ప్రస్తుతం ప్రతిఒక్కరి కిచెన్‌లో మిక్సర్ గ్రైండర్ల వినియోగం అనివార్యమైంది. ముఖ్యంగా బ్రేక్‌ఫాస్ట్‌కు అవసరమైన వివిధ రకాల పిండ్లు తయారు చేసుకునేందుకు మిక్సర్ గ్రైండర్ తప్పనిసరిగా మారింది. ఇడ్లీ – దోశ పిండ్లు, చట్నీ, మసాలా దినుసుల పొడికి మిక్సీలనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీన్ని గమనించిన ప్రముఖ కంపెనీలు వివిధ రకాల మిక్సీలను మార్కెట్‌లోకి రిలీజ్ చేశాయి. అయితే కొత్తగా మిక్సీ కొనాలని భావించే వారు వాటిలో ఏది కొనాలో తెలియక సమతమతమవుతున్నారు. అటువంటి వారి కోసం YouSay బెస్ట్ మిక్సీల జాబితాను తీసుకొచ్చింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
COOK WELL BULLET MIXER GRINDER
కుక్ వెల్ నుంచి వచ్చిన ఈ మిక్సర్ గ్రైండర్‌లో 5 జాడీలు, 3 బ్లేడ్లు ఉంటాయి. 600 వాట్ల మోటారుతో ఇది నడుస్తుంది. ఈ మిక్సీని షాక్ ఫ్రూఫ్‌గా తయారు చేశారు. ఇది కిచెన్‌లో చాలా తక్కువ స్పేస్ ఆక్రమిస్తుంది. అమెజాన్‌లో దీని ధర రూ.2,478గా ఉంది.
PRESTIGE IRIS PLUS MIXER GRINDER
ప్రెస్టిజ్ ఐరిస్ ప్లస్ మిక్సర్ గ్రైండర్ 750 వాట్ల మోటారుతో నడుస్తుంది. 4 జాడీలు, నాలుగు బ్లేడ్లతో మిక్సర్ వస్తుంది. దీనికి 2 సంవత్సరాల వారంటీ ఉంది. అమెజాన్‌లో దీని ధర రూ.3,099గా ఉంది.
BAJAJ REX MIXER GRINDER
బజాజ్ రెక్స్ మిక్సర్ గ్రైండర్ 750 వాట్ల మోటార్‌తో నడుస్తుంది. ABS ప్లాస్టిక్‌తో దీన్ని తయారు చేశారు. ఫలితంగా దీనికి తుప్పు పట్టే ఛాన్స్ లేదు. నాలుగు జాడీలతో ఈ మిక్సర్ వస్తుంది. అమెజాన్‌లో దీని ధర రూ.3,249గా ఉంది.
BUTTERFLY JET ELITE MIXER GRINDER
బటర్ ఫ్లై జెట్ ఎలైట్ మిక్సర్ గ్రైండర్‌ను కూడా ABS మెటీరియల్‌తో రూపొందించారు. దీంతో కరెంట్ షాక్‌కు అవకాశమే లేదు. నాలుగు జాడీలతో ఈ మిక్సర్ రానుంది. 750 వాట్ల మోటార్‌తో ఇది పనిచేస్తుంది. అమెజాన్‌లో దీని ధర రూ.3,297గా ఉంది.
PREETHI BLUE LEAF DIAMOND MIXER GRINDER
ప్రీతి బ్లూ లీఫ్ డైమండ్ మిక్సర్ గ్రైండర్ 750 వాట్ల మోటార్‌తో నడుస్తుంది. దీనికి మూడు జాడీలు వస్తాయి. మోటార్‌పై రెండేళ్ల గ్యారంటీ ఉంటుంది. లైఫ్ లాంగ్ ఫ్రీ సర్వీస్ కూడా ఇచ్చారు. అమెజాన్‌లో దీని ధర రూ.3,799గా ఉంది.
PHILIPS HL MIXER GRINDER
ఫిలిప్స్ హెచ్ఎల్ మిక్సర్ గ్రైండర్‌ను 750 వాట్ల మోటార్‌తో రూపొందించారు. దీనిపై ఐదేళ్ల వారంటీ ఉంది. ఈ మిక్సర్ మూడు జాడీలతో రానుంది. అమెజాన్‌లో దీని ధర రూ.4,089గా ఉంది.
BOSCH TRUEMIXX PRO MIXER GRINDER
బాస్క్ ట్రూ మిక్సర్ గ్రైండర్ 1000 వాట్ల మోటార్‌తో తయారు చేశారు. నాలుగు జాడీలతో దీనిని రూపొందించారు. స్టెయిన్ లెస్ స్టీల్ బ్లేడ్లతో రూపొందించడంతో ఇది సమర్ధవంతంగా పనిచేస్తుంది. దీనికి రెండేళ్ల వారంటీ ఉంది. అమెజాన్‌లో దీని ధర రూ.6,499గా ఉంది.
BOSCH PRO 750W MIXER GRINDER
బాస్క్ ప్రొ మిక్సర్ గ్రైండర్‌ను 750 వాట్ల మోటార్‌తో రూపొందించారు. 100 శాతం కాపర్ వైండింగ్‌తో తయారు చేశారు. అమెజాన్‌లో దీని ధర రూ.5,449గా ఉంది.
Celebrities Featured Articles Movie News
Niharika Konidela: ‘ప్రాణం పోవడం పెద్ద విషయం’.. బన్నీపై నిహారిక షాకింగ్ కామెంట్స్!