మార్కెట్‌లో విరివిగా లభించే డెస్క్‌టాప్ మానిటర్‌లలో అవసరానికి తగిన మానిటర్‌ను ఎంచుకోవడం తలకు మించిన భారమే అని చెప్పాలి. ఎందుకంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు ఓ రకమైన మానిటర్, ఎడిటింగ్, గేమింగ్, స్టూడెంట్ పర్పస్‌లు వేరుగా ఉంటాయి. గేమింగ్ మానిటర్ కావాలంటే దానికి కావాల్సిన ఫీచర్లు వేరుగా ఉంటాయి. కాబట్టి అలాంటి బాదరబందీ లేకుండా ఇక్కడ అమెజాన్‌లో టాప్ రేటింగ్ పొందిన కొన్ని డెస్క్‌టాప్ మానిటర్‌లను ప్రత్యేకంగా ఇస్తున్నాం.. వాటిపై ఓ లుక్‌వేయండి.
Dell-D2020H
తక్కువ ధరలో మంచి డెస్క్‌టాప్ మానిటర్ కావాలనుకునే వారికి ఇది మంచి ఛాయిస్. 49.53 Cm పొడవున్న ఈ మానిటర్ HD+1600 X 900 రిజల్యూషన్ వరకు సపోర్ట్ చేస్తుంది. 2 HDMI పోర్ట్‌లు రెండు VGA పోర్ట్స్ రానున్నాయి. డెల్ కంపెనీ నుంచి 3 సంవత్సరాల వారెంటీ లభిస్తోంది. దీని ధర ₹6,099
Dell D1918H
ఇది 18.5 అంగుళాల పొడవుతో LCD మానిటర్‌ను కలిగి ఉంటుంది. ఫ్లిక్కర్ ఫ్రీ ఫీచర్‌తో రానుది. ఒక HDMI, ఒక VGA పోర్ట్‌ను కలిగి ఉంటుంది. 60హెడ్డ్ రీప్రేష్ రేటుతో వస్తుంది. ఈ మానిటర్‌కు కూడా 3 ఏళ్ల వారెంటీ కంపెనీ అందిస్తోంది. దీని ధర రూ.6,699
Dell E2223HN 21.5
21 అంగుళాల పొడవున్న ఈ మానిటర్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేతో వస్తుంది. ఒక HDMI, ఒక VGA పోర్ట్‌ను కలిగి ఉంటుంది. 60హెడ్డ్ రీప్రేష్ రేటుతో వస్తుంది. 16:9 స్క్రీన్ అస్పెక్ట్ రెషియోను కలిగి ఉంది. దీని అసలు ధర రూ. 12,999 కాగా.. అమెజాన్‌లో రూ.7500 వద్ద లభిస్తోంది.
Dell-SE2222H
ఈ డెల్ మానిటర్ 1920 X 1080 రిజల్యూషన్‌తో ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీని స్క్రీన్ యాంటీ గ్లేర్ సపోర్ట్ చేస్తుంది. మూడేళ్ల వారెంటీతో వస్తుంది. దీని ధర రూ. 8,090.
HP V190 HD Monitor
ఐదు వేల రూపాయలలో మంచి కంపెనీ మానిటర్ కోసం మీరు వెతికినట్లైతే ఈ మానిటర్ బెస్ట్ ఛాయిస్. ఇది 18.5 అంగుళాల FHD డిస్‌ప్లేతో వస్తుంది. 5 మిల్లీ సెకన్ రెస్పాన్స్‌టైమ్‌ను కలిగి ఫాస్ట్‌గా పనిచేస్తుంది. దీని ధర రూ.5299.
HP V19e HD Monitor
ఎక్కువసేపు కంప్యూటర్ వర్క్ చేసేవారికి ఈ హెచ్‌పీ మానిటర్ సరిగ్గా సరిపోతుంది. ఇది యాంటీ గ్లేర్ స్క్రీన్‌తో బ్లూలైట్ ప్రొటెక్షన్ కలిగి ఉంటుంది. 18.5 అంగుళాల పొడవుతో ఉన్న ఈ మానిటర్ ఫుల్ హెడీ డిస్‌ప్లేతో రానుంది. దీని అసలు ధర రూ.9,800 కాగా 35 శాతం డిస్కౌంట్‌తో రూ.6,399 వద్ద లభిస్తోంది.
HP V22v 21.5
ఇది 178 డిగ్రీస్ వ్యూయింగ్ యాంగిల్ స్పేషల్ ఫీచర్‌తో వచ్చింది. మానిటర్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేతో 60 హెడ్జ్ రీఫ్రెష్ రేటును కలిగి ఉంది. దీని అసలు ధర రూ.12,500 కాగా 37శాతం డిస్కౌంట్‌తో అమెజాన్‌లో రూ.7850 వద్ద కొనుగోలు చేసుకోవచ్చు.
HP M22f 21.5
అమెజాన్‌లో ఈ మానిటర్ టాప్ రేటింగ్‌ను కలిగి ఉంది. దీని వాస్తవ ధర రూ.13020 కాగా ప్రస్తుతం రూ. 9,999కే లభిస్తోంది. ఈ HP మానిటర్ ‘ఐ’ సెఫ్ సర్టిఫికెట్‌ను కలిగి ఉంది. యాంటీ గ్లేర్ స్క్రీన్ సపోర్ట్‌ను కలిగి ఉంది. టిల్ట్ అడ్జస్టబుల్ స్కీన్ వంటి ఫీచర్ దీని ప్రత్యేకత
HP V24v G5 FHD Monitor
ఈ హెచ్‌పీ మానిటర్ 23.8 అంగుళాల పొడవు కలిగి ఉండి FHD రిజల్యూషన్ సపోర్ట్ చేస్తుంది. కంటికి హాని చేసే బ్లూలైట్‌ను ఇది ఫిల్టర్ చేస్తుంది. 75Hz రిప్రేష్ రేట్, 1xVGA, 1xHDMI పోర్ట్స్‌ను కలిగి ఉంటుంది. దీని ధర రూ.10,499.
Samsung 22-inch FHD Flat Monitor
అమెజాన్‌లో ఈ శాంసంగ్ మానిటర్‌కు బెస్ట్ రేటింగ్ ఉంది. ఇది బెజిల్ లెస్ డీజైన్‌తో వచ్చింది. ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేతో ఫ్లిక్కర్ ఫ్రీ ఫీచర్ కలిగి ఉంది. దీని ధర రూ.7,199
Samsung 59.79 cm
బాక్‌లిట్ ఎల్‌ఈడీ స్క్రీన్‌తో ఈ మానిటర్ వచ్చింది. అంతేకాదు మానిటర్‌లో స్పెషల్‌గా స్పీకర్స్ బిల్ట్ అయి ఉన్నాయి. దీనిని EMI ద్వారా నెలకు రూ.385 చెల్లించి సొంతం చేసుకోవచ్చు. దీని ధర రూ.7,945.
Samsung 24-inch
ఈ మానిటర్ కర్వ్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. 24 అంగుళాల పొడవుతో FHD రిజల్యూషన్ సపోర్ట్ చేస్తుంది. ఈ శాంసంగ్ మానిటర్‌కు అమెజాన్‌లో బెస్ట్ రేటింగ్ అయితే ఉంది. దీనిని ₹7,999 వద్ద కొనుగోలు చేయవచ్చు.
Samsung 24inch
ఇది 178 డిగ్రీ వ్యూయింగ్ యాంగిల్ కలిగి ఉంది. 1 HDMI, 1 VGA పోర్ట్‌ను అయితే ఉంది. ఫుల్ హెచ్‌డీ రిజల్యూషన్‌ను సపోర్ట్ చేసే LED మానిటర్ ఇది. దీని ధర రూ. 13,000.
ASUS VS207DF 19.5-inch LCD Monitor
తక్కువ ధరలో ASUS బ్రాండ్ నుంచి లభిస్తున్న LCD మానిటర్ ఇది. 19 అంగుళాల పొడవుతో ఉన్న డిస్‌ప్లే 16:9 స్క్రీన్ అస్పెక్ట్ రేషియోను కలిగి ఉంటుంది. దీని ధర రూ.8,998.
ASUS 23.8
ఈ మానిటర్ స్లిమ్ డిజైన్‌తో వచ్చింది. ఫుల్ హెచ్‌జీ ఐపీఎస్ ప్యానెల్‌ను కలిగి ఉన్న డిస్‌ప్లే 75 హెడ్జ్ రీఫ్రెష్ రేటును అయితే కలిగి ఉంది. అంతేకాదు. ‘ఐ’ కేరింగ్ ఫీచర్‌ను మానిటర్ కలిగి ఉంది. దీని వాస్తవ ధర రూ. 22,999 కాగా.. 57శాతం డిస్కౌంట్‌తో రూ.9,999 వద్ద కొనుగోలు చేసుకోవచ్చు.
ASUS TUF Gaming 23.8 inch
గేమింగ్ కోసం మంచి మానిటర్ కోసం వెతికే వాళ్లకు ఈ మానిటర్ బెస్ట్ ఛాయిస్‌గా చెప్పవచ్చు. Full HD డిస్‌ప్లే 165Hz రిఫ్రెష్ రేటును కలిగి ఉంటుంది. లో మోషన్ బ్లర్, సిస్టమిక్ ఐ కేర్ వంటి ఫీచర్లను ASUS TUF మానిటర్ కలిగి ఉంది. ఇక దీని వాస్త ఖరీదు రూ.25,999 కాగా ప్రస్తుతం అమెజాన్‌లో ₹13,999 వద్ద లభిస్తోంది.
ASUS ProArt Display
అమెజాన్‌లో ASUS ProArt మానిటర్ బెస్ట్ రేటింగ్ కలిగి ఉంది. ఈ మానిటర్ ఎడిటింగ్ చేసే వారికి బెస్ట్ ఛాయిస్‌గా చెప్పవచ్చు. దీని డిస్‌ప్లే 23.8 అంగుళాల పొడవు కలిగి ఉండి.. పుల్ హెచ్‌డీ రిజల్యూషన్ అందిస్తుంది. అల్ట్రా వైడ్ వ్యూయింగ్‌ను మానిటర్ సపోర్ట్ చేస్తుంది. ఇయర్ ఫోన్ జాక్, 2HDMI పోర్ట్స్, USB-C, డిస్‌ప్లే పోర్ట్ వంటి ఎక్సట్రనల్ పోర్ట్స్ కలిగి ఉంది. దీని డిస్‌ప్లే 75హెడ్జ్ రీఫ్రెష్ రేటును కలిగి ఉంటుంది. దీని అసలు ధర రూ.34,999 కాగా అమెజాన్‌లో ప్రస్తుతం ₹19,990 వద్ద లభిస్తోంది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!