చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ రియల్‌మీకి ఇండియాలో రెడ్‌మీ తర్వాత ఆ స్థాయిలో మంచి గుడ్ విల్ ఉంది. ఈ కంపెనీ నుంచి వచ్చే స్మార్ట్ ఫోన్లకు ఇండియన్ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. తక్కువ బడ్జెట్ నుంచి ప్రీమియం బడ్జెట్ వరకు ఫోన్లను రియల్‌మీ అందిస్తోంది. వాటిలో బెస్ట్ రేటింగ్ కలిగిన, ఎక్కువ అమ్ముడు పోతున్న రియల్‌మీ ఫొన్లను మీకు అందిస్తున్నాం. వాటిలో మీకు నచ్చిన ఫోన్‌ను ఎంపిక చేసుకుని కొనుగోలు చేసుకోండి.
realme 11 Pro
రియల్ మీ ప్రీమియం ఫీచర్లతో అందిస్తున్న ఫ్లాగ్ షిప్ ఫోన్ ఇది. 6.7 అంగుళాల సూపర్ ఆమోల్డ్ డిస్‌ప్లేతో 120 హెడ్జ్ రిఫ్రేష్ రేటుతో వచ్చింది. 12 జీబీ ర్యామ్ 256 స్టోరేజ్ కెపాసిటీతో 6NM 7050 పవర్ ఫుల్ మీడియా టెక్ డైమెన్సిటీ చిప్‌సెట్‌తో వచ్చింది. 5000mAh బ్యాటరీ, 60W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంది. 200 మెగాఫిక్సెల్ ప్రైమరీ కెమెరాతో 16MP ఫ్రంట్ కెమెరాతో అందుబాటులో ఉంది. అమెజాన్‌లో దీని ధర రూ. ₹24,600
realme 11 5G
రియల్‌మీ 11 మొబైల్ మెయిన్ కెమెరా 108MP + 2MP డ్యూయెల్ సెటప్‌తో వచ్చింది. 16MP ఫ్రంట్ కెమెరాను కలిగి స్టన్నింగ్ సెల్ఫీ ఫొటోలు అయితే క్యాప్చర్ చేస్తుంది. 6100+ 5G మీడియా టెక్ డైమెన్సిటి చిప్ సెట్‌తో వస్తుంది. 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ కెపాసిటీ, 2TB ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ ఆప్షన్ అందుబాటులో ఉంది. 5000mAh బ్యాటరీ కెపాసిటీతో 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. దీని ధర రూ.17890
realme C55
రియల్ మీ స్మార్ట్ ఫొన్లలో ఎక్కువగా అమ్ముడుపోతున్న స్మార్ట్ మొబైల్స్‌లో realme C55 ఒకటి. రూ.10 వేల బడ్జెట్‌లో ఇది బెస్ట్ ఆప్షన్‌గా చెప్పవచ్చు. ఇది 6జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 6.72 అంగుళాల డిస్‌ప్లే, 64MP ప్రధాన కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరాతో అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.13,999 కాగా ప్రస్తుతం రూ.10,889 వద్ద లభిస్తోంది.
realme C51
తక్కువ బడ్జెట్ రేంజ్‌లో మంచి ఫీచర్లతో వస్తున్న మరో రియల్ మీ ఫోన్ realme C51. ఇది 4GB RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వచ్చింది. 6.74 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే, 50MP ఏఐ ఆధారిత ఫ్రంట్ కెమెరా, 50MP ప్రధాన కెమెరా సెటప్ కలిగి ఉంది. 5000mAh బ్యాటరీ కెపాసిటీతో 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే కలిగి ఉంది. స్టైలీష్ డిజైన్ కలిగిన ఈ ఫోన్ ధర రూ.9499
realme C53
రూ.10 వేల బడ్జెట్‌లో సూపర్ ఫీచర్స్‌తో realme C53 లభిస్తోంది. 108ఎంపీ ప్రధాన కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా సెటప్ అయితే కలిగిం ఉంటుంది. 6.74 అంగుళాల పొడవు డిస్‌ప్లేతో 5000mAh బ్యాటరీ కెపాసిటీతో 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే కలిగి ఉంది. 4జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యంతో వచ్చింది. దీని ధర రూ. 10,095
realme 11x 5G
8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ బేసిక్ వేరియంట్‌లో ఈ ఫొన్ రూపొందింది. 6.72 అంగుళాల పొడవు HDడిస్‌ప్లేతో 5000mAh బ్యాటరీ కెపాసిటీతో 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే కలిగి ఉంది. మీడియా టెక్ డైమెన్సిటి 6100 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 64MP ప్రైమరీ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరాతో రూపొందింది. దీని ధర రూ. 15,040
realme 11 Pro+ 5G
రిమల్‌మీ నుంచి వచ్చిన మరో ఫ్లాగ్ షిప్ ఫోన్ realme 11 Pro+ 5G. ఇది 200MP ప్రోలైట్ కెమెరాతో వచ్చిన ఈ ఫోన్ అద్భుతమైన ఫొటోలు క్యాప్చర్ చేయగలదు. లో లైట్‌లో మంచి ఫొటోలు తీస్తుంది. 32ఎంపీ సెల్ఫీ కెమెరా, 7050 మీడియాటెక్ డైమెన్సిటి ప్రాసెసర్, 5000mAh బ్యాటరీ కెపాసిటీతో 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది. దీని అసలు ధర రూ. 30 వేలు కాగా ప్రస్తుతం అమెజాన్‌లో రూ.27375 వద్ద అందుబాటులో ఉంది.
Celebrities Featured Articles Telugu Movies
HBD Thaman: థమన్ గురించి ఈ విషయాలు తెలిస్తే అస్సలు ట్రోల్ చేయరు..!