ప్రస్తుత కాలంలో యువత.. టూర్లు, లాంగ్ డ్రైవ్‌లకు వెళ్లేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు ఎంత దూరమైన వెళ్తున్నారు. ఈ క్రమంలో తమ వెంట పోర్టబుల్ లేదా వైర్‌లెస్ బ్లూటూత్ స్పీకర్స్ తీసుకెళ్తూ మ్యూజిక్‌ను ఆస్వాదిస్తున్నారు. దీన్ని గమనించిన ప్రముఖ కంపెనీలు భారీగా పోర్టబుల్ స్పీకర్లను మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నాయి. దీంతో ఏది కొనాలో తెలియక వినియోగదారులు సతమతమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మీడియం రేంజ్‌లో ఉన్న బెస్ట్ బ్లూటూత్ స్పీకర్స్ జాబితాను YouSay మీ ముందుకు తీసుకువచ్చింది. అవేంటో మీరే చూడండి.
boAt Stone 1000
మ్యూజిక్ గాడ్జెట్స్ రంగంలో బోట్ (Boat) కంపెనీకి మంచి పేరు ఉంది. ఈ కంపెనీ ఉత్పత్తి చేసే హెడ్‌సెట్, ఇయర్‌ఫోన్స్‌తో పాటు బ్లూటూత్ స్పీకర్స్‌కు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. బోట్ కంపెనీకి చెందిన స్పీకర్‌ను కొనాలని భావించేవారు ‘boAt Stone 1000’ ట్రై చేయవచ్చు. 3000 mAh బ్యాటరీతో దీన్ని తయారు చేశారు. 8 గంటల పాటు నిర్విరామంగా మ్యూజిక్ వినవచ్చు. దీని అసలు ధర రూ.6,990 కాగా అమెజాన్ దీన్ని 57% రాయితీతో అందిస్తోంది. ఫలితంగా రూ.2,999కే ఇది అందుబాటులో ఉంది.
JBL Go 3
గాడ్జెట్ ప్రపంచంలో జేబీఎల్ (JBL) ప్రొడక్ట్స్‌కు మంచి క్రేజ్ ఉంది. ఈ కంపెనీకి చెందిన స్పీకర్ కోసం ఎదురుచూసే వారు ‘JBL Go 3 Wireless Ultra Portable Bluetooth Speaker’ ట్రై చేయవచ్చు. దీని అసలు ధర రూ. 4,499 కాగా అమెజాన్‌లో దీనిపై 33% డిస్కౌంట్ ఉంది. ఫలితంగా రూ.2,999కు ఈ స్పీకర్ పొందవచ్చు.
Sony Srs-Xb13
టెక్ రంగంలో సోనీ (Sony) కంపెనీకి ఎంత మంచి పేరుందో అందరికీ తెలిసిందే. అందుకే ఈ కంపెనీకి చెందిన గాడ్జెట్స్‌ను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలో సోనీ కంపెనీ స్పీకర్ ఆశించేవారికి ‘Sony Srs-Xb13’ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఇది వాటర్‌ప్రూఫ్‌తో రావడం విశేషం. దీని ఒరిజినల్ ప్రైస్ రూ.4,990 కాగా అమెజాన్ దీనిపై 20 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. ఫలితంగా ఈ స్పీకర్ సేలింగ్ ధర రూ. 3,990గా ఉంది.
ZEBRONICS Music Bomb X Pro
జెబ్రోనిక్స్ (ZEBRONICS) కొత్తగా లాంచ్ చేసిన Music Bomb X Pro స్పీకర్స్‌కు మార్కెట్‌లో మంచి ఆదరణ లభిస్తోంది. ఈ స్పీకర్స్‌ను ఒకసారి ఛార్జ్ చేస్తే 22 గంటల పాటు నిర్విరామంగా పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. దీని అసలు ధర రూ.4,429 కాగా దీనిపై అమెజాన్ 55% రాయితీ ఇస్తోంది. దీంతో ఇది కేవలం రూ.1,999 అందుబాటులోకి వచ్చింది.
Realme Cobble
రియల్‌మీ నుంచి కూడా మంచి స్పీకర్స్ అందుబాటులో ఉన్నాయి. తక్కువ బడ్జెట్‌లో రియల్‌మీ స్పీకర్స్ కోరుకునే వారు ‘Realme Cobble’ను ట్రై చేయవచ్చు. ఇది అమెజాన్‌లో రూ.1,455కే అందుబాటులో ఉంది.
MI Portable Wireless Bluetooth Speaker
రెడ్‌మీ కూడా ఫోన్స్, హెడ్‌సెట్‌లతో పాటు క్వాలిటీ స్పీకర్స్‌ను మార్కెట్‌లో విక్రయిస్తోంది. ఇందులో MI Portable Wireless Bluetooth Speaker బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇది వాటర్‌ప్రూఫ్‌తో రావడం విశేషం. దీని అసలు ధర రూ.3,499గా ఉంది. 29% డిస్కౌంట్ పోనూ రూ.2,499 ఈ స్పీకర్ అమెజాన్‌లో విక్రయమవుతోంది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!