కొత్తగా స్మార్ట్‌టీవీ కొనాలని భావిస్తున్న వారికి ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) గుడ్‌న్యూస్ చెప్పింది. భారత్‌లోనే వరల్డ్‌కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో 4K టీవీలపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఫలితంగా తక్కువ ధరలోనే అదిరిపోయే టీవీలను సొంతం చేసుకోవచ్చు. ప్రముఖ కంపెనీలకు చెందిన టాప్ రేటెడ్ టీవీలు ఈ అమెజాన్ క్రికెట్ ఫీవర్ ఆఫర్స్ (Cricket Fevers Offers)లో భాగస్వామ్యం కాబోతున్నాయి. మరో రెండ్రోజుల్లో ఈ ఆఫర్స్ అందుబాటులోకి రానున్నాయి. పరిమిత కాలం మాత్రమే ఇవి అందుబాటులో ఉంటాయి. SBI డెబిట్/ క్రెడిట్ కొనుగోళ్లపై మరో 10% రాయితీ లభించనుంది. భారీ డిస్కౌంట్లతో వస్తున్న టీవీలు ఏవో ఇప్పుడు చూద్దాం.
Hisense (55 inches) Tornado 2.0 Series
Hisenseకు చెందిన 55 అంగుళాల అల్ట్రా హెచ్‌డీ టీవీపై భారీ రాయితీని అమెజాన్ అందించనుంది. దీని అసలు ధర రూ.49,000. SBI బ్యాంక్ ఆఫర్లు, ఎక్చేంజ్ ఆఫర్స్, డిస్కౌంట్ పోనూ ఇది రూ.25,999కే అందుబాటులోకి రానుంది. పైగా 6 నెలల వరకూ NO Cost EMI సౌలభ్యాన్ని కూడా అమెజాన్ కల్పిస్తోంది.
Sony Bravia (65 inches) 4K Ultra HD
స్మార్ట్ టీవీల రంగంలో సోనీకి మంచి గుడ్‌విల్ ఉంది. ఈ నేపథ్యంలోనే సోనీ కంపెనీ చెందిన Sony Bravia (65 inches) 4K Ultra HD టీవీపై అమెజాన్ రాయితీ ప్రకటించింది. దీని అసలు ధర రూ.1,39,000 కాగా బెస్ట్ ప్రైస్ కింద ఇది రూ.82,990కే ఈ టీవీని అందించనుంది. బ్యాంక్, ఎక్స్‌ఛేంజ్, ఇతర డిస్కౌంట్లు పోనూ ఆ ప్రైస్‌కు టీవీ లభించనుంది.
LG (55 inches) 4K Ultra HD
స్మార్ట్ టీవీలను ఇష్టపడే వారిలో ఎక్కువ మంది LG టీవీలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. ఈ నేపథ్యంలో అమెజాన్ LG (55 inches) 4K Ultra HD టీవీని భారీ డిస్కౌంట్‌తో అందించేందుకు సిద్దమైంది. దీని అసలు ధర రూ. 79,900. దీనిపై అన్ని ఆఫర్లు పోనూ రూ. 40,990 బెస్ట్ ప్రైస్‌కే ఇది దక్కనుంది. 18 నెలల NO Cost EMI సౌలభ్యం కూడా దీనిపై ఉంది.
Samsung (43 inches) Crystal iSmart
శామ్‌సంగ్ టీవీని సైతం అమెజాన్ తక్కువ ధరకే అందించబోతోంది. ఈ టీవీ అసలు ధర రూ. 52,990 కాగా, బెస్ట్ ప్రైస్ కింద ఇది రూ.32,990 రానుంది. కొత్తగా శామ్‌సంగ్ టీవీ కొనాలను భావిస్తున్నవారు దీన్ని ట్రై చేయవచ్చు. ఈ టీవీ 4K అల్ట్రా హెచ్‌డీ స్క్రీన్‌ను కలిగింది. దీనిపై 12 నెలల వరకూ NO Cost EMI ఆప్షన్ కూడా ఉంది.
Acer 126 cm (50 inches) V Series TV
Acer కంపెనీకి చెందిన 50 అంగుళాల V Series TV ఈ క్రికెట్ ఫీవర్ ఆఫర్స్‌లో తక్కువ ధరకే లభించనుంది. దీని ఒరిజినల్ ప్రైస్ రూ.59,999. అమెజాన్ ఇచ్చే అన్నీ ఆఫర్లు పోగా ఇది రూ. 32,499కు రానుంది.
TCL (40 inches) Bezel-Less S Series
తక్కువ బడ్జెట్‌లో స్మార్ట్‌టీవీ కోరుకునే వారి కోసం అమెజాన్ మరో మంచి టీవీ ఈ సేల్‌లో తీసుకొస్తోంది. రూ.49,990 ఉన్న TCL 40 అంగుళాల టీవీని రూ.16,990కే అందించబోతోంది. దీనిపై 12 నెలల No Cost EMI, రూ.8000 వరకూ ఎక్స్‌చేంజ్ ఆఫర్ ఉంది.
OnePlus (43 inches) Y Series 4K
ప్రముఖ ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ (OnePlus) నుంచి అదిరిపోయే 4K టీవీని అమెజాన్ డిస్కౌంట్‌కు అందించనుంది. రూ.39,900 ఉన్న OnePlus (43 inches) Y Series 4K టీవీని బెస్ట్ ప్రైస్ కింద రూ.26,999కే అందిస్తోంది (షరతులు వర్తిస్తాయి).
Redmi (43 inches) 4K Ultra HD
చైనీస్ కంపెనీ రెడ్‌మీ తక్కువ బడ్జెట్‌లో అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్న స్మార్ట్ టీవీలను అందిస్తుంటుంది. అయితే ఈ కంపెనీకి చెందిన Redmi (43 inches) 4K Ultra HD మరింత తక్కువకే అందించేందుకు సిద్ధమవుతోంది. దీని అసలు ధర రూ.42,999 కాగా అమెజాన్ దీన్ని బెస్ట్ ప్రైస్ కింద రూ.20,499కే అందించనుంది. ఈ టీవీపై 6 నెలల NO Cost EMIతో పాటు, రూ.5500 వరకూ ఎక్స్‌చేంజ్ ఆఫర్ ఉంది.
LG (50 inches) 4K Ultra HD
LG నుంచి 50 అంగుళాల 4K అల్ట్రా హెచ్‌డీ టీవీ కూడా భారీ రాయితీతో వస్తోంది. దీని అసలు ధర రూ.69,999. అమెజాన్ దీనిని బెస్ట్ ప్రైస్ కింద రూ.39,990కే ఆఫర్ చేయనుంది. ఈ టీవీపై ఏకంగా 18 నెలలపాటు No Cost EMI సౌలభ్యం ఉండనుంది. అంతేకాకుండా అడిషనల్ కూపన్ కింద రూ.1000 లభించనుంది.
Vu (55 inches) Glo Series 4K Ultra HD
క్రికెట్ ఫీవర్ ఆఫర్స్‌లో భారీ రాయితీతో వస్తున్న మరో 4K టీవీ ఇది. ఇది ఆండ్రాయిడ్‌తో పనిచేయనుంది. దీని అసలు ధర రూ. రూ.80,000 కాగా, అమెజాన్ అన్ని ఆఫర్లు పోనూ దీనిని రూ.61,999లకే అందించనుంది.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం