శ్రీవిష్ణు, అమృతా అయ్యర్ జంటగా తెరకెక్కిన రీసెంట్ మూవీ అర్జున ఫల్గుణ. డిఫరెంట్ మూవీ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కరోనా కంగారు తర్వాత థియేటర్లలో సినిమాలు రిలీజ్ చేయాలా వద్దా? అని అంతా ఆలోచిస్తున్న తరుణంలో శ్రీ విష్ణు ధైర్యం చేసి రాజరాజచోర సినిమాను రిలీజ్ చేశాడు. ఈ సినిమా గ్రాండ్ విక్టరీ సాధించింది. ఈ ధైర్యంతో చాలా మంది తమ సినిమాలను నేరుగా థియేటర్లలో విడుదల చేశారు. అటువంటి శ్రీ విష్ణు హీరోగా నటించిన అర్జున ఫల్గుణ అనే మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. ట్రైలర్లు, పాటలు, డిఫరెంట్ లుక్‌తో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు.
సీనియర్ నటులు..
ఈ మూవీలో నరేష్, శివాజీ రాజా, దేవీ ప్రసాద్ వంటి సీనియర్ నటులు స్క్రీన్ పంచుకున్నారు. అయినప్పటికీ ఈ సినిమా మాత్రం పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దర్శకుడు చెప్పే పాయింట్‌ను క్లియర్ కట్‌గా చెప్పలేకపోయాడని చాలా మంది ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు.
అసలు కథేంటంటే…
గోదావరి జిల్లాలోని ముల్కల్లంక అనే ఊరిలో డిగ్రీ పూర్తయి ఐదుగురు ఫ్రెండ్స్ అర్జున్ (శ్రీవిష్ణు), రాంబాబు(రాజ్ కుమార్), తాడి(రంగస్థలం మహేశ్), ఆస్కార్(చైతన్య గరికపాటి), శ్రావణి (అమృతా అయ్యర్) ఆవారాగా తిరుగుతూ ఉంటారు. వారు ఎలాగైనా సరే డబ్బు సంపాధించి చాలా రిచ్‌గా బతకాలని కలలు కంటుంటారు. సిటీకి వెళ్లి డబ్బులు సంపాధించడం కంటే ఉన్న ఊర్లోనే ఏదైనా చేసి తల్లిదండ్రులను హ్యాపీగా చూసుకోవాలనుకుంటారు. వారు డబ్బు సంపాధించేందుకు ఓ సోడా సెంటర్ పెట్టాలని భావిస్తారు. కానీ అందుకోసం నాలుగు లక్షల రూపాయలు అవసరం పడతాయి. అందుకు హీరో గ్యాంగ్ బ్యాంకులోనుకు ట్రై చేస్తుంది. కానీ రూ. 50 వేలు ఉంటేనే లోన్ వస్తుందని తెలియడంతో ఆ డబ్బులు సంపాధించేందుకు గంజాయిని స్మగ్లింగ్ చేస్తారు. అలా గంజాయి తరలిస్తున్న క్రమంలో ఆ అయిదుగురు ఫ్రెండ్స్ పోలీసులకు పట్టుబడతారు. ఇక అప్పటి నుంచి వారి జీవితాలు మలుపు తిరుగుతాయి.
ఇరగదీసిన శ్రీ విష్ణు..
శ్రీవిష్ణు ఎప్పటిలాగానే తన సహజ నటనతో ఇరగదీశాడు. అర్జున్ పాత్రలో ఒదిగిపోయాడు. ఇక శ్రావణిగా చేసిన హీరోయిన్ అమృత అయ్యర్ నటన కూడా పరవాలేదనిపిస్తుంది. కానీ తనకు నటించేందుకు ఎక్కువ స్కోప్ లేదు. ఇక హీరో స్నేహితులుగా నటించిన మహేశ్, చైతన్య, రాజ్ కుమార్ కూడా బాగానే చేశారు. ఇకపోతే కన్నింగ్ కరణంగా సీనియర్ నరేశ్, రైతుగా దేవీ ప్రసాద్, హీరో శ్రీ విష్ణు తండ్రిగా శివాజీ రాజా ఎప్పటిలాగే తమ నటనతో మెప్పించారు.
తడబడ్డ దర్శకుడు..
జోహార్ వంటి హిట్ సినిమాను తెరకెక్కించిన తేజ మార్ని అర్జున ఫల్గుణ మూవీ సమయంలో మాత్రం తడబడ్డాడని అనిపిస్తుంది. తేజ ఎంచుకున్న కథ చాలా రొటీన్. రొటీన్ కథలైనా ఆకట్టుకునే స్క్రీన్ ప్లేతో నెరేట్ చేస్తే ప్రేక్షకులకు చాలా థ్రిల్ కలుగుతుంది. కానీ అర్జున ఫల్గుణ విషయంలో దర్శకుడు అది చేయలేకపోయాడు. స్లో నెరేషన్‌తో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాడు. సినిమాలో కొన్ని సీన్లు పరవాలేదనిపించినా, కొన్ని సీన్లు మాత్రం బోర్ కొడతాయి. అసలు ఆ సీన్లకు లాజిక్ ఉందా అనే ప్రశ్న మన మనసులో తలెత్తుతుంది. ఇక ఈ సినిమాలోని ఎమోషన్ సీన్స్ కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు.
పరవాలేదనిపించిన డైలాగ్స్ కానీ…
సుధీర్ వర్మ రాసిన డైలాగులు కొంత మేర ఆకట్టుకున్నాయి. కానీ ఎడిటర్ పనితనం మాత్రం అస్సలు బాగోలేదు. ఇక ప్రియదర్శన్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం (బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్) అక్కడక్కడా అతిగా ఉన్నా కానీ పరవాలేదు. ఇక జగదీశ్ అందించిన సినిమాటోగ్రఫీకి మాత్రం ఎటువంటి వంక పెట్టే అవసరం లేదు. తను తన పనితనంతో గోదావరి అందాలను చాలా చక్కగా చూపించాడు. అయినా కానీ దర్శకుడు తను అనుకున్న పాయింట్ ను చెప్పడంలో మాత్రం తడబ్డాడు.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!