• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆవిష్కరణపై ఆనంద్‌ మహీంద్ర ట్వీట్

    సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉండే ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్రా వినూత్న ఆవిష్కరణలకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. బైక్‌ మాదిరిగా కనిపిస్తూ ఆరుగురు కూర్చునే విధంగా వేర్వేరు సీట్లతో పొడవుగా రూపొందించిన ఓ వాహనం [వీడియో](url)ను ఆయన పోస్ట్ చేశారు. రూ. 10-12 వేలతో రూపొందించవచ్చని అందులోని వ్యక్తి చెప్పగా..కొద్దిపాటి మార్పులతో ఐరోపాలో టూరిస్ట్‌ బస్సులా వినియోగించవచ్చని ఆనంద్‌ మహీంద్ర అన్నారు. With just small design inputs, (cylindrical sections for the chassis @BosePratap ?) this device … Read more

    అయోధ్యలో హనుమాన్‌

    హనుమాన్‌ చిత్ర యూనిట్ రామజన్మభూమి ప్రాంతమైన అయోధ్యలో పర్యటించింది. దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జ స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆధ్యాత్మిక ప్రదేశాన్ని సందర్శించి రాముడి ఆశీర్వచనాలు తీసుకున్నామంటూ చిత్రబృందం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన [వీడియో](url)ను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంది. ఇటీవల విడుదలైన హనుమాన్ టీజర్‌కు దేశవ్యాప్తంగా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. A Glimpse into the whirlwind tour of Team #HanuMan to Ayodhya, where they sought the divine blessings of the … Read more

    ముంబయిలో కొరియన్ యూట్యూబర్‌కి వేధింపులు

    ముంబయిలో ఓ కొరియన్ యూట్యూబర్‌ను ఆకతాయిలు వేధించిన [వీడియో ](url)సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆమె లైవ్‌ స్ట్రీమింగ్‌లో ఉండగా ఓ యువకుడు ఆమెను బైక్‌పై రావాలని అడిగాడు. బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. అంతేకాదు ముద్దు కూడా పెట్టాలని చూశాడు. ఆమె నిరాకరించడంతో అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. కర్ ప్రాంతంలో రాత్రి జరిగిందని భావిస్తున్నారు. కఠినంగా శిక్షించాలని పలువురు కోరుతున్నారు. అతడు తనను వేధించాడని యువతి పేర్కొంది. @MumbaiPolice A streamer from Korea was harassed by these boys in Khar last … Read more

    ధోని, పాండ్యా రచ్చ చూశారా ?

    దుబాయ్ లో ఇటీవల జరిగిన ఓ వేడుకలో ధోనీతో కలిసి సరాదాగా గడిపిన [వీడియో](url)ను క్రికెటర్ హార్దిక్ పాండ్యా అభిమానులతో పంచుకున్నాడు. ఇందులో ధోనీ, పాండ్యాతో పాటు ఇషాన్ కిషన్, కృనాల్ పాండ్యా తమదైన స్టెప్పులు వేశారు. వివిధ పాటలకు హుషారుగా డాన్స్ చేశారు. రాపర్ బాద్ షా కూడా వీళ్లతో జతకట్టాడు. దీనికి అదరగొట్టారంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఇటీవల న్యూజిలాండ్ తో టీ-20 సిరీస్ ముగియగానే పాండ్యా, ఇషాన్ దుబాయ్ కు వెళ్లారు. View this post on Instagram A … Read more

    బద్ధలైన అగ్నిపర్వతం

    అమెరికాలోని హవాయ్ మౌనా లావోప్రపంచంలోనే అత్యంత పెద్దదైనా అగ్ని పర్వతం బద్దలయ్యింది. 1984 తర్వాత మళ్లీ జరగటం ఇదే మెుదటిసారి. అగ్నిపర్వతం ధాటికి ఆ ప్రాంతంలో ఆకాశం ఎర్రగా మారినట్లు కనిపించింది. ఆ ప్రాంతంలో భూకంపం రావటంతోనే విస్పోటనం జరిగిందని భావిస్తున్నారు. [లావా](url) అక్కడే ఉందని, అందువల్ల దిగువ ప్రాంతంలో నివసించే ప్రజలకు ఎలాంటి ముప్పు లేదని భావిస్తున్నారు. Mauna Loa eruption shots from early this morning. Flights cancelled in and out of local airports… strap in … Read more

    రష్యన్ భాషలో పుష్ప ట్రైలర్

    బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన అల్లు అర్జున్ పుష్ప చిత్రాన్ని రష్యన్ లో విడుదల చేయనున్నారు. ఇప్పటికే డిసెంబర్ 8న విడుదలకు ముహుర్తం ఖరారయ్యింది. కేవలం వారం మాత్రమే సమయం ఉండటంతో ట్రైలర్ ను విడుదల చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా ట్రైలర్ కట్ చేయకుండా…మన దగ్గర రిలీజ్ చేసిన దానికి రష్యన్ లో డబ్బింగ్ చెప్పారు. భారీ అంచనాలతో వచ్చిన పుష్ప ట్రెండ్ సెట్ చేసింది. అల్లు అర్జున్ మ్యానరిజమ్ అన్నిచోట్లకు పాకింది.

    చాహల్ కూలీ వాడయ్యాడు: శిఖర్ ధావన్

    స్పిన్నర్ చాహల్, అతడి భార్య ధన్య శ్రీని శిఖర్ ధావన్ సరదాగా ఆటపట్టించాడు. కివీస్ తో మూడో వన్డే కోసం భారత జట్టు క్రైస్ట్ చర్చ్ కు పయనమయ్యింది. ఈ క్రమంలో కుటుంబంతో సహా ఆటగాళ్లు బయలుదేరారు. చాహల్ చేతినిండా[ లగేజీ](url) తీసుకొని వస్తున్నాడు. అతడి భార్య వెనకాల తక్కువ లగేజీతో తీసుకువస్తుండటంతో అప్పుడే భర్తను కూలీ వాడిని చేసిందంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. తన కాలు సరిగా లేదని అందుకే అలా చేశానని ఆమె నవ్వుతూ సమాధానమిచ్చారు. View this post on Instagram … Read more

    మ్యాచ్ లో హిజాబ్ కు వ్యతిరేకంగా నిరసన

    ఇరాన్ లో హిజాబ్ కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంపై [నిరసన](url)లు ఫిఫా వరల్డ్ కప్ కు చేరాయి. నిన్న పోర్చుగల్, ఉరుగ్వే మధ్య జరిగిన మ్యాచ్ మధ్యలో ఓ వ్యక్తి మైదానంలోకి దూసుకువచ్చి ఇరాన్ ఆందోళనలపై నిరసన తెలిపాడు. ఇరాన్ మహిళలను గౌరవించండి అనే టీషర్ట్ ధరించాడు. రెయిన్ బో రంగుల జెండా పట్టుకొని మైదానంలో కొద్దిసేపు పరిగెత్తాడు. అతడిని వెంబడించిన భద్రతా సిబ్బంది బయటకు పంపించారు. ఇప్పటికీ పలుసార్లు అతడు ఇలా నిరసనలు తెలిపాడని పేర్కొన్నారు. An LGBTQ protestor ran onto … Read more

    నన్ను చంపుతారంటా: తెరాస కార్పొరేటర్

    హైదరాబాద్ ఉప్పల్ ఎమ్మెల్యే భేతీ సుభాష్ రెడ్డిపై సొంత పార్టీ నుంచే విమర్శలు వస్తున్నాయి. తనను అసభ్యంగా తిడుతూ చంపేస్తానని బెదిరింపులకు దిగుతున్నాడని కార్పొరేటర్ బొంతు శ్రీదేవి ఆరోపించారు. బీసీ మహిళనైన తనను చెప్పుకోలేని విధంగా తిడుతున్నాడని కన్నీరు పెట్టుకున్నారు. 10 వేలు ఇచ్చి రౌడీలు, గుండాలతో బెదిరింపులకు పాల్పడుతున్నాడని చెప్పారు. కనీసం ప్రొటోకాల్ పాటించడం లేదన్నారు. కుషాయిగూడలో మోడల్ దోబీ ఘాట్ ను తనను పిలవకుండానే ప్రారంభించారని తెలిపారు.

    ఆఫ్తాబ్ పై కత్తితో దాడికి యత్నం

    శ్రద్ధా వాకర్ హత్య కేసు నిందితుడు ఆఫ్తాబ్ పై కొందరు [దాడి](url)కి యత్నించారు. దిల్లీలోని ఫోరెన్సిక్ కార్యాలయం నుంచి అతడిని తీసుకెళుతుండగా ఇద్దరు వ్యక్తులు కత్తులతో పోలీసు వాహనాన్ని అడ్డుకున్నారు. అప్రమత్తమైన పోలీసులు వారిని నిలువరించారు. అయినప్పటికీ కొద్దిదూరం వాహనాన్ని వెంబడించారు. ఆఫ్తాబ్ ను చంపుతామంటూ బెదిరించారు. ఆందోళనకారులు హిందూసేనకు చెందిన కార్యకర్తలుగా పోలీసులు గుర్తించారు. వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆఫ్తాబ్ కి పాలిగ్రఫీ నిర్వహించారు. #WATCH | Police van carrying Shradhha murder accused Aftab … Read more