పెద్ద పెద్ద సీపీయూలు లేకుండా ల్యాప్ టాప్స్ మాదిరి ఇన్‌బిల్ట్ సీపీయూ కలిగిన ఆల్ ఇన్ వన్ డెస్క్‌టాప్స్ కావాలనుకునే వారికి ఈ ఆర్టికల్ ఉద్దేశించింది. మార్కెట్లో ఎన్నో ఆల్ ఇన్ డెస్క్‌టాప్‌లు అందుబాటులో ఉన్నాయి. కానీ అవి వేటికి యూజ్ అవుతాయో మాత్రం చాలా మందికి తెలియదు. ఈక్రమంలో స్టూడెంట్స్, ఆఫీస్ పర్పస్, హోమ్ పర్పస్ కెటగిరీలకు ఏ డెస్క్‌టాప్ మంచిదో ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాటిపై ఓ లుక్ వేయండి మరి.
ASUS Vivo AiO V222
హోమ్ పర్పస్‌లో స్టైలిష్ డెస్ట్‌టాప్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్. ఈ సిస్టం విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ కానుంది. 256జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటి కలిగి ఉంది. సీపీయూ ఇంటెల్ పెంటియమ్ చిప్‌తో రన్ అవుతుంది. ఇక డిస్ప్లే ఫుల్హెచ్డీ డిస్ప్లే లభిస్తుంది. LED బ్యాక్లిట్ సపోర్ట్ చేస్తుంది. దీని ధర రూ.31,990.
HP All-in-One PC Intel Pentium
అమెజాన్‌లో ఇది టాప్ రేటింగ్ కలిగి ఉంది. త్రీ స్లైడెడ్ మైక్రో ఎడ్జ్ డిస్ప్లే.. 1080 రెజల్యూష్ అదిస్తుంది. 8జీబీ ర్యామ్, 512జీబీ SSD ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది. ఇది ఇంటెల్ పెంటియమ్ కోర్ ప్రాసెసర్ చిప్ సెట్‌పై రన్ అవుతుంది. దీనిలో MS ఆఫీస్ 2019 స్టూడెంట్ అడిషన్ ఫ్రీ అయితే వస్తుంది. విండోస్ 11 ఇన్‌బిల్ట్‌గా లభిస్తుంది. ఎడిటింగ్ కోసం ఇంటెల్ ఇంటిగ్రెటెడ్ UHD 605 గ్రాఫిక్ కార్డు కలిగి ఉంది. దీని ధర ₹31,490
HP All-in-One AMD Ryzen 3
ఫీచర్ల పరంగా పైన తెలిపిన డెస్క్‌టాప్ మాదిరిగానే ఇది ఉంటుంది. అయితే ఇందులో ఇంటెల్ ప్రాసెసర్‌కు బదులు రైజెన్ 3 చిప్‌సెట్‌ను అమర్చారు. ఇది 8జీబీ ర్యామ్, 256జీబీ SSD NVMe హార్డ్ డ్రైవ్‌తో పాటు 1 TB HDD హార్డ్ డ్రైవ్‌ను కలిగి ఉంటుంది. డిస్ప్లే FHD (1920*1080) రిజల్యూషన్‌తో వచ్చింది. గ్రాఫిక్ కార్డు వచ్చేసి AMD రెడియాన్ గ్రాఫిక్స్ చిప్ సెటప్ ఉంది. ఇది ఫోటో ఎడిటింగ్, గేమింగ్‌ను స్మూత్‌గా హ్యాండిల్ చేస్తుంది. దీని ధర రూ.₹42,490
Lenovo IdeaCentre AIO 3
లెనోవో నుంచి వచ్చిన లెటెస్ట్ డెస్క్‌టాప్ ఎడిషన్ ఇది. 12 జనరేషన్ ఇంటెల్ i3 ప్రాసెసర్‌తో రన్ కానుంది. విండోస్ లెటెస్ట్ వెర్షన్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. 8జీబీ ర్యామ్ ఇన్‌బిల్ట్‌గా రాగా.. దానిని 16జీబీ వరకు పెంచుకునేందుకు వీలు కల్పించారు. 512జీబీ SSD, ఇంటిగ్రేటెడ్ UHD గ్రాఫిక్స్‌ను అయితే కలిగి ఉంది. ఫుల్ హెచ్డీ IPS ప్యానెల్ డిస్ప్లేతో వచ్చింది. దీని ధర రూ.45,989.
HP All-in-One PC
ఇది లెటెస్ట్ ఇంటెల్ i3- 12 జనరేషన్ ప్రాసెసర్‌పై రన్ కానుంది. యాంటీ గ్లేర్ డిస్ప్లే, 8జీబీ ర్యామ్, 512జీబీ SSD, విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్, UHD గ్రాఫిక్ కార్డ్ దీని ప్రత్యేకతలు. దీని అసలు ధర రూ.59,387 కాగా… ప్రస్తుతం అమెజాన్‌లో రూ. 47,990 వద్ద కొనుగోలు చేయవచ్చు.
Dell All in One Inspiron 5410
హోమ్ పర్పస్, స్టూడెంట్స్‌కు ఇది బెస్ట్ ఆల్ ఇన్ వన్ డెస్క్‌టాప్‌గా చెప్పవచ్చు. ఇంటెల్ లెటెస్ట్ i3 12Th జనరేషన్ ప్రాసెసర్, విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్, 24 అంగుళాల ఫుల్హెచ్డీ డిస్ప్లే, 16జీబీ ర్యామ్, 256జీబీ SSD స్టోరేజ్ కెపాసిటీ, ఇంటిగ్రెటేడ్ గ్రాఫిక్ కార్డ్ సెటప్‌తో రానుంది. దీని ధర ₹49,990.
Lenovo IdeaCentre AIO 3
లెనోవో ఐడియా సెంటర్ ఆల్ ఇన్ వన్ డెస్క్‌టాప్… ఇంటెల్ i5 ప్రాసెసర్ 11 జనరెషన్ చిప్ సెట్‌తో తయారైంది. వర్క్ ఫ్రమ్ హోం చేసే ఉద్యోగులకు ఇది మంచి ఛాయిస్. 8జీబీ ర్యామ్, 1TB HDD హార్డ్ డ్రైవ్, ఇంటిగ్రెటేడ్ Iris Xe Graphics, ఫుడ్ హెచ్డీ డిస్ప్లేను కలిగి ఉంది. దీని అసలు ధర రూ. 69 వేలు కాగా.. అమెజాన్‌లో రూ. 50,490 వద్ద లభిస్తోంది.
HP All-in-One
ఇది ఇంటెల్ కోర్ ప్రాసెసర్ i3 12Th జనరేషన్ చిప్సెట్తో వచ్చింది. 8GB RAM/256GB SSD, ఫుల్ హెచ్డీ మైక్రో ఎడ్జ్ యాంటీ గ్లేర్ డిస్ప్లే దీని ప్రత్యేకత. ఇంటెల్ UHD గ్రాఫిక్ కార్డును కలిగి ఉంది. నార్మల్ బిజినెస్ టాస్క్, ఆఫీస్, హోమ్ వర్క్‌కు ఇది సరిపోతుంది. దీని ధర రూ. 53,990.
Lenovo IdeaCentre AIO 3
లెనోవో ఐడియా సెంటర్ ఆల్ ఇన్ వన్ డెస్క్‌టాప్‌కు అమెజాన్‌లో బెస్ట్ రేటింగ్ ఉంది. ఇది 12th జనరేషన్ i5 ప్రాసెసర్ చిప్సెట్ కలిగి ఉంది. 23.8 సెంటీ మీటర్ల FHD డిస్ప్లే 3-Side ఎడ్జ్ గ్లాస్‌ను కలిగి ఉంటుంది. 8GB RAM/512GB SSD స్టోరేజ్ కెపాసిటితో విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. దీని ధర రూ. 57,989.
Dell 24″ All-in-One PC
ఇది లెటెస్ట్ Intel i3 ప్రాసెసర్‌తో వచ్చింది. 8GB RAM, 512GB SSD స్టోరేజ్ కెపాసిటీ, 23.8 అంగుళాల FHD డిస్ప్లేతో తయారైంది. ఇందులో ఇన్‌బిల్ట్‌గా విండోస్ 11 ఓఎస్‌ను కలిగి ఉంది. విండోస్ 11 ఆఫీస్ 2021 ఎడిషన్‌ను ఫ్రీగా పొందవచ్చు. దీని అసలు ధర రూ.71 వేలు కాగా.. అమెజాన్‌లో రూ. 62,799 వద్ద లభిస్తోంది.
Lenovo IdeaCentre AIO
ఈ ఆల్ ఇన్ వన్ డెస్ట్‌టాప్ పవర్ఫుల్ AMD రైజెన్ 7 చిప్సెట్తో తయారైంది. ప్రీలోడెడ్ విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్, 8జీబీ ర్యామ్, 512జీబీ SSD హార్డ్ డ్రైవ్, ఇంటిగ్రేటెడ్ AMD రెడియాన్ గ్రాఫిక్ చిప్ వంటి ఫీచర్లు కలవు. దీని 23.8 అంగుళాల డిస్ప్లే 1920*1080 స్క్రీన్ రిజల్యూషన్ కలిగి ఉంటుంది. దీని ధర రూ.65,990.
Lenovo IdeaCentre A340
ఇది 23.8 అంగుళాలు పొడవున్న డిస్ప్లేతో 1920*1080 స్క్రీన్ రిజల్యూషన్ కలిగి ఉంటుంది. ఈ డెస్క్‌టాప్ ఇంటెల్ i5 ప్రాసెసర్ చిప్ సెట్ కలిగి ఉండి 8జీబీ ర్యామ్, 512జీబీ SSD హార్డ్ డ్రైవ్ స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది. ఇన్‌బిల్ట్ విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టం, MS Office 2021 ఎడిషన్ ఫ్రీగా లభించును. దీని అసలు ధర రూ.84,790 కాగా.. అమెజాన్‌లో రూ.65,900 వద్ద లభిస్తోంది.
Lenovo IdeaCentre AIO 3 Intel i5
ఇది హోమ్ పర్పస్, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి బెస్ట్ ఛాయిస్. ఈ ఆల్ ఇన్ వన్ డెస్క్ టాప్‌లో 12th జనరేషన్ ఇంటెల్ i5 ప్రాసెసర్, ప్రీలోడెడ్ విండోస్ 11 హోం, 16జీ ర్యామ్, 1TB SSD స్టోరేజ్ కెపాసిటి దీని ప్రత్యేకతలు. ఇంటెల్ UHD గ్రాఫిక్స్ కలిగి ఉంటుంది. ఇక దీని ధర రూ. 65,766
Dell AIO Inspiron 5410
ఇది ఇటీవల లాంచ్ అయింది. ఈ ఆల్ ఇన్వన్ డెస్క్‌టాప్ ఇంటెల్ i5-1235U ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, 512జీబీ SSD స్టోరేజ్ కెపాసిటితో వచ్చింది. ఇన్‌బిల్ట్ విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. దీని 23.8 అంగుళాల పొడవున్న డిస్ప్లే 1920*1080 స్క్రీన్ రిజల్యూషన్ కలిగి ఉంటుంది. దీని అసలు ధర రూ.89,000 కాగా అమెజాన్‌లో రూ.78,000 వద్ద లభిస్తోంది.
Celebrities Featured Articles Telugu Movies
HBD Thaman: థమన్ గురించి ఈ విషయాలు తెలిస్తే అస్సలు ట్రోల్ చేయరు..!