ఇండియాలో రెడ్‌మీ బ్రాండ్‌కు మంచి గుర్తింపు ఉంది. సామాన్యుల ఐఫొన్‌గా దీనిని పిలుచుకుంటారు. తక్కువ ధరలో అన్ని రకాల ఫీచర్లను అందిస్తూ నమ్మకమైన బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకుంది రెడ్‌మీ. ఎందుకంటే ప్రీమియం ఫీచర్‌ల కోసం ప్రతి ఒక్కరూ ప్రీమియం ధరను చెల్లించలేరు. మార్కెట్‌లోకి కొత్తగా ఎన్ని మొబైల్ ఫొన్లు వచ్చినా రెడ్‌మీ బ్రాండ్ నుంచి వచ్చే ఫొన్లకు ఉండే గిరాకే వేరు.
మీ బడ్జెట్‌ను బట్టి తక్కువ ధర నుంచి ప్రిమియం ఫీచర్లు అందించే టాప్-సెల్లింగ్ రెడ్‌మి మొబైల్ ఫోన్‌ల జాబితాను ఇక్కడ అందిస్తున్నాం. మీ బడ్జెట్, అవసరాన్ని బట్టి మీకు సరిపోయే మోడల్‌ను ఎంచుకొండి. 2023 సెప్టెంబర్ 1 వరకు భారత్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న రెడ్ మీ స్మార్ట్ ఫొన్‌ల జాబితాను మీకు అందిస్తున్నాం. వాటి స్పెసిఫికేషన్‌లు, వారంటీ, ప్రయోజనాలు, లోపాలు ఈ ఆర్టికల్‌లో సమీక్షించడం జరిగింది. వాటిలో నుంచి మీకు సరిపడే మొబైల్‌ను ఎంచుకోండి.
1. రెడ్ మీ నోట్ 12 ప్రో( Redmi Note 12 Pro)
రెడ్ మీ నోట్ 12 ప్రో సిరీస్ షామీ నుంచి వచ్చిన ఫ్లాగ్ షిప్ ఫొన్. ఇది ఇండియాలో ఈ ఏడాది మేలో లాంచ్ అయింది. ఈ సిరీస్‌లో రెండు ఫొన్లు ఉన్నాయి. ఒకటి రెడ్ మీ నోట్ 12 ప్రో, మరొకటి 12 ప్రో ప్లస్.
రెడ్ మీ నోట్ 12 ప్రో శక్తివంతమైన మీడియా టెక్ డైమెన్‌సిటీ 1080 ప్రాసెసర్‌తో వచ్చింది. 6.67 అంగుళాల లార్జ్ AMOLED డిస్‌ప్లేతో 120Hz రిప్రెష్ రేటును కలిగి ఉంది. 12 ప్రో మెయిన్ కెమెరా సిస్టమ్ 50 మెగాఫిక్సెల్, 8MP అల్ట్రావైడ్ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరాను కలిగి ఉంటాయి. దీంతో ఫొటోలు నేచురల్‌గా అన్ని డిటేల్స్‌ను కవర్ చేస్తాయి. వీటితో పాటు 5000mAh బ్యాటరీ సామర్థ్యంతో 67W ఫాస్ట్ ఛార్జింగ్‌ను అయితే సపోర్ట్ చేస్తుంది.
రెడ్‌మీ నోట్ 12 ప్రో ప్లస్ సైతం మీడియా టెక్ డైమెన్‌సిటీ 1080 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. ఈ గ్యాడ్జెట్ 6.67 అంగుళాల ఆమోల్డ్ డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేటును అయితే కలిగి ఉంది. కెమెరా డిపార్ట్‌మెంట్‌లో మాత్రం 12 ప్రో ఫ్లస్ 12 ప్రోకంటే చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ అయితే అందిస్తోంది. దీని మెయిన్ కెమెరా 200MP, 8MP అల్ట్రా వైడ్, 2MP మ్యాక్రో కెమెరాతో షార్ప్ ఫొటోలు తీస్తుంది. అలాగే 16MP ఫ్రంట్ కెమెరా ఉండటం వల్ల నాణ్యమైన సెల్ఫీ ఫొటోలు ప్రాసెస్ అవుతాయి.
ఇక సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే ఈ రెండు ఫొన్లు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 13పై రన్ అవుతాయి. మూడు కలర్ ఆప్షన్స్ గ్రాఫైట్ గ్రే, అయోరా గ్రీన్, పాన్‌థూం వైట్‌లో లభ్యమవుతున్నాయి.
తక్కువ ధరలో శక్తివంతమైన ప్రాసెసర్, మంచి డిస్‌ప్లే, కెమెరాతో కూడిన స్మార్ట్‌ఫోన్ కావాలనుకునేవారికి Redmi Note 12 Pro సిరీస్ మంచి ఎంపిక.
Redmi K50i
Redmi K50i సరికొత్త MediaTek డైమెన్సిటీ 8100 ప్రాసెసర్‌తో వచ్చిన హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్. ఇది గేమింగ్ విషయంలో మంచి ఫర్ఫామెన్స్ చూపిస్తుంది. ఈ గ్యాడ్జెట్ 67W టర్బోచార్జింగ్ సపోర్ట్‌తో లిక్విడ్ FFS డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ ఫొన్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ డాల్బీ అట్మోస్ కలిగి ఉండటం వల్ల మంచి సౌండ్ అవుపుట్‌ను అయితే అందిస్తుంది.
ఇందులోని ప్రధాన కెమెరా 64MP ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగి ఉండి… AI నాయిస్ రిడక్షన్ ద్వారా నాణ్యమైన చిత్రాలను ప్రాసెస్ చేస్తుంది. ఇది 4K మోడ్‌లో వీడియో రికార్డింగ్ చేయగలదు. ఈ ఫోన్ ఫాంటమ్ బ్లూ, క్విక్ సిల్వర్, స్టెల్త్ బ్యాక్ కలర్స్‌లో అందుబాటులో ఉంది.
Redmi Note 12 5G
Redmi Note 12 5G స్మార్ట్ ఫొన్ ఈ ఏడాది మేలో విడుదలైంది. ఇది బడ్జెట్ ఫ్రేండ్లీ స్మార్ట్‌ఫోన్. ఇది MediaTek డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌పై నడుస్తుంది. 6.6-అంగుళాల FULL HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. Redmi Note 12 5Gలో 48MP ప్రధాన కెమెరా, 2MP మాక్రో కెమెరా ఉన్నాయి. ఇది 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉండి18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. Redmi Note 12 5G మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది: 4GB/64GB, 4GB/128GB, 6GB/128GB. దీని ధర రూ.16,999 నుంచి స్టార్ట్ అవుతోంది.
5G కనెక్టివిటీతో స్మార్ట్‌ఫోన్ కోసం వెతుకుతున్న వారికోసం ఇది మంచి బడ్జెట్ ఫొన్. అతి తక్కువ ధరలోనే 5G కనెక్టివిటీ, శక్తివంతమైన ప్రాసెసర్, మంచి డిస్‌ప్లే, దీర్ఘకాలం ఉండే బ్యాటరీని అందిస్తుంది.
Redmi Note 11T
Redmi Note 11T స్మార్ట్ ఫొన్ MediaTek డైమెన్సిటీ 810 Octa-core ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఇది కూడా 5G కనెక్టివిటీని కలిగి ఉంది. 6జీబీ వేరియంట్‌లో లభిస్తున్న ఈ స్మార్ట్ ఫొన్‌లో మరో ప్రత్యేకత ఏమిటంటే ఈ ఫొన్‌లోని RAM బూస్టర్ RAMని 11GB వరకు ఎనేబుల్ చేస్తుంది. 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉండి 33W ప్రో ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫొన్‌లో అదనంగా, రీడింగ్ మోడ్, సన్‌లైట్ డిస్‌ప్లే, క్లారిటీతో కూడిన FHD+ స్క్రీన్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి
ఈ గ్యాడ్జెట్‌లో 50MP AI కెమెరా, 16MP సెల్ఫీ కెమెరా వంటి ఫీచర్స్ వల్ల ప్రతి సీనరినీ కెమెరాలో బంధించవచ్చు. Redmi Note 11T.. ఆక్వామెరిన్ బ్లూ, స్టార్‌డస్ట్ వైట్, మ్యాట్ బ్లాక్ మూడు కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉంది.
Redmi Note 10S
Redmi Note 10S స్టార్ట్ ఫొన్ మెయిన్ కెమెరా 64MP AI క్వాడ్ కెమెరాను కలిగి ఉంటుంది. 13MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరా సిస్టం అద్భుతమైన ఫోటోలను షూట్ చేస్తుంది. ఇది సూపర్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫొన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ స్లిమ్ తేలికపాటి Redmi స్మార్ట్‌ఫోన్ మూడు అద్భుతమైన రంగులలో అందుబాటులో ఉంది: కాస్మిక్ పర్పుల్, డీప్ సీ బ్లూ మరియు షాడో బ్లాక్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తోంది.
Celebrities Featured Articles Telugu Movies
HBD Thaman: థమన్ గురించి ఈ విషయాలు తెలిస్తే అస్సలు ట్రోల్ చేయరు..!