రిలీజ్‌ చేస్తూ టెక్‌ ప్రియులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ‘Amazfit Cheetah’ పేరుతో రెండు అధునాతన డిజిటల్‌ వాచ్‌లను భారత్‌లో లాంచ్‌ చేసింది. ‘Amazfit Cheetah Round’, ‘‘Amazfit Cheetah Square’ అనే రెండు వేరియంట్లను పరిచయం చేసింది. ప్రీమియం మార్కెట్‌ను టార్గెట్‌ చేసుకొని అమేజ్‌ఫిట్‌ ఈ వాచ్‌లను రిలీజ్‌ చేసింది. ఈ నేపథ్యంలో ఈ వాచ్‌ల ఫీచర్లు, ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 

    వాచ్‌ స్క్రీన్‌

    Cheetah Round మోడల్ వాచ్‌ను 1.39 అంగుళాల HD AMOLED డిస్‌ప్లేతో తీసుకొచ్చారు. అటు Square వేరియంట్‌కు 1.75 అంగుళాల HD AMOLED డిస్‌ప్లేను ఫిక్స్‌ చేశారు. Cheetah Round 454×454 పిక్సెల్స్ రిజల్యూషన్ కలిగి ఉంది. 

    బ్లూటూత్‌ సపోర్ట్‌

    Amazfit Cheetah స్మార్ట్‌వాచ్‌లకు 10 మీటర్ల రేంజ్‌ బ్లూటూత్ కనెక్టివిటీని అందించారు. బ్లూటూత్ కాలింగ్‌కు కూడా ఇవి సపోర్ట్ చేస్తాయి. యాపిల్‌, ఆండ్రాయిడ్‌ యూజర్లు తేలిగ్గా ఈ వాచ్‌ను కనెక్ట్‌ చేసుకోవచ్చు. 

    అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు

    ఈ వాచ్‌లు.. SpO2 మానిటర్ , స్లీప్ ట్రాకింగ్, ఫైండ్ మై ఫోన్, వాయిస్ అసిస్టెంట్, 24/7 హెల్త్‌ మానిటరింగ్‌, రన్నింగ్ రిమైండర్లు, సైక్లింగ్, స్విమ్మింగ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లకు సపోర్ట్ చేస్తాయి.

    వాటర్‌ రెసిస్టెన్స్‌

    నీటిని తట్టుకునే విధంగా Amazfit Cheetah స్మార్ట్‌వాచ్‌లను రూపొందించారు. డస్ట్‌, వాటర్‌ నుంచి రెసిస్టెన్స్‌ కోసం 5ఏటీఎమ్‌ రేటింగ్‌ను అందించారు.

    పవర్‌ బ్యాకప్‌

    ఈ వాచ్‌లను అమేజ్‌ఫిట్‌ మంచి పవర్‌ఫుల్‌ ప్యాక్‌తో తీసుకొచ్చింది. దీనికి శక్తివంతమైన బ్యాటరీని అందించారు. ఒకసారి ఛార్జ్‌ చేస్తే 12 రోజుల పాటు నిరాటంకంగా వాచ్‌లను ఉపయోగించవచ్చని కంపెనీ పేర్కొంది. 

    ఫిట్‌నెస్‌ యాక్టివిటీస్‌

    ఇందులోని స్పోర్ట్స్‌ మోడ్ సెన్సార్లు ఎప్పటికప్పుడు మీ కదలికలపై ఓ కన్నేసి ఉంచుతాయి. సైక్లింగ్‌, వాకింగ్‌, జాగింగ్‌లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ట్రాక్‌ చేసి అప్పటికప్పుడు అందజేస్తాయి.

    GPS టెక్నాలజీ

    ఈ స్మార్ట్‌వాచ్‌లో GPSతో పనిచేసే MaxTrack technologyని వినియోగించారు. దీని వల్ల వెళ్లాల్సిన గమ్యస్థానాన్ని ఈ వాచ్‌లోనే ఫిక్స్‌ చేసుకునేందుకు వీలవుతుంది. ఫోన్‌తో సంబంధం లేకుండా వాచ్‌లోని GPSను అనుసరిస్తూ సునాయసంగా గమ్యస్థానానికి చేరుకోవచ్చు. 

    కంట్రోల్‌ సిస్టమ్‌

    ఈ వాచ్‌ను ఉపయోగించి మీ ఫోన్‌లోని కెమెరాలను, మ్యూజిక్‌ ప్లేయర్లను ఈజీగా కంట్రోల్‌ చేయవచ్చు. ఇందులో ‘find my device’ అనే ఫీచర్‌ కూడా ఉంది. అంతేగాక ‘వాయిస్‌ అసిస్టెన్స్‌’ ఫీచర్‌ను ఈ వాచ్‌కు అందించారు. సాధారణంగా ఇలాంటి ఫీచర్లు రూ.30 వేలకు పైబడిన వాచ్‌లలో మాత్రమే చూస్తుంటాం. 

    ధర ఎంతంటే?

    సెప్టెంబర్‌ 24 నుంచి ‘Amazfit Cheetah Round’, ‘Amazfit Cheetah Square’ స్మార్ట్‌వాచ్‌లు అందుబాటులోకి రానున్నాయి. వీటి ధర రూ. 20,999గా కంపెనీ నిర్ణయించింది. త్వరలోనే ఈ రెండు కూడా కంపెనీ సైట్, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్ల ద్వారా అమ్మకానికి రానున్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv