గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్‌ను ఆన్‌లైన్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్.. త్వరలో రాబోయే పండుగ సీజన్ కోసం ప్రకటించింది. ఖచ్చితమైన తేదీలు ఇంకా ప్రకటించనప్పటికీ, అమెజాన్ తన వెబ్‌సైట్‌లో కొన్ని ముందస్తు డీల్‌లు, రాయితీలను స్క్రోల్ చేస్తోంది. ల్యాప్‌టాప్‌లపై 45 శాతం వరకు, ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీస్‌పై 75 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అదనంగా, ప్రైమ్ సభ్యులు ఎస్‌బిఐ కార్డు వినియోగదారులకు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్
అమెజాన్ ఎలక్ట్రానిక్స్, హోం అప్లయన్సెస్, మొబైల్స్, గేమింగ్ డివైసెస్, ఇతర లైఫ్‌స్టైల్ ఉత్పత్తులు వంటి విభిన్న కేటగిరీలపై రాయితీలను సూచిస్తూ ఒక ప్రత్యేక మైక్రోసైట్‌ను సృష్టించింది. ఆపిల్, శాంసంగ్, డెల్, అమెజ్‌ఫిట్, సోనీ, మరియు షియోమి వంటి గ్లోబల్ బ్రాండ్ల డివైస్‌లకు ఈ సేల్‌లో భారీ స్థాయిలో ధర తగ్గింపులు లభించనున్నాయి. అదనంగా, బోట్ వంటి భారతీయ బ్రాండ్ల ఉత్పత్తులపై కూడా డిస్కౌంట్‌లు అందుబాటులో ఉండనున్నాయి.
ఇక అమెజాన్ తన ఉత్పత్తులైన Alexa, Fire TV, Kindle డివైస్‌లపై కూడా సేల్స్ సమయంలో తక్కువ ధరలను అందించే అవకాశం ఉంది.
SBI కార్డ్ హోల్డర్లకు డిస్కౌంట్లు
ఎస్‌బిఐ క్రెడిట్, డెబిట్ కార్డు హోల్డర్లకు అమెజాన్.. SBI బ్యాంక్ భాగస్వామ్యంతో 10 శాతం ఇన్‌స్టాంట్ డిస్కౌంట్‌ను అందించనుంది. టాబ్లెట్లపై 60 శాతం వరకు, మొబైల్స్, యాక్సెసరీస్‌పై 40 శాతం వరకు, హెడ్‌ఫోన్‌లపై 70 శాతం వరకు, స్మార్ట్ టీవీలు, ప్రొజెక్టర్లపై 60 శాతం వరకు, గేమింగ్ డివైస్ ఇతర వస్తువులపై 70 శాతం వరకు డిస్కౌంట్‌లను కస్టమర్లకు అమెజాన్ ఈ సేల్‌లో అందించనుంది.
ట్రావెల్ బుకింగ్స్‌పై ఆఫర్లు
ఎలక్ట్రానిక్స్ మాత్రమే కాకుండా, అమెజాన్ వినియోగదారులు ప్రయాణ బుకింగ్‌లపై కూడా రాయితీలను పొందగలరని ప్రకటించింది, వీటిలో ఫ్లైట్ టిక్కెట్లు, రైలు, బస్ ఛార్జీలు, మరియు హోటల్ బుకింగ్‌లు ఉన్నాయి.
ప్రైమ్ మెంబర్‌లకు ప్రత్యేక ప్రయోజనాలు
అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం కలిగిన వినియోగదారులు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్‌కు ముందస్తు యాక్సెస్ పొందుతారు. అదనంగా, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, దీర్ఘకాలిక నో-కాస్ట్ EMI ఆప్షన్‌లు కూడా లభిస్తాయి. అమెజాన్ పే, పే లేటర్ ఆధారిత చెల్లింపు ఆఫర్లు, కూపన్ డిస్కౌంట్‌లు కూడా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సమయంలో అందుబాటులో ఉండే అవకాశాలు ఉన్నాయి.
సేల్ ఎప్పుడంటే?
ప్రతి సంవత్సరం నిర్వహించే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఈసారి సెప్టెంబర్ నెలాఖరులో నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటికే ఫ్లిఫ్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌ను సెప్టెంబర్ 27 నుంచి రన్ చేయనున్నట్లు ప్రకటించింది. ఆ తేదీకి ఒక రోజు అటు ఇటుగా అమెజాన్ సేల్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.
Featured Articles Hot Actress Telugu Movies
Sreeleela: అల్లు అర్జున్‌పై శ్రీలీల కామెంట్స్ వైరల్!