ల్యాప్ కూలింగ్ ప్యాడ్స్ అనేవి ల్యాప్‌టాప్‌ల జీవితకాలాన్ని పెంపొందించడంలో సాయపడుతాయి. ల్యాపటాప్స్ ఆపరేటింగ్ సమయంలో ఎక్కువగా హీట్ జనరేట్ అవుతుంటుంది. ఎక్కువసేపు పనిచేసినప్పుడు హీట్ జనరేషన్ అధికంగా ఉంటుంది. దీనివల్ల ల్యాప్‌టాప్‌లు సడెన్‌గా హ్యాంగ్ అవడం వంటివి జరుగుతాయి. దీర్ఘకాలంలో అధిక వేడిమి వల్ల ల్యాప్‌టాప్‌లు చెడిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా గేమింగ్ ల్యాప్‌టాప్స్, ఎడిటింగ్ ల్యాప్‌టాప్స్‌లో ఎక్కువగా హీట్ జనరేట్ అవుతుంటుంది. నిత్యం వాటిపై పనిచేసే వారికి ల్యాప్‌టాప్ కూలింగ్ ప్యాడ్స్ ఆవశ్యకమైనవి. ఇక్కడ కొన్ని టాప్ రేటెడ్ కూలింగ్ ప్యాడ్స్ సూచించడం జరిగింది. మీ అవసరాన్ని బట్టి అందులో ఒకదాన్ని ఎంచుకుని కొనుగోలు చేసుకోండి.
Zebronics
మార్కెట్‌లో ఉన్న బెస్ట్ ల్యాప్‌టాప్ కూలింగ్ ప్యాడ్స్‌లో ఒకటిగా చెప్పవచ్చు. ఇది డ్యూయల్ కూలింగ్ ఫ్యాన్స్ సెటప్‌తో వస్తుంది. కూలింగ్ ప్యాడ్‌పై బ్లూ LED లైట్ సెటప్ ఉంటుంది. ఇది ల్యాప్‌టాప్ ఆపరేటింగ్ టెంపరేచర్‌ను కంట్రోల్ చేయడంలో సాయపడుతుంది. దీని ధర రూ.479
Lapcare ChillMate
అమెజాన్‌లో టాప్ రేటింగ్ ఉన్న కూలింగ్ ప్యాడ్ ఇది. ఈ కూలింగ్ ఫ్యాడ్ రెండు హైకెపాసిటీ ఫ్యాన్స్ కలిగి ఉంటాయి. ఫ్యాన్స్ స్పీడ్ 1000rpmగా ఉంది. ప్యాడ్ నాన్ స్లిప్ డిజైన్ కలిగి ఉంది. 6 స్టేజ్ అడ్జస్ట్‌మెంట్ కలిగి ఉన్న ఈ ప్యాడ్ ల్యాప్‌టాప్‌కు మంచి గ్రిప్ ఇస్తుంది. వర్కింగ్ టైంలో ల్యాప్‌టాప్ హీట్‌ను సమర్థవంతంగా తగ్గిస్తుంది. దీని ధర రూ. 549
Ant Esports NC150
మొబైల్ హోల్డర్‌ను అదనంగా కలిగి ఉంటుంది ఈ ల్యాప్‌టాప్ కూలింగ్ ప్యాడ్. 5-స్టెప్ రీట్రాక్టబుల్ స్టాండ్‌ను అయితే కలిగి ఉంది. ల్యాప్‌టాప్‌ను ఏ ఎత్తులోనైన అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎల్‌ఈడీ లైట్స్ దీనికి అదనపు ఆకర్షణ. రెండు USB పోర్ట్‌లను కలిగి ఉంటుంది. దీని అడ్జస్టబుల్ స్టాండ్ 10-15.6 అంగుళాల ల్యాప్‌టాప్స్ వరకు ఉపయోగపడుతుంది. దీని ధర రూ. 599.
EvoFox Frost
అమెజాన్‌లో ఇది కూడా టాప్ రేటింగ్ కలిగిన కూలింగ్ ప్యాడ్. 5-స్టెప్ అడ్జస్టబుల్ స్ట్రాప్, రెండు యూఎస్‌బీ పోర్ట్స్, బ్లూ ఎల్‌ఈడీ లైట్స్, ఐరన్ మెష్ కలిగిన ప్యాడ్ ఉండటం దీని ప్రత్యేకతలు. దీనిలోని రెండు కూలింగ్ ప్యాన్స్ హైస్పీడులో చల్లని గాలిని పుష్ చేస్తూ ల్యాప్‌టాప్ హీట్‌ను కంట్రోల్ చేస్తాయి. దీని అసలు ధర రూ.2000 కాగా అమెజాన్‌లో రూ.699 వద్ద ప్రస్తుతం లభిస్తోంది.
Zinq
ఈ ల్యాప్‌టాప్ కూలింగ్ ప్యాడ్ 5 కూలింగ్ ఫ్యాన్స్‌తో వస్తుంది. డ్యూయల్ హైట్ అడ్జస్ట్‌మెంట్ దీని ప్రత్యేకత. ల్యాప్‌టాప్ జారకుండా ఉండేందుకు యాంటీ స్కిడ్ బాఫెల్ డిజైన్‌ను కలిగి ఉంది. దీని ధర రూ.899
Dyazo Cooling Pad
6 కూలింగ్ ఫ్యాన్స్‌తో వచ్చిన ఈ కూలింగ్ ప్యాడ్ సమర్థవంతంగా ల్యాప్‌టాప్ హీట్‌ను కంట్రోల్ చేయడంలో సాయపడుతుంది. ల్యాప్ టాప్ నోట్ బుక్స్ నుంచి లాంగ్ సైజ్ 15.6 ల్యాప్‌టాప్స్‌కు ఇది ఉపయుక్తంగా ఉంటుంది. చాలా సైలెంట్‌గా ఎలాంటి శబ్దం లేకుండా ఇది పని చేస్తుంది. దీని అసలు ధర రూ.1999 కాగా ప్రస్తుతం అమెజాన్‌లో ₹930 వద్ద లబిస్తోంది.
Amazon Basics Laptop Cooling Pad
సుపీరియర్ కూలింగ్ ఫీచర్‌తో వచ్చిన బెస్ట్ ల్యాప్‌టాప్ కూలింగ్ ప్యాడ్ ఇది. 2- లెవెల్ అడ్జస్ట్‌మెంట్, 10-17 అంగుళాల ల్యాప్‌టాప్స్ వరకు దీనిని ఉపయోగించుకోవచ్చు. ఈ కూలింగ్ మ్యాట్ ద్వారా చాలా త్వరగా ల్యాప్‌టాప్ హీట్ కంట్రోల్ అవుతుంది. దీని ధర ₹1,299
Amazon Basics Laptop 7 Cooling Pad
ఇది మేయిన్‌గా గెమింగ్ ల్యాప్‌టాప్స్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. అమెజాన్‌లో టాప్ రెటింగ్ అయితే కలిగి ఉంది. గెమింగ్ ల్యాప్‌టాప్స్ ఎక్కువ హీట్‌ను ప్రొడ్యూస్ చేస్తాయి. అటువంటి ల్యాప్‌టాప్స్‌కు ఇది బెస్ట్ ఛాయిస్. దీని అసలు ధర రూ.4,799 కాగా 71% డిస్కౌంట్‌తో ₹1,399 వద్ద కొనుగోలు చేసుకోవచ్చు.
RAEGR RapidCool Pad:
ఇది ప్రీమియం మెటిరియల్‌తో తయారై మంచి లుక్ అందిస్తుంది. అల్యూమియంతో తయారైన ఈ కూలింగ్ ప్యాడ్ మల్టీ యాంగిల్ అడ్జస్టబులిటీని కలిగి ఉంది. దీనిలోని మరో ప్రత్యేకత ఏమిటంటే ఇందులోని 6 ఫ్యాన్స్ స్పీడ్‌ను కంట్రోల్ చేసుకోవచ్చు. ఆపరేటింగ్ సమయంలో ఫ్యాన్స్ శబ్ద తీవ్రత 20db కంటే తక్కువగా ఉంటుంది. దీని ధర రూ.1,439
KLIM Wind Laptop Cooling Pad
ఇది శక్తివంతమైన కూలింగ్ ఫ్యాడ్‌గా చెప్పవచ్చు. ఇందలోని 5 కూలింగ్ ఫ్యాన్స్ 1200rpm కెపాసిటీని కలిగి ఉన్నాయి. ముఖ్యంగా ఎడిటింగ్, గెమింగ్ ల్యాప్‌టాప్స్‌ను దృష్టిలో ఉంచుకుని వీటిని తయారు చేశారు. దీని ధర రూ.4000 కాగా అమెజాన్‌లో 44శాతం డిస్కౌంట్‌తో ₹2,250 వద్ద లభిస్తోంది.
Proffisy Laptop Cooling Pad
ఈ ల్యాప్‌టాప్ కూలింగ్ ప్యాడ్ 8 కూలింగ్ ఫ్యాన్స్‌తో తయారైంది. 360 డిగ్రీస్ డైనమిక్ కూలింగ్‌ను అందిస్తుంది. ఇది మొబైల్ హోల్డర్‌తో పాటు 6-స్టెప్ ల్యాప్‌టాప్ హైట్ అడ్జస్ట్‌మెంట్‌ను కలిగి ఉంది. ఇందులోని కలర్‌ఫుల్ లైట్స్ 10 ఎఫెక్ట్ మోడ్స్‌ను కలిగి ఉన్నాయి. ముఖ్యంగా పవర్‌ఫుల్ గెమింగ్ ల్యాప్‌టాప్స్, ఎడిటింగ్ ల్యాప్‌టాప్స్ కోసం దీనిని డిజైన్ చేయడం జరిగింది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!