ప్రస్తుత స్మార్ట్ యుగంలో సెల్‌ఫోన్లతో పాటు, టీవీలు సైతం అత్యాధునిక ఫీచర్లతో లభిస్తున్నాయి. ప్రసిద్ధ టెక్ కంపెనీలు శామ్‌సంగ్, LG, రెడ్‌మీ, వన్‌ప్లస్ కంపెనీలు పోటీ పడి మరి తక్కువ ధరకే స్మార్ట్ టీవీలను మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నాయి. అయితే వాటిని ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరింత డిస్కౌంట్‌తో వినియోగదారుల చెంతకు చేరుస్తోంది. మీ బడ్జెట్ రూ.15 వేలు అయితే ఆ ధరకు అమెజాన్‌లో ఎన్నో టీవీలు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిలో అత్యుత్తమ టీవీలను YouSay మీ ముందుకు తీసుకు వచ్చింది. మరి ఆ స్మార్ట్ టీవీలు ఏవి? వాటి ప్రత్యేకతలు, ధర వంటి అంశాలను ఇప్పుడు చూద్దాం.
Acer Android TV
ఏసర్ సిరీస్ HD రెడీ ఆండ్రాయిడ్ ఎల్‌ఈడీ టీవీ (Acer Series HD Ready Android Smart LED TV) రూ.15 వేల లోపు మంచి స్మార్ట్‌టీవీ అని చెప్పవచ్చు. ఇది 32 అంగుళాలు స్క్రీన్ కలిగి ఉంది. 60Hz రిఫ్రెష్ రేట్‌తో (1366×768) రిజల్యూషన్‌ను అందిస్తుంది. ఆండ్రాయిడ్ టీవీ 11, 64-బిట్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఇందులో వినియోగించారు. ఈ స్మార్ట్ టీవీ ధర రూ. 20,999 కాగా 45 శాతం డిస్కౌంట్‌తో రూ.11,499 అమెజాన్ ఆఫర్ చేస్తోంది.
Samsung TV
శామ్‌సంగ్ ఫోన్లతో పాటు టీవీలకు మార్కెట్‌లో మంచి ఆదరణ ఉంది. రూ. 15వేల లోపు శామ్‌సంగ్ స్మార్ట్ టీవీని కోరుకునేవారు Samsung Wondertainment LED TV ట్రై చేయవచ్చు. ఈ స్మార్ట్ TV హై- కాంట్రాస్టింగ్‌తో HD పిక్చర్ క్వాలిటీని అందిస్తుంది. ఈ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. వివిధ పరికరాలను కనెక్ట్ చేయడానికి మల్టిపుల్ పోర్ట్‌లను ఇది ఆఫర్ చేస్తోంది. క్రిస్టల్ క్లియర్ ఆడియో, మ్యూజిక్ సిస్టమ్, పవర్‌ఫుల్ స్పీకర్స్ వంటి అదనపు ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. ఈ స్మార్ట్ టీవీ ధర రూ.22,900 కాగా.. 48 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.11,990కే దీన్ని పొందవచ్చు.
Redmi Fire TV
రెడ్‌మీ నుంచి బడ్జెట్ టీవీ కోరుకునే వారు Redmi Fire TVని పరిశీలించవచ్చు. ఈ స్మార్ట్ టీవీ 32 అంగుళాల డిస్‌ప్లేతో 60Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. అలాగే 178 వైడ్ వ్యూయింగ్ యాంగిల్‌తో (1366×768) రిజల్యూషన్‌ను అందిస్తుంది. ఈ స్మార్ట్ LED టీవీలో 20W Dolby Atmos ఇన్ బిల్ట్‌గా ఉంటుంది. డివైజ్ కనెక్ట్ కోసం Wifi, HDMI, USB పోర్ట్‌ల ద్వారా డ్యుయల్ బ్యాండ్ కనెక్టివిటీని అందిస్తుంది. నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, డిస్నీ+ హాట్‌స్టార్ వంటి సపోర్ట్ అప్లికేషన్‌లను వాయిస్ రిమోట్ అలెక్సాతో ఒక్కసారి ట్యాప్ చేసి ఓపెన్ చేయవచ్చు. ఈ స్మార్ట్ టీవీ ధర రూ. 24,999 కాగా, 58% శాతం డిస్కౌంట్‌తో రూ.10,499కే దీనిని కొనుగోలు చేయవచ్చు.
MI 5A Series TV
అమెజాన్‌లో తక్కువ ధరకు లభిస్తున్న టీవీల్లో MI 5A Series TV మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ 32 అంగుళాల ఆండ్రాయిడ్ LED TVలో మంచి పిక్చర్ క్వాలిటీ ఉంటుంది. ఇది ప్రీమియం బెజెల్ లెస్ లుక్‌ను అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్‌తో లభిస్తుంది. అద్భుతమైన ఆడియో ఎక్స్‌పీరియన్స్ కోసం ఇందులో డాల్బీ అట్మోస్‌ను అందించారు. HDMI, USB పోర్ట్‌లతో ఇది డ్యూయల్ బాండ్ కనెక్టివిటీని ఆఫర్ చేస్తోంది. ఈ ఎల్‌ఈడీ టీవీ ధర రూ.24,999 కాగా, అమెజాన్ దీనిపై 52 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. దీంతో కేవలం రూ.11,999కు దీన్ని కొనవచ్చు.
OnePlus Y Series TV
వన్‌ప్లస్ నుంచి కూడా టాప్‌రేటెడ్ స్మార్ట్ టీవీలు మార్కెట్‌లోకి వస్తున్నాయి. అయితే ఈ కంపెనీ నుంచి తక్కువ ధరలో టీవీ కావాలని భావించే వారికి OnePlus Y Series TV చక్కటి ఎంపిక కాగలదు. 32 అంగుళాల ఈ స్మార్ట్ టీవీ.. 60Hz రిఫ్రెష్ రేట్, (1366×768) రిజల్యూషన్‌తో డైనమిక్ డిస్‌ప్లేతో వస్తోంది. ఈ అండ్రాయిడ్ టీవీలో శక్తివంతమైన 64-బిట్ ప్రాసెసర్ ఉపయోగించారు. అత్యుత్తమ సౌండ్ ఎక్స్‌పీరియన్స్ కోసం 20W డాల్బీ అట్మోస్ స్పీకర్ ఇందులో అమర్చారు. ఈ టీవీ గూగుల్ అసిస్టెంట్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ధర రూ.19,999 కాగా ప్రస్తుతం దీనిపై అమెజాన్ 40 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. దీంతో దీన్ని రూ.11,999కు సొంతం చేసుకోవచ్చు.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!