నాగార్జున హీరోగా చేస్తున్న తాజా చిత్రం ‘నా సామిరంగ’ (Naa Sami Ranga). ఇందులో కథానాయికగా ‘ఆషికా రంగనాథ్’ (Ashika Ranganath) చేస్తున్నారు. వరలక్ష్మీ పాత్రలో ఆమె కనిపించబోతున్నారు. ఈ పాత్రకు సంబంధించిన ఫస్ట్ పోస్టర్, గ్లింప్స్‌ను ఇటీవలే చిత్ర యూనిట్ విడుదల చేయగా వాటికి మంచి స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో ఆషికా రంగనాథ్‌కు సంబంధించిన విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
టాలీవుడ్‌లో ఇప్పటికే ఆషిక ఓ సినిమా చేసింది. ‘అమిగోస్’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను తొలిసారి పలకరించింది. ఇందులో కళ్యాణ్‌రామ్ సరసన ఆమె నటించింది.
ఓ ఈవెంట్ కోసం ఆషిక హైదరాబాద్ వచ్చిన సందర్భంలో ఆమె అమిగోస్ డైరెక్టర్ కంట పడ్డారట. దీంతో ఫోన్‌లోనే ఆయన ఆషికకు కథ వినిపించి హీరోయిన్‌గా ఫైనల్ చేశారట.
ఆషిక కర్ణాటకలో జన్మించింది. బెంగళూరులో డిగ్రీ పూర్తి చేసింది. అయితే సినిమాల్లోకి రావాలన్న ఆలోచనే తనకు ఉండేదని కాదని ఆషిక తెలిపింది.
అయితే ఓ సారీ కాలేజీలో జరిగిన అందాల పోటీల్లో పాల్గొన్నట్లు ఆషిక ఓ ఇంటర్యూలో చెప్పింది. తనకు క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్‌గా గుర్తింపు వచ్చిందని పేర్కొంది. ఆ పోటీల్లో చూసి ‘క్రేజీబాయ్’ అనే కన్నడ సినిమాలో డైరెక్టర్ అవకాశమిచ్చినట్లు తెలిపింది.
ఈ భామ నటనతో పాటు డ్యాన్స్‌లోనూ శిక్షణ తీసుకుంది. కాలేజీలో సాంస్కృతిక కార్యక్రమాల్లో పలు ప్రదర్శనలు సైతం ఇచ్చింది. ఫ్రీస్టైల్, బెల్లీ, వెస్టర్న్ డ్యాన్స్ విభాగాల్లో ఆషికకు ప్రావీణ్యం ఉంది.
ఈ బ్యూటీ ఫేవరేట్ హీరో పునీత్ రాజ్‌కుమార్. పరిశ్రమలోనికి రాగానే పునీత్ సినిమాలో నటించే అవకాశం రావడంతో ఎగిరి గంతేసినట్లు ఆషిక చెప్పింది. ఆయన మరణంతో చాలా బాధపడినట్లు పేర్కొంది.
తెలుగుపై కాస్త పట్టు ఉన్నట్లు ఆషిక ఓ సందర్భంలో చెప్పింది. తెలుగు బాగా అర్థం అవుతుందని తెలిపింది. చిన్నప్పటి నుంచి నాన్నతో కలిసి తెలుగు సినిమాలు బాగా చూడటం, పాటలు వినడం వంటివి చేసేదట. బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రాలను చాలా సార్లు చూసిందట.
ఈ బ్యూటీకి పుస్తకాలు చదవటమంటే చాలా ఇష్టమట. స్పూర్తినిచ్చే జీవిత గాథలు, మోటివేషన్ స్పీచ్‌లు వింటూ ఉంటుందట. ఎప్పటికప్పుడు మార్పు కోసం ప్రయత్నిస్తూ ఉంటానని ఆషిక చెప్పింది.
ఈ బ్యూటీ ఫిట్‌నెస్‌పై ఎక్కువగా ఫోకస్ పెడుతుందట. ఆహారం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటానని చెబుతోంది. వారానికి నాలుగు సార్లు జిమ్‌లో రెండేసి గంటలు కఠిన వర్కౌట్లు చేస్తుందట.
రాజమౌళి దర్శకత్వం అంటే ఆషికకు ఎంతో ఇష్టమట. ఆయన సినిమాల్లో ఒక్కసారైన నటించాలని ఉందట. రణ్‌బీర్ అంటే చిన్నప్పటి నుంచి క్రష్ అని ఆషిక చెబుతోంది.