అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో రిఫ్రిజిరేటర్లపై భారీ ఆఫర్లైతే నడుస్తున్నాయి. వాణిజ్యపరంగా, ఎక్కువ మంది కుటుంబ సభ్యులున్న ఫ్యామిలీలకు కాస్త నిల్వ సామర్థ్యం అధికంగా ఉన్న ఫ్రిడ్జ్‌లు అవసరం. కేపాసిటీని బట్టి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు రిఫ్రిజిరేటర్లు ఉన్నాయి. మరి అమెజాన్‌లో వినియోగదారుల నుంచి స్టార్ రేటింగ్ పొందిన ఫ్రిడ్జిలను మీకు అందిస్తున్నాం.. వాటిని ఓసారి చూసేయండి మరి.
TOSHIBA 439 L
తోషిబా 439 లీటర్ల భారీ నిల్వ సామర్థ్యంతో 2 స్టార్ ఎనర్జీ రేటింగ్‌ను అయితే కలి ఉంటుంది. ఎయిర్ ఫాల్ కూలింగ్, బయో డియోడైజర్, బిగ్ వెజిటేబుల్ బాక్స్, కన్వినెంట్ టెంపరేచర్ కంట్రోల్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. కంప్రెసర్‌పై 10 ఏళ్ల వారెంటీ ఉంది. దీని ధర ₹49,990
Bosch 415 L
స్టెయిన్ లెస్ బాడీ బిల్ట్‌తో మల్టిఫుల్ ఏయిర్ ఫ్లో టెక్నాలజీ అయితే ఈ రిఫ్రిజిరేటర్ కలిగి ఉంది. 3 స్టార్ ఎనర్జీ రేటింగ్ దీని ప్రత్యేకత. డబుల్ డోర్‌తో ఫ్రోస్ట్ ఫ్రీ చాంబర్ కలిగి ఉంటుంది. దీని ధర రూ.50390
Whirlpool 465 L
465 L భారీ నిల్వ సామర్థ్యంతో 3 స్టార్ ఎనర్జీ రేటింగ్‌తో ఈ ఫ్రిజ్ అమెజాన్‌లో అందుబాటులో ఉంది. కమర్షియల్ పర్పస్‌లో బాగా యూజ్ అవుతుంది. ఆటో కనెక్ట్ టూ హోమ్ ఇన్‌వర్టర్, వాతావరణ మార్పులకు అనుగుణంగా కూలింగ్ ప్యాట్రన్, 6th సెన్స్ డీప్ ఫ్రీజ్ టెక్నాలజీతో తయారైంది. దీని ధర రూ.54,490
Hisense 507 L
సెపరేట్ వాటర్ డిస్పెన్సరీతో వస్తుంది. నేరుగా ఫ్రిజ్ డోర్ బయటే వాటర్ ట్యాప్ ద్వారా నీళ్లు పట్టుకోవచ్చు. కంప్రెసర్‌పై 10 ఏళ్లు, ప్రొడక్ట్‌పై ఏడాది వారెంటీ ఉంది. ఇది నాలుగు డోర్లను కలిగి ఉండి మెరుగైన కూలింగ్ కెపాసిటీని అందిస్తుంది. దీని ధర రూ. 59,990
Whirlpool 500 L
అడాప్టివ్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో ఈ రిఫ్రిజిరేటర్ తయారైంది. 3 స్టార్ ఇన్వర్టర్ ఫ్రాస్ట్-ఫ్రీ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ ఇది. కంప్రెసర్‌పై 10 ఏళ్ల వారెంటీ అందిస్తున్నారు. కమర్షియల్ పర్పస్‌లో హోటల్, ఇతర పెద్ద కార్యాలయాలకు బాగా యూజ్ అవుతుంది. అమెజాన్‌లో దీని ధర ₹60,340
LG 506 L
ఇది ఎల్‌జీ కంపెనీ నుంచి వచ్చిన లెటెస్ట్ హై కెపాసిటీ రిఫ్రిజిరేటర్, వైఫై కనెక్టివిటీ ఫీచర్ కలిగి ఉంది. 5 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉన్న ఫ్యామిలికీ ఇది సెట్ అవుతుంది. కమర్షియల్ పర్పస్‌లో యూజ్ చేసుకోవచ్చు. కంప్రెసర్‌పై 10 ఏళ్ల వారెంటీ లభిస్తోంది. డబుల్ డోర్‌తో తయారైంది. వన్ స్టార్ ఎనర్జీ రేటును కలిగి ఉంది. దీని ధర రూ.65,990.
