యంగ్ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) పేరు చెప్పగానే క్లాస్ లుక్స్, పద్దతిగా ఉండే పాత్రలే గుర్తుకు వస్తాయి. అయితే ‘డీజే టిల్లు 2’ సినిమాలో ఈ భామను చూసిన వారంతా తమ అభిప్రాయాన్ని మార్చుకుంటున్నారు.
ఎందుకంటే రీసెంట్‌గా రిలీజైన ‘డీజే టిల్లు 2’ ట్రైలర్ ఈ భామను చూసిన వారంతా నోరేళ్లబెడుతున్నారు. ఈ సినిమాలో అనుపమా గట్టిగానే అందాలు ఆరబోసినట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది.
తాజా ట్రైలర్‌లో ఈ భామ హీరో సిద్ధుతో ఓ సీన్‌లో ఘాటైన ముద్దు సీన్‌లో కనిపించింది. ఇది చూసిన అనుపమా ఫ్యాన్స్ నివ్వెరపోతున్నారు. ఒకప్పుడు చూసిన అనుపమానేనా తాము చూస్తోందని ప్రశ్నించుకుంటున్నారు.
కొన్నాళ్ల ముందు ‘రౌడీ బాయ్స్’ (Rowdy Boys) సినిమాలో నటించిన అనుపమ.. కొత్త కుర్రాడు ఆశిష్‌తో ముద్దు సన్నివేశాలు చేసి అందరికి షాకిచ్చింది.
ఆ సినిమాలో ఒక్క లిప్‌లాక్‌కే పరిమితం కాలేదు ఈ కేరళ కుట్టి. నాలుగైదు సన్నివేశాల్లో హీరో ఆశిష్ పెదాలను తన అదరాలతో లాక్ చేసేసింది. హీరో పెదాలకు ఊపిరి ఆడకుండా ముద్దులిచ్చింది.
రౌడీబాయ్స్ సినిమాలో బెడ్ రూం సీన్లకు కూడా అనుపమ ఒకే చెప్పేసింది. నిర్మొహమాటంగా నటించి రొమాన్స్‌ని పండించింది. ఈ సినిమా విడుదలయ్యాక అనుపమ రొమాన్స్ సీన్లు టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారాయి.
దీని తర్వాత మళ్లీ ‘కార్తికేయ 2’, ‘18 పేజీస్’ లాంటి సినిమాల్లో కాస్త నార్మల్‌గా కనిపించి ఒకప్పటి అనుపమాను గుర్తు చేసింది. ఈ చిత్రాల్లో తన అందం, అభినయంతో అనుపమా ఆకట్టుకుంది.
ఇప్పుడు ‘డీజే టిల్లు 2’ ఈ భామ పూర్తిగా రెచ్చిపోయింది. హాట్‌గా కనిపించడంతో పాటు ఘాటైన లిప్ కిస్ సీన్స్ చేసింది. ఈ తరహా పాత్ర అనుపమ గతంలో చేయలేదు. ఇదే ఆమెకు తొలిసారి.
అయితే ఇలా గ్లామర్ ట్రీట్ ఇవ్వడం కోసం అనుపమా గట్టిగానే రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు ఫిల్మ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇప్పటివరకు ఒక్కో సినిమాకు రూ.కోటి నుంచి కోటిన్నర మధ్య రెమ్యునరేషన్ తీసున్న అనుపమ.. ‘టిల్లు స్వ‍్కేర్’ కోసం మాత్రం రూ.2 కోట్ల వరకు పారితోషికం అందుకుందట.
గ్లామర్ షో చేసినందుకు ఇదా అసలు కారణమని సినీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఒకవేళ ఈ మూవీ హిట్ అయితే ఇదే మొత్తాన్ని రెమ్యునరేషన్‌గా తీసుకోవాలని ఈ బ్యూటీ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. .
కేరళ కుట్టి అనుపమ.. సొంత భాషలో తీసిన ‘ప్రేమమ్’ (Premam) మూవీతో హీరోయిన్ అయిపోయింది. నితీన్ హీరోగా చేసిన ‘అఆ’ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.
దీని తర్వాత ‘శతమానం భవతి’, ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు ప్రేమ కోసమే తదితర చిత్రాల్లో నటించింది. వీటన్నింటిలో కాస్త సంప్రదాయంగా ఉండే పాత్రల్లో కనిపించింది. ఎక్కడా గీత దాటలేదు.
మాస్ మహారాాజా రవితేజ లేటెస్ట్ చిత్రం ఈగల్ (Eagle)లోనూ అనుపమా మెరిసింది. ఇందులో జర్నలిస్టు పాత్ర పోషించి మంచి నటనను కనబరిచింది.
అలాగే తమిళంలో ‘సైరెన్’ అనే సినిమాలో ఈ కేరళ కుట్టి నటించింది. ఈ చిత్రం ఈ వారమే థియేటర్లలో సందడి చేయనుంది.
ప్రస్తుతం మలయాళంలో ‘JSK Truth Shall Always Prevail’ అనే సినిమాలో నటిస్తున్న వికిపీడియాను బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉన్నట్లు సమాచారం.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం