ఫోన్‌లో అప్పుడప్పుడు సాంగ్స్ వింటుంటాం. కాల్ మాట్లాడటానికి కూడా ఇయర్ ఫోన్స్ బాగా వాడతాం. ఫోన్ స్పీకర్ సరిగా లేకపోతే బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ కోసం ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటాం. బ్లూ టూత్ హెడ్‌సెట్‌ని కొద్ది సేపు మాత్రమే వాడగలం. కానీ, ఈ ఇయర్ ఫోన్స్‌ని నిరంతరాయంగా ఉపయోగించే వీలుంటుంది. దీంతో మళ్ళీ వీటికి ప్రాధాన్యత పెరిగింది. ఈ క్రమంలో అందుబాటు ధరలోనే బెస్ట్ ఇయర్ ఫోన్స్‌ని కొనడానికి చాలా మంది ట్రై చేస్తున్నారు. మరి, రూ.500 లోపు ఉన్న బెస్ట్ ఇయర్ ఫోన్స్ ఏంటో చూసేద్దామా.
boAt BassHeads 100
బోట్ కంపెనీ తయారు చేసే ఇయర్ ఫోన్స్ ప్రత్యేక ఆదరణను కలిగి ఉంటాయి. boAt BassHeads 100 ఇందులో ఒకటి. ఈ ఇయర్ ఫోన్స్ ధర రూ.399 మాత్రమే. దీని వాస్తవ ధర రూ.999 కాగా, అమెజాన్‌లో 60 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. బ్లాక్, వైట్, మింట్ గ్రీన్, ఫియరీ రెడ్, ఎంఐ బ్లూ, సీఎస్‌కే బ్లాక్, ఆర్సీబీ రేజింగ్ రెడ్, తదితర రంగుల్లో ఈ ఇయర్ ఫోన్స్ అందుబాటులో ఉన్నాయి. అమెజాన్‌లో ఇది బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది.
Mi Earphones Basic
అల్ట్రా డీప్ బేస్‌తో షియామీ ఇయర్‌ఫోన్స్‌ని అందిస్తోంది. మైక్‌తో పాటు మెటల్ సౌండ్ చాంబర్‌ని ఇది కలిగి ఉంది. బ్లాక్, బ్లూ, రెడ్ రంగుల్లో అందుబాటులోకి వస్తోంది. ఈ ఇయర్ ఫోన్స్‌పై అమెజాన్‌లో 50 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీని వాస్తవ ధర రూ. 999 కాగా, రూ.499కే దక్కుతోంది. 1.25 మీటర్ల పొడవైన కేబుల్ వస్తోంది.
realme Buds 2 Neo
రియల్ మీ బడ్స్ 2 నియో మ్యూజిక్ లవర్స్‌కి మంచి ఎక్స్‌పీరియన్స్ అందిస్తున్నాయి. హై డెఫినేషన్ మైక్రోఫోన్ దీని సొంతం. చెమటకు మరకలు కాకుండా ఉండటానికి టీపీయూ మెటీరియల్ దోహద పడుతుంది. 1.3 మీటర్ల పొడవు ఉంటుంది. వినడానికి సౌకర్య వంతంగా ఉంటాయి. బ్లాక్, బ్లూ, ఆరెంజ్, గ్రీన్ రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. 17 శాతం డిస్కౌంట్‌పై అమెజాన్‌లో రూ.499కే లభిస్తోంది.
BS POWER
బీఎస్ పవర్ ఇయర్ ఫోన్స్ సగం ధరకే అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. అమెజాన్‌లో ఈ ఇయర్ ఫోన్స్‌ని రూ.500కే కొనుగోలు చేసుకోవచ్చు. దీని వైర్లు మన్నికగా ఉంటాయి. అన్ని రకాల ఆండ్రాయిడ్ డివైజ్‌లకు ఈ ఇయర్ ఫోన్స్ సపోర్ట్ చేస్తాయి. నేచురల్ సౌండ్ క్వాలిటీ, గ్రేటర్ కంపాటిబిలిటీ దీని సొంతం. వివిధ రంగుల్లో అందుబాటులో ఉన్నాయి.
JBL C50HI
జేబీఎల్ బ్రాండ్‌కి ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు. ఈ కంపెనీ అందించే ఇయర్ ఫోన్స్ అంత బాగుంటాయి మరి. జేబీఎల్ సీ50హెచ్ఐ ఇయర్‌ఫోన్స్ సిగ్నేచర్ సౌండ్‌తో పాటు స్పష్టమైన బేస్‌ని అందిస్తాయి. ఈ ఇయర్ ఫోన్ మైక్రోఫోన్‌కి నాయిస్ ఐసోలేషన్ ఫీచర్ ఉంది. అంటే, ఫోన్ మాట్లాడే సమయంలో ఇతర శబ్దాలు వినిపించవన్నమాట. రెడ్, బ్లూ, బ్లాక్ కలర్స్‌లో అందుబాటులో ఉంది. దీని వాస్తవ ధర రూ.669 కాగా 26 శాతం డిస్కౌంట్‌తో రూ.498కే అమెజాన్‌లో లభిస్తోంది.
boAt Bassheads 102
బోట్ కంపెనీ అందిస్తున్న మరో ఆకర్షణీయమైన ఇయర్ ఫోన్స్ ఇవే. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టంకి పనిచేస్తుంది. చార్కోల్ బ్లాక్, ఫియరీ రెడ్, మింట్ గ్రీన్, మింట్ పర్పుల్, మింట్ ఆరెంజ్, జాజీ బ్లూ రంగుల్లో ఇది అందుబాటులో ఉంది. కలర్‌ని బట్టి రేటు ఉంది. ఏ కలర్ అయినా గరిష్ఠ ధర రూ.499. చార్కోల్ బ్లాక్ వేరియంట్ ధర రూ.429గా ఉంది. దీని వాస్తవ ధర రూ.1290 కాగా 67 శాతం డిస్కౌంట్ లభిస్తోంది.
boAt Bassheads 162
ఆకర్షణీయమైన డిజైన్‌తో ఈ ఇయర్ ఫోన్స్ కస్టమర్లను అట్రాక్ట్ చేస్తోంది. మిగతా బోట్ ఇయర్‌ఫోన్స్‌తో పోలిస్తే ఇది కాస్త భిన్నంగా ఉంటుంది. రెడ్, బ్లూ, బ్లాక్ రంగుల్లో ఇది అందుబాటులో ఉంది. దీని వాస్తవ ధర రూ.1,298 కాగా అమెజాన్‌లో 67 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. రూ.449కే లభిస్తోంది.