Haier 630L Frost Free
రిఫ్రిజిరేటర్ల తయారీలో Haier బ్రాండ్‌కు మంచి పేరుంది. ఇంత భారీ స్థాయిలో నిల్వసామర్థ్యంతో వచ్చినా 5 స్టార్ ఎనర్జీ రేటింగ్ ఉండటం నిజంగా గొప్పవిషయం. మల్టిఫుల్ కూలింగ్ కంపార్టుమెంట్లను కలిగిన ఈ ఫ్రిడ్జి డిఫరెంట్ కూలింగ్ సెగ్మెంట్లను కలిగి ఉంది. యాంటీ బ్యాక్టీరియల్ గాస్కెట్‌ను కలిగి ఉంటుంది. దీని కంప్రెసర్‌పై 10 ఏళ్ల వారెంటీ లభిస్తోంది. ఫ్రిడ్జి ధర ₹71,990
Samsung 670L
ఇది 2 స్టార్ ఎనర్జీ రేటింగ్‌తో మంచి ఫీచర్లను కలిగి ఉంది. ట్విస్ట్ ఐస్ మేకర్, ఆటో అడ్జస్టబుల్ కూలింగ్ డిమాండ్ వంటి ఆధునాతన సౌకర్యాలు ఇందులో ఉన్నయి. కంప్రెసర్‌పై 20 ఏళ్ల వారెంటీని కలిగి ఉంది. దీని ధర రూ.71990
LG 592 L 1 Star Frost Free
592 లీటర్ల సామర్థ్యంతో వచ్చిన ఈ రిఫ్రిజిరేటర్ అయిదుగురు అంతకంటే ఎక్కువ ఉన్న ఫ్యామిలీకి మంచి ఆప్షన్. ఫ్లాష్ డోర్ కూలింగ్ టెక్నాలజీని కలిగి ఉంది. కంప్రెసర్‌పై 10 ఏళ్ల వారెంటీ లభిస్తోంది. దీని ధర రూ. 71,990
LG 594 L Frost-Free
వైఫై కనెక్టివిటీతో వచ్చిన సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్ ఇది. ఫ్లాష్ డోర్ కూలింగ్ టెక్నాలజితో మంచి కూలింగ్ అందిస్తుంది. కూరగాయలు, పళ్లు నిత్యం తాజాగా ఉండేలా చూస్తుంది. కూరగాయల షెల్ప్ లైఫ్‌ను పెంచుతుంది. మల్టీ ఎయిర్ ప్లోను కలిగి ఉంటుంది. కంప్రెసర్‌పై 10 ఏళ్ల వారెంటీ లభిస్తోంది. దీని ధర ₹96,990
LG 655 L Frost-Free
LG నుంచి వచ్చిన లెటెస్ట్ ఫ్రిడ్జ్ ఇది. దీని నిల్వ సామర్థ్యం 655 లీటర్లు. ఏఐ థింత్, వైఫై కనెక్టివిటీ, మల్టీ ఎయిర్ ఫ్లో వంటి అధునాతన ఫీచర్లను అయితే కలిగి ఉంది. ఇది సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్. కంప్రెసర్‌పై 10 ఏళ్ల వారెంటీ లభిస్తోంది.
Celebrities Featured Articles Telugu Movies
HBD Thaman: థమన్ గురించి ఈ విషయాలు తెలిస్తే అస్సలు ట్రోల్ చేయరు..!