• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నోకియా మరో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ NokiaC99

    ఒకప్పుడు మార్కెట్‌ను ఏలి ఇప్పుడు డీలా పడిన నోకియా మరో స్మార్ట్‌ఫోన్‌ ఆవిష్కరించింది. నోకియా C99 పేరిట మార్కెట్‌లోకి కొత్త ఫోన్ రాబోతోంది. బార్సిలోనాలో జరిగిన MWC 2023 ‘నోకియా సీ99’ అడుగుపెట్టింది. దీని ధర సుమారు 480 డాలర్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంటే దాదాపు రూ. 36,000 కంటే ఎక్కువే. ఈ స్మార్ట్‌ఫోన్ 6.7” డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్, 144 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 180W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. 2023 మూడో … Read more

    డైరెక్టర్‌ నన్ను రేప్‌ చేశాడు: పాయల్ గోష్

    దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ తనను రేప్‌ చేశాడని నటి పాయల్‌ గోష్‌ తీవ్ర ఆరోపణలు చేసింది. ‘ నేను దక్షిణాదిలో ఇద్దరు అవార్డ్‌ విన్నింగ్‌ డైరెక్టర్స్‌తో పనిచేశాను. కానీ వాళ్లు నన్నెప్పుడు కనీసం అభ్యంతరకంగా తాకలేదు. బాలివుడ్‌లో అనురాగ్‌ కశ్యప్‌తో ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ కలిసిన మూడోసారే నన్ను రేప్‌ చేశాడు.’అంటూ ట్వీట్‌ చేసింది. Courtesy Twitter:Payal Ghosh Courtesy Twitter:Payal Ghosh

    లక్షల చేపలు మృత్యువాత

    [VIDEO](url):ఆస్ట్రేలియా న్యూ సౌత్‌వేల్స్‌లోని మారుమూల పట్టణం మెనిండీ సమీపంలోని నదిలో దారుణ పరిస్థితి నెలకొంది. లక్షలాది చేపలు మృత్యువాత పడి నీటిలో తేలుతున్న వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. నదిలో తగ్గడంతో పాటు వేడి వాతావరణం కారణంగా నీటిలో ఆక్సిజన్‌ శాతం పడిపోవడమే చేపలు చనిపోవడానికి కారణమని అధికారులు చెబుతున్నారు. నదిలో చేపల సంఖ్య పెరగడం అందుకు సరిపడా ఆక్సిజన్ లేకపోవడం వల్ల మృత్యువాత పడుతున్నాయని చెప్పారు. Another catastrophic mass fish death in the Menindee Lakes. The reality is … Read more

    INDvsAUS: భారత్ విజయం

    వాంఖడే వేదికగా ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి వన్డేలో టీమిండియా విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాపై భారత బౌలర్లు విజృంభించారు. 188 పరుగులకే కుప్పకూల్చారు. పేసర్లు షమీ, సిరాజ్‌ ధ్వయం చెరో 3 వికెట్లు తీసుకున్నారు. జడేజా 2 వికెట్లు పడగొట్టగా, హార్దిక్, కుల్దీప్ తలో వికెట్‌ తీశారు. ఆస్ట్రేలియా బ్యాటర్లలో మిచెల్ మార్ష్‌ ఒక్కడే 85 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఛేదనలో కంగారూ బౌలర్లు భారత్‌ను బెంబేలెత్తించారు. కేఎల్‌ రాహుల్‌ అర్ధశతకంతో బాధ్యాతాయుత ఇన్నింగ్స్‌ ఆడి టీమిండియాను గెలిపించాడు.

    మహేశ్‌- రాజమౌళి ఫోటో వైరల్‌

    ఇంటర్నెట్‌లో ఓ ఫోటో వైరల్‌ మారింది. లక్షల లైకులు, కామెంట్లతో ట్రెండింగ్‌లోకి వెళ్లింది. రాజమౌళి-మహేశ్‌ బాబు ఇటీవల ఎక్కడో కలిసిన ఫోటో ఇది. ఇది ఎలా బయటకొచ్చిందో తెలియదుగానీ నిమిషాల వ్యవధిలోనే ట్రెండింగ్‌లోకి దూసుకెళ్తోంది. #SSMB29 వర్కింగ్‌ టైటిల్‌తో పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. అయితే వారు ఎక్కడ కలిశారు? ఎలా కలిశారు అని ఆరా తీస్తున్నారు.

    ఇన్‌స్టా పరిచయం..గర్భవతిని చేసి మాయం

    ఇన్‌స్టాగ్రాంలో పరిచయమైన యువకుడు ప్రేమ పేరుతో దగ్గరై యువతిని గర్భవతిని చేశాక మొహం చాటేసిన ఘటన హైదరాబాద్‌లో జరిగింది. బంజారాహిల్స్‌లో నివాసించే 22 ఏళ్ల యువతికి, 2020లో వరంగల్‌కు చెందిన కల్యాణ్‌ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ప్రేమ పేరుతో దగ్గరవడంతో శారీరకంగా కలిశారు. యువతి గర్భం దాల్చాక.. అబార్షన్‌ చేయించుకోవాలని లేదంటే యాసిడ్‌ పోస్తానని బెదిరించాడు. ఆ తర్వాత వారం రోజులు కనిపించకుండా పోవడంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

    కస్టడీ టీజర్‌, బీజీఎం అదిరిపోయాయి!

    యువసామ్రాట్‌ నాగచైతన్య హీరోగా వస్తున్న సినిమా ‘కస్టడీ’. వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. మే 12న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా విడుదల చేసిన టీజర్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

    ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి రిలీజ్ ట్రైలర్

    శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో నాగశౌర్య, మాళవిక నాయర్ ప్రధాన పాత్రల్లో రాబోతున్న సినిమా ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. రేపు విడుదల కాబోతున్న సందర్భంగా సినిమా రిలీజ్‌ ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన రాగా.. తాజా ట్రైలర్‌ కూడా ఆకట్టుకుంటోంది.

    రాష్ట్రంలో పలు గ్రామాలను కప్పేసిన మంచు

    [VIDEO](url): రాష్ట్రంలో పలుచోట్ల కురిసిన వడగండ్ల వానకు గ్రామాలు మంచులో కూరుకుపోయాయి. వికారాబాద్‌, సంగారెడ్డి, ములుగు జిల్లాల్లో రోడ్లు మంచుగడ్డలతో తెల్లగా మారాయి. గ్రామాల్లోని కాలనీలు కశ్మీర్‌ను తలపిస్తున్నాయి. pic.twitter.com/l5xwLbZVLu వికారాబాద్ జిల్లాలో వ‌డ‌గండ్ల వాన‌.. ఉక్క‌పోత నుంచి ఉప‌శ‌మ‌నం ? — Latha (@LathaReddy704) March 16, 2023

    ‘దసరా’ ట్రైలర్‌ వచ్చేసింది

    నాని, కీర్తి సురేశ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన దసరా ట్రైలర్‌ వచ్చేసింది. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమా దేశవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్‌ వస్తుండగా… తాజాగా మాస్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు.