ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బ్రాండ్లలో యాపిల్ ఒకటి. ఈ కంపెనీ నుంచి విడుదలయ్యే ప్రతీ గ్యాడ్జెట్ మన్నికైనదిగా యూజర్లు భావిస్తారు. పైగా,ఇతర బ్రాండ్ల డివైజ్‌లతో పోలిస్తే ధర కూడా ఎక్కువే. యూజర్లను ఆకర్షించడానికి యాపిల్ కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త బ్రాండ్లను విడుదల చేస్తుంటుంది. తాజాగా మరో గ్యాడ్జెట్‌ని యాపిల్ ఆవిష్కరించింది. 15 అంగుళాల యాపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్‌ని కంపెనీ రివీల్ చేసింది. ఈ ల్యాప్‌టాప్ ఫీచర్లేంటో తెలుసుకుందాం.
వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ 2023లో భాగంగా యాపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ 15ని అధికారికంగా లాంచ్ చేసింది. 15 అంగుళాల తెర కలిగిన క్యాటగిరీలలో ప్రపంచంలోనే అత్యత్తమమైన ల్యాప్‌టాప్‌గా ఇది నిలవనుంది. పైగా, ఇది చాలా పలుచని మందాన్ని కలిగి ఉంది. 11.5 మిల్లీమీటర్ల థిక్‌నెస్‌తో 15 ఇంచుల నోట్‌బుక్ విభాగంలో అతి సన్ననైన ల్యాప్‌టాప్‌గా నిలుస్తోంది. ఇక బరువు విషయానికి వస్తే కేవలం 1.49 కేజీలే. అయితే, ఈ కాన్ఫరెన్స్‌లో మ్యాక్‌బుక్ ఎయిర్‌తో పాటు యాపిల్ మరో రెండు ప్రొడక్టులను అనౌన్స్ చేసింది. మ్యాక్ ప్రొ, మ్యాక్ స్టూడియోలను టెక్ ప్రియులకు పరిచయం చేసింది.
ధర ఎంతంటే?
మ్యాక్ బుక్ ఎయిర్ 15 ఇంచ్ ల్యాప్‌టాప్ బేస్ వేరియంట్ ధర రూ.1,34,900. జూన్ 13 నుంచి అందుబాటులోకి రానుంది. దీంతో 13 ఇంచుల మ్యాక్‌బుక్ ఎయిర్ ధర పడిపోనుంది. ప్రస్తుతం భారత్‌లో ఈ ల్యాప్‌టాప్ ధర రూ.1,24,900గా ఉంది.
స్టోరేజీ..
మ్యాక్‌బుక్ ఎయిర్ 15 ఇంచ్ ల్యాపీ స్టోరేజీ మోస్తరుగా ఉంది. 8GB RAMతో బేస్ వేరియంట్ వస్తోంది. 256 GB ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉంది. 2 టెరాబైట్స్ వరకు ఎస్ఎస్‌డీ స్టోరేజీ, 24జీబీ యునిఫైడ్ మెమొరీతో రానుంది. మ్యాక్ బుక్ ఎయిర్ 13తో పోలిస్తే ఇది ఎక్కువే.
కలర్ వేరియంట్స్..
ఈ ల్యాప్‌టాప్ 4 కలర్ వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. మిడ్‌నైట్, స్టార్ లైట్, సిల్వర్, స్పేస్ గ్రే రంగుల్లో ల్యాప్ టాప్ లభించనుంది.
డిస్‌ప్లే..
ల్యాప్‌టాప్ 15.3 అంగుళాల లిక్విడ్ రెటీనా డిస్‌ప్లేని కలిగి ఉంది. 500 నిట్స్ ఆఫ్ పీక్ బ్రైట్‌నెస్ వరకు సపోర్ట్ చేయగలదు. 13 ఇంచ్ మోడల్ మాదిరే దీనికి కూడా 1080p ఫేస్‌టైమ్ వెబ్ కెమెరాను కంపెనీ అమర్చింది.
ప్రాసెసర్..
ప్రాసెసర్ విషయంలో కంపెనీ ఎలాంటి మార్పులు చేయలేదు. 13 అంగుళాల మ్యాక్‌బుక్ ఎయిర్‌లో ఉపయోగించిన M2 ప్రాసెసర్‌నే ఇందులోనూ వాడింది. ప్రస్తుతం మార్కెట్లో బెస్ట్ సెల్లింగ్ ప్రాసెసర్ అయిన ఇంటెల్ కోర్ ఐ7 కన్నా ఇది రెండు రెట్లు వేగంగా పనిచేస్తుంది. ఆక్టాకోర్, డెకాకోర్ సీపీయూల వరకు మ్యాక్‌బుక్ ఎయిర్ ఆఫర్ చేస్తోంది.
బ్యాటరీ, సౌండ్ అండ్ డిజైన్..
మ్యాక్ బుక్ ఎయిర్ 15 ల్యాప్‌టాప్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 18 గంటల వరకు పనిచేస్తుందని కంపెనీ వెల్లడించింది. మ్యాగ్ సేఫ్ లేదా యుఎస్‌బీ టైప్ సీ పోర్ట్ ద్వారా ల్యాపీని ఛార్జ్ చేసుకోవచ్చని తెలిపింది. 6 స్పీకర్లతో సౌండ్ సెటప్ రానుంది. సౌండ్ క్లారిటీ చాలా బాగుంటుంది. ఫ్యాన్‌లెస్ డిజైన్‌తో రూపుదిద్దుకుంది.
సైజుపై అసంతృప్తి..
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ గ్యాడ్జెట్ల పరిమాణం తగ్గుతూ వస్తోంది. కానీ, లెటెస్ట్‌గా యాపిల్ స్క్రీన్ సైజ్ పెంచడంపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 13 అంగుళాల మ్యాక్ బుక్ ఎయిర్‌ని సులువుగా చేతిలో హ్యాండిల్ చేసేందుకు వీలుండేదని గుర్తు చేసుకుంటున్నారు. సైజ్, స్పేస్‌కి ప్రాధాన్యమిచ్చే వారిని ఈ కొత్త మ్యాక్ బుక్ ఎయిర్ అంతగా ఆకట్టుకోక పోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Celebrities Featured Articles Telugu Movies
Prabhas Upcoming Movies: ఇండియాలోని టాప్ డైరెక్టర్స్‌తో ప్రభాస్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్!