ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ యుగం నడుస్తోంది. ప్రతీ ఒక్కరి జీవితంలో సెల్‌ఫోన్ భాగమైపోయింది. డిమాండ్‌కు అనుగుణంగా తయారీ కంపెనీలు ఎప్పటికప్పుడు అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేస్తున్నాయి. అయితే వీటిలో ఏ ఫోన్ కొనాలో తెలియక చాలా మంది సతమతమవుతుంటారు. అటువంటి వారి కోసమే YouSay బెస్ట్ 5G ఫోన్లను మీ ముందుకు తీసుకొచ్చింది. మీ బడ్జెట్ రూ.25,000 అయితే ఈ కింద సూచించిన ఫోన్లలో ఏదైనా ట్రై చేయొచ్చు. అమెజాన్‌లో ఈ ఫోన్‌లపై అద్భుతమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఇంతకీ ఆ స్మార్ట్‌ఫోన్స్ ఏవి? వాటి ప్రత్యేకతలు, ఫీచర్లు, ధర ఏంటో ఇప్పుడు చూద్దాం.
1. Samsung Galaxy M34 5G
శాంసంగ్‌లో రూ.25 వేల లోపు బెస్ట్ ఫోన్ కావాలనుకునే వారికి శాంసంగ్ గెలాక్సీ M34 స్మార్ట్‌ఫోన్ మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇది 8GB RAM/128GB ROMతో వస్తోంది. ఇది 120Hz అమోలెడ్ డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. దీనిపై అమెజాన్‌లో ఫ్లాట్ 19% తగ్గింపు ఉంది. దాంతో ఈ ఫోన్ ధర రూ. 20,999లకు అందుబాటులోకి వచ్చింది. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కొనుగోళ్లపై రూ. 2,000 తగ్గింపు కూడా ఉంది. ఫలితంగా ఈ ఫోన్‌ను రూ.18,999కే కొనుగోలు చేయవచ్చు. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్, No Cost EMI కూడా అందుబాటులో ఉంది.
2. Realme Narzo 60 Pro
రియల్‌మీ నార్జో 60 ప్రో ఫోన్ కూడా రూ.25,000 లోపు ఉన్న స్మార్ట్ ఫోన్లలో బెస్ట్ అని చెప్పొచ్చు. ఇది 8GB RAM, 128GB స్టోరేజ్‌తో వస్తుంది. అలాగే 120Hz సూపర్ అమోలెడ్ కర్వ్డ్ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్, 100MP OIS కెమెరా ఫీచర్లను కలిగి ఉంది. అమెజాన్‌లో ఈ ఫోన్ ధర రూ.26,999 ఉండగా 11% తగ్గింపు లభిస్తుంది. తద్వారా ఈ ఫోన్ రూ. 23,999కు అందుబాటులో ఉంది. ఏదైనా బ్యాంక్ కార్డు ద్వారా చెల్లింపు చేస్తే మరో రూ.1000 తగ్గుతుంది.
3. Redmi K50i 5Gi
చైనాకు చెందిన ప్రముఖ మెుబైల్ కంపెనీలలో రెడ్‌మీ ఒకటి. ఈ సంస్థ ఎప్పటికప్పుడు అత్యాధునిక స్మార్ట్ ఫోన్స్ రిలీజ్ చేస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటుంది. అయితే రూ.25 వేల లోపు స్మార్ట్ ఫోన్లు రెడ్‌మీలో ఎన్నో ఉన్నాయి. కానీ, వాటిలో Redmi K50i 5Gi కాస్త ప్రత్యేకమని చెప్పాలి. ఈ ఫోన్ 6GB RAM/128GB ROMతో వస్తోంది. క్విక్ సిల్వర్ కలర్, ఫ్లాగ్‌షిప్ మీడియాటెక్ డైమెన్సిటీ చిప్‌సెట్, 144Hz లిక్విడ్ FFS డిస్‌ప్లే ఇందులో ఉంది. ఈ ఫోన్ అమెజాన్‌లో 34% తగ్గింపుతో లభిస్తుంది. దీని ధర రూ. 20,999గా ఉంది. ICICI క్రెడిట్ కార్డుపై రూ.1500 వరకూ డిస్కౌంట్ పొందొచ్చు. ఎక్స్‌ఛేంజ్‌ఆఫర్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.
4. Oppo F23 5G
ఈ బడ్జెట్‌లో ఒప్పో ఎఫ్23 స్మార్ట్ ఫోన్ కూడా చక్కటి ఎంపిక అని చెప్పొచ్చు. ఈ ఫోన్ 5G ఫోన్ 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అలాగే 64MP ట్రిపుల్ AI కెమెరా, 6.72 ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌ను ఫోన్ కలిగి ఉంది. ఈ ఫోన్ అమెజాన్‌లో 14% తగ్గింపుతో లభిస్తుంది. అంటే రూ. 24,999 ధరతో మీ సొంతం అవుతుంది.
5. OnePlus Nord CE 3 Lite 5G
ప్రస్తుతం అత్యాధునిక ఫీచర్లను అందిస్తున్న ఫోన్లలో వన్ ప్లస్ ఒకటి. ఈ కంపెనీ నుంచి రూ.25 వేల లోపు ఫోన్ కావాలనుకునే వారు ‘వన్‌ప్లస్ నార్డ్ CE 3 లైట్’ ట్రై చేయోచ్చు. ఇది 1.5K రిజల్యూషన్‌తో 120Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 6.74 అంగుళాల పరిమాణంలో అమోలెడ్ ప్యానెల్‌ను ఈ ఫోన్‌కు అమర్చారు. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 9000 SoC ఉంది. ఈ ఫోన్ ధర రూ. 19,999గా ఉంది. Yes Bank క్రెడిట్ కార్డు ఉన్న వారు ఈ ఫోన్ కొనుగోలుపై రూ.1500 వరకూ డిస్కౌంట్ పొందవచ్చు.
Celebrities Featured Articles Telugu Movies
Chiranjeevi: ‘టాలెంట్ ఒక్కటే సరిపోదు.. ప్రవర్తన ముఖ్యం’.. బన్నీకి చిరు ఇండైరెక్ట్ పంచ్!