శ్రద్ధా వాకర్ హత్య కేసు నిందితుడు ఆఫ్తాబ్ పై కొందరు [దాడి](url)కి యత్నించారు. దిల్లీలోని ఫోరెన్సిక్ కార్యాలయం నుంచి అతడిని తీసుకెళుతుండగా ఇద్దరు వ్యక్తులు కత్తులతో పోలీసు వాహనాన్ని అడ్డుకున్నారు. అప్రమత్తమైన పోలీసులు వారిని నిలువరించారు. అయినప్పటికీ కొద్దిదూరం వాహనాన్ని వెంబడించారు. ఆఫ్తాబ్ ను చంపుతామంటూ బెదిరించారు. ఆందోళనకారులు హిందూసేనకు చెందిన కార్యకర్తలుగా పోలీసులు గుర్తించారు. వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆఫ్తాబ్ కి పాలిగ్రఫీ నిర్వహించారు.