పుస్తకాలు చదవడం అనేది మనలోని ఆలోచనలకు, మనోధైర్యానికి, విజ్ఞానానికి బలం చేకూరుస్తుంది. ముఖ్యంగా, ఇంగ్లిష్ నవలలు చదవడం వలన కొత్త భాషను నేర్చుకోవడంలో మనం మరింత నైపుణ్యంగా మారవచ్చు. ఇంగ్లిష్ భాషలో పుస్తకాలను ప్రారంభించే వారు తమ పాఠనానికి సరళమైన, అందరికీ అర్థమయ్యే భాషలో, అద్భుతమైన కథలతో కూడిన పుస్తకాలను ఎంపిక చేసుకుంటే మరింత ఆసక్తి కలుగుతుంది. అందుకే ఇక్కడ 20 అత్యుత్తమ ఇంగ్లిష్ నవలలను గురించి వివరిస్తున్నాం, ఇవన్నీ అమెజాన్‌లో లభ్యమవుతాయి. దీనికంటే ముందు పుస్తక పఠనం వల్ల కలిగే లాభాలు తెలుసుకొని వీటిని చదివేందుకు ప్రయత్నించండి.
Contents
- 1 పుస్తక పఠనం వల్ల కలిగే లాభాలు
- 2 1. To Kill a Mockingbird – Harper Lee
- 3 2. The Old Man and the Sea – Ernest Hemingway
- 4 3. Animal Farm – George Orwell
- 5 4. The Catcher in the Rye – J.D. Salinger
- 6 5. Pride and Prejudice – Jane Austen
- 7 6. The Great Gatsby – F. Scott Fitzgerald
- 8 7. The Giver – Lois Lowry
- 9 8. Charlotte’s Web – E.B. White
- 10 9. Harry Potter and the Sorcerer’s Stone – J.K. Rowling
- 11 10. Lord of the Flies – William Golding
- 12 11. The Alchemist – Paulo Coelho
- 13 12. Tuesdays with Morrie – Mitch Albom
- 14 13. The Fault in Our Stars – John Green
- 15 14. Wonder – R.J. Palacio
- 16 15. The Outsiders – S.E. Hinton
- 17 16. Percy Jackson and the Olympians: The Lightning Thief – Rick Riordan
- 18 17. Fahrenheit 451 – Ray Bradbury
- 19 18. The Hobbit – J.R.R. Tolkien
- 20 19. The Secret Garden – Frances Hodgson Burnett
- 21 20. Of Mice and Men – John Steinbeck
పుస్తక పఠనం వల్ల కలిగే లాభాలు
- భాషా పరిజ్ఞానం: ఇంగ్లిష్ నవలలను చదవడం వలన కొత్త పదాలను, వాటి ఉపయోగాన్ని నేర్చుకోవచ్చు.
- ఆలోచనా సామర్థ్యం: పుస్తకాల ద్వారా కొత్త ఆలోచనలు, సరికొత్త దృష్టి కోణాలను తెలుసుకోవచ్చు.
- సృజనాత్మకత: కథలు, పాత్రలు పట్ల అనుభూతి కలిగేలా, సృజనాత్మకత పెరుగుతుంది.
- స్వతంత్ర భావం: కథలోని వివిధ సంఘటనలపట్ల మన అభిప్రాయాలు, తార్కిక విశ్లేషణ సామర్థ్యం పెరుగుతుంది.
- మానసిక ప్రశాంతత: కథలు మనలో ప్రశాంతతను కలిగిస్తాయి, మనస్సుకు తక్షణ విశ్రాంతి అందిస్తాయి.
1. To Kill a Mockingbird – Harper Lee
ఈ పుస్తకం న్యాయవ్యవస్థ, సమానత్వం, మానవతా విలువలపై మనలో చైతన్యం తీసుకువస్తుంది. ధనవంతులైన తెల్లజాతీయులు, నల్ల జాతీయుల పట్ల చూపే వివక్షను ఈ నవల ద్వారా మన కళ్లముందు ఆవిష్కరించారు రచయిత. చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందని అంటున్నా న్యాయం ఎంత పాక్షికంగా ఉటుందో హృద్యంగా చిత్రించారు.
2. The Old Man and the Sea – Ernest Hemingway
ఇది చిన్నదైన నవల అయినా సాహసోపేతమైన కథనం. ఒక వృద్ధుడి సముద్రయాత్రను ఇతివృత్తంగా తీసుకుని, మనోధైర్యం, కష్టసాధన వంటి అంశాలను పాఠకులకు చేరవేస్తుంది.
3. Animal Farm – George Orwell
సరళమైన భాషతో రాసిన ఈ పుస్తకం రాజకీయ పదాలను సున్నితంగా వ్యంగ్యంగా ఆవిష్కరిస్తుంది. ఈ నవలలో రెండవ ప్రపంచ యుద్ధం స్టాలిన్ పాలనాకాలంలో సోవియట్ యూనియన్ చరిత్రలోని కొన్ని రాజకీయ పరిస్థితులను వ్యంగ్యంగా చెప్పడం జరిగింది. ఇది స్టాలిన్ విధానాలకు వ్యతిరేకంగా వచ్చిన నవల. రాక్షసత్వాన్ని వ్యతిరేకించే ఈ కథ అందరికీ అర్థమయ్యేలా ఉంటుంది.
4. The Catcher in the Rye – J.D. Salinger
యుక్తవయస్సులోని యువత భావాలను ప్రతిబింబించే ఈ కథ మనలో ఆత్మవిశ్లేషణకు దారి తీస్తుంది. పాఠకులకు సులభంగా అర్థమయ్యే భాషలో ఉంటుంది. ఇది కచ్చితంగా మీలో స్ఫూర్తిని నింపుతుంది.
5. Pride and Prejudice – Jane Austen
ప్రేమ, అహంకారానికి సంబంధించిన ఈ క్లాసిక్ నవల, అర్థం చేసుకోవడానికి సులభమైన పుస్తకం. ఈ నవలలోని పదాల సౌందర్యం, కథనం మిమ్మల్ని ఆకర్షిస్తుంది.
6. The Great Gatsby – F. Scott Fitzgerald
అమెరికా డ్రీమ్ గురించి అద్భుతంగా వివరించే కథ ఇది. నైపుణ్యం పెంపొందించుకోవాలనుకునే ప్రతి పాఠకుడికి సులభంగా అర్థమవుతుంది.
7. The Giver – Lois Lowry
ఈ నవల ద్వారా మనుషుల్లో భావనలు, భావోద్వేగాలు, భావప్రకటనలను అర్థం చేసుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకోవచ్చు. ఇది సులభమైన భాషలో ఉంటుంది.
8. Charlotte’s Web – E.B. White
చిన్నారుల పుస్తకం అయినా ఈ నవలలోని కథ చాలా ప్రేరణాత్మకంగా ఉంటుంది. స్నేహం, కృతజ్ఞతలను ప్రోత్సహించే కథ ఇది.
9. Harry Potter and the Sorcerer’s Stone – J.K. Rowling
ఇంగ్లిష్‌లో తొలిసారి నవలలు చదవాలనుకునే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. సాహసం, స్నేహం, విలువల ఆధారంగా ఇందులోని కథ ముందుకు సాగుతుంది. ఇ పుస్తకం చదవడం చాలా సులభం.
10. Lord of the Flies – William Golding
యువత స్వభావం మరియు సమాజం పట్ల వారి అవగాహనను ప్రతిబింబించే కథ ఇది. మొదటి సారి చదువుతున్న వారికి సులభంగా అర్థమవుతుంది.
11. The Alchemist – Paulo Coelho
ప్రతి ఒక్కరి జీవిత ప్రయాణం దాని లక్ష్యం గురించి మాట్లాడే కథ ఇది. ఈ నవల అందరికీ సులభంగా అర్థమవుతుంది.
12. Tuesdays with Morrie – Mitch Albom
ఒక మాస్టర్-స్టూడెంట్ సంబంధం గురించి చెప్పే ఈ పుస్తకం, జీవన విలువలు, ప్రేమ, మరణం వంటి అంశాలపై పాఠకులకు మార్గదర్శకం ఇస్తుంది.
13. The Fault in Our Stars – John Green
ప్రేమ, ఆశ, మరియు జీవితం పట్ల అవగాహనకు ఈ పుస్తకం సులభమైన భాషలో రాయబడింది. యుక్తవయస్సులోని పాఠకులకు ఇది బాగా నచ్చుతుంది.
14. Wonder – R.J. Palacio
ట్రేచర్ కాలిన్స్ సిండ్రోమ్‌తో బాధపడే ఓ విద్యార్థి జీవితం గురించి ఈ నవలలో ఉంటుంది. అతని జీవితం ఎలా సాగింది అనే అంశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి.ఇది అందరికి సులభంగా అర్థమవుతుంది.
15. The Outsiders – S.E. Hinton
యుక్తవయస్సులోని యువతకు ఉద్దేశించిన ఈ కథ, స్నేహం, కుటుంబం వంటి భావనలను చక్కగా చూపిస్తుంది.
16. Percy Jackson and the Olympians: The Lightning Thief – Rick Riordan
పాఠకులకు సాహసోపేతమైన కథలను అర్థం చేసుకునే అవకాశం ఇస్తుంది. గ్రీస్ పురాణాల కేంద్రంగా ఇందులోని కథలు కొనసాగుతాయి.
17. Fahrenheit 451 – Ray Bradbury
సంస్కరణా భావాలపై ఈ కథ ప్రాముఖ్యతను చూపిస్తుంది. భవిష్యత్ సాంకేతికతపై వ్యంగ్యమా ఉంటూ పాఠకులకు ప్రేరణగా నిలుస్తుంది.
18. The Hobbit – J.R.R. Tolkien
సాహససం, నమ్మకం, ధైర్యం వంటి అంశాలను ప్రతిబింబించే ఈ కథ, కొత్త పాఠకులకు చాలా ఆసక్తికరంగా ఉంటుంది.
19. The Secret Garden – Frances Hodgson Burnett
ఒక తోటలో దాగిన అదృశ్య శక్తి జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపింది అనేది కథ. పిల్లల నుండి పెద్దల వరకు అన్ని వయసుల పాఠకులకు పర్ఫెక్ట్గా ఈ పుస్తకం సరిపోతుంది. సహజ సిద్ధమైన ఆత్మవిశ్వాసం మరియు బలాన్ని పొందేందుకు ఈ కథ కొత్త పాఠకులకు ఉత్తేజాన్ని ఇస్తుంది.
20. Of Mice and Men – John Steinbeck
స్నేహం, ఆశలపై ఈ కథ కొనసాగుతుంది. కాలిఫోర్నియాలో గ్రేట్ డిప్రెషన్ సమయంలో ఇద్దరు వలస కార్మికుల జీవితాల గురించి వివరిస్తుంది ఈ నవల. కొత్తగా చదవాలనుకునే పాఠకులకు ఈ పుస్తకం సులభంగా అర్థమవుతుంది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!