ప్రస్తుత రోజుల్లో స్మార్ట్‌ఫోన్ వినియోగం బాగా పెరిగింది. సెల్ఫీలు దిగడం, వీడియోలు తీయడం, మూవీస్ చూడటం, గేమ్స్ ఆడటం వంటి వాటి వల్ల ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రై అయిపోతోంది. ఇంట్లో ఉన్న సమయంలో ఫోన్ బ్యాటరీ ఖాళీ అయితే పెద్దగా సమస్య ఉండదు. కానీ ఔట్‌డోర్ వెకేషన్స్‌లో ఉన్నప్పుడు జరిగితే దానంతా ఇబ్బంది మరొకటి ఉండదని అనిపిస్తుంది. అలాంటి వారి కోసమే పవర్ బ్యాంక్స్ అందుబాటులోకి వచ్చాయి. అయితే పవర్ బ్యాంక్స్ కొనాలని ఉన్నా ఏది మంచిదో తెలియక చాలామంది సతమతవుతుంటారు. అటువంటి వారి కోసం YouSay టాప్ పవర్ బ్యాంక్స్ లిస్టు తీసుకొచ్చింది. అవేంటో మీరే చూడండి.
1. Mi Power Bank 3i 20000mAh
రెడ్‌మీ ఫోన్ల లాగే పవర్ బ్యాంక్స్‌కు సైతం వినియోగదారుల్లో మంచి పేరుంది. రెడ్‌మీ తీసుకొచ్చిన 20,000 mAh లిథియం పాలిమర్ బ్యాటరీ మీడియం రేంజ్‌లో బెస్ట్ పర్‌ఫార్మెన్స్ ఇస్తోంది. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది. అమెజాన్‌లో దీని ధర రూ. 2,049 గా ఉంది. ఆరు నెలల వారంటీతో ఇది అందుబాటులో ఉంది.
2. Ambrane 20000mAh Power Bank
అంబ్రేన్ 20000mAh పవర్ బ్యాంక్ కూడా మార్కెట్‌లో ఉన్న వాటితో పోలిస్తే బెటర్ అని చెప్పొచ్చు. ఇది కూడా లిథియం పాలిమర్ బ్యాటరీని కలిగి ఉంది. 20W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది. అమెజాన్‌లో 20% డిస్కౌంట్‌తో రూ.1,999 ఇది లభిస్తోంది. బ్లాక్, బ్లూ, గ్రీన్ కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది.
3. URBN 10000 mAh Power Bank
ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న నాణ్యమైన పవర్ బ్యాంక్స్‌లో ‘URBN 10000mAh’ ఒకటి. దీని అసలు ధర రూ.2,499 కాగా అమెజాన్‌లో ఇది 52% డిస్కౌంట్‌తో లభిస్తోంది. కాబట్టి దీన్ని రూ.1,199కే పొందవచ్చు. మెుత్తం నాలుగు రంగుల్లో ఈ పవర్ బ్యాంక్ అందుబాటులో ఉంది.
4. Realme 20000 mAh Power Bank
ప్రముఖ మెుబైల్ తయారీ సంస్థ రియల్‌మీ నుంచి కూడా ఓ బెస్ట్ పవర్ బ్యాంక్ అందుబాటులో ఉంది. Realme 20000 mAh పేరుతో తీసుకొచ్చిన ఈ పవర్ బ్యాంక్ 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. రూ.2000 లోపు ఉన్న పవర్ బ్యాంక్ కోసం ఎదురు చూస్తున్నట్లైతే ఇది చక్కని ఎంపిక అని చెప్పవచ్చు.
5. MI 10000 mAh Power Bank
రెడ్‌మీలో తక్కువ బడ్జెట్‌లో పొకెట్ పవర్ బ్యాంక్ కోరుకునే వారికి MI 10000 mAh సరైన ఆప్షన్. అమెజాన్‌లో దీనిపై 32 శాతం డిస్కౌంట్ నడుస్తోంది. ఫలితంగా రూ. 2,499 ఖరీదు గల ఈ పవర్ బ్యాంక్‌ను రూ.1,699కే దక్కించుకోవచ్చు. ఈ పవర్ బ్యాంక్ 22.5W అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది.
6. PTron Dynamo 10000 mAh
మీరు పవర్‌ఫుల్ పవర్ బ్యాంక్ కోసం ఎదురుచూస్తుంటే PTron Dynamo 10000 mAh పరిశీలించవచ్చు. ఇది 22.5W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది. ఇది అమెజాన్‌లో రూ.999 కే అందుబాటులో ఉంది.
7. TheSyska P055OX 5000mAh
రూ.1000 లోపు బడ్జెట్‌లో పవర్ బ్యాంక్‌ను కోరుకునే వారు TheSyska P055OX 5000mAh ట్రై చేయోచ్చు. ఇది ఓవర్ ఛార్జింగ్ & డిస్‌ఛార్జింగ్ నుంచి రక్షణ కల్పిస్తుంది. ఎలాంటి స్మార్ట్‌ఫోన్‌నైనా దీని ద్వారా ఛార్జ్ చేసుకోవచ్చు. 6 నెలల వారంటీతో ఇది వస్తోంది. ఆన్‌లైన్‌లో ఇది రూ.599 లకే లభిస్తోంది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!