ప్రస్తుతం ఫ్రిజ్ అనేది ప్రతీ ఒక్క ఇంట్లో భాగమైపోయింది. ఒకప్పుడు లగ్జరీ వస్తువుగా ఉన్న ఫ్రిజ్.. నేటి అవసరాల దృష్ట్యా నిత్యవసర వస్తువుగా మారిపోయింది. కూరగాయాలు, పాలు, ఇతర వస్తువులను భద్రపరుచుకునేందుకు పేద, ధనిక అన్న తారతమ్యం లేకుండా ప్రతీ ఒక్కరూ రిఫ్రిజిరేటర్లను కొనుగోలు చేస్తున్నారు. ఇందుకు అనుగుణంగానే పలు కంపెనీలు ఇబ్బడి ముబ్బడిగా మార్కెట్‌లోకి ఫ్రిజ్‌లను రిలీజ్ చేస్తున్నాయి. అయితే ఇందులో ఏది బెస్ట్ అని తెలియక వినియోగదారులు సతమతమవుతున్నారు. అటువంటి వారి కోసం తక్కువ బడ్జెట్‌లో అత్యుత్తమ రిఫ్రిజిరేటర్ల జాబితాను YouSay మీ ముందుకు తీసుకొచ్చింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
Voltas Beko ‘A TATA product’ 183 L
టాటా కంపెనీకి చెందిన Voltas ఫ్రిజ్‌లు మార్కెట్‌లో మంచి ఆదరణను కలిగి ఉన్నాయి. తక్కువ బడ్జెట్‌లో మంచి ఫ్రిజ్ కోరుకునే వారు ‘Voltas Beko ‘A TATA product’ 183 L’ ట్రై చేయవచ్చు. దీనిని 183 లీటర్ల సామర్థ్యంతో తీసుకొచ్చారు. దీని అసలు ధర రూ.27,890 కాగా అమెజాన్‌లో ఇది 39% డిస్కౌంట్‌తో లభిస్తోంది. ఫలితంగా రూ.16,990కే ఈ ఫ్రిజ్ పొందవచ్చు.
Samsung 189L
మీరు తక్కువ బడ్జెట్‌లో సామ్‌సంగ్ ఫ్రిజ్ కావాలనుకుంటే ‘Samsung 189L 5Star Refrigerator’ సరైన ఎంపిక అని చెప్పవచ్చు. ఇది మీడియం రేంజ్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్. ఇద్దరు లేదా ముగ్గురు మనుషులు ఉండే చిన్న ఫ్యామిలీకి ఇది బాగా సరిపోతుంది. దీని ఒరిజినల్ ప్రైస్ రూ.24,999. అమెజాన్‌లో 27% డిస్కౌంట్‌తో రూ.18,350కే లభిస్తోంది.
LG 185 L 5 Star Refrigerator
LG కంపెనీ కూడా క్వాలిటీ ఫ్రిజ్‌లను మార్కెట్‌లో విడుదల చేస్తోంది. తక్కువ ప్రైస్‌లో ఈ కంపెనీ ఫ్రిజ్ కొనాలనుకునే వారు ‘LG 185 L 5 Star Refrigerator’ ట్రై చేయవచ్చు. ఇది 185 లీటర్ల సామర్థ్యాన్ని కలిగి ఉంది. సింగిల్ డోర్‌తో దీన్ని తీసుకొచ్చారు. దీని అసలు ధర రూ.22,199 కాగా 23% డిస్కౌంట్‌తో రూ.16,990కే అమెజాన్ దీన్ని అందిస్తోంది.
Haier 190 L Refrigerator
హైయర్ (Haier) కంపెనీ కూడా నాణ్యమైన ఫ్రిజ్‌లను అందిస్తోంది. రూ.20 వేల లోపు హైయర్ ఫ్రిజ్ కోరుకునేవారు ‘Haier 190 L 5 Single Door Refrigerator’ పరిశీలించవచ్చు. నలుగురు మనుషులు ఉండే చిన్న ఫ్యామిలీకి ఇది సరిగ్గా సరిపోతుంది. ఈ ఫ్రిజ్ అసలు ఖరీదు రూ.26,990 కాగా దీనిపై అమెజాన్ 30% రాయితీ ఇస్తోంది. దీంతో రూ.18,990కే ఈ రిఫ్రిజిరేటర్ అందుబాటులో ఉంది.
Whirlpool 300L Refrigerator
ప్రస్తుతం మార్కెట్‌లో లభిస్తున్న మీడియం రేంజ్ ఫ్రిజ్‌లలో Whirlpool 300 L Frost Free Multi-Door Refrigerator బెస్ట్ అని చెప్పవచ్చు. ఇది 30 లీటర్ల కేపాసిటీని కలిగి ఉంది. అమెజాన్‌లో దీని అసలు ధర రూ. 38,900 కాగా 20 శాతం డిస్కౌంట్‌తో ఇది లభిస్తోంది. దీనిని రూ.31,090 పొందవచ్చు. 300 లీటర్ల కంటే తక్కువ సామర్థ్యమున్న ఫ్రిజ్‌లు కూడా ఈ మోడల్‌లో అందుబాటులో ఉన్నాయి.
Celebrities Featured Articles Telugu Movies
HBD Thaman: థమన్ గురించి ఈ విషయాలు తెలిస్తే అస్సలు ట్రోల్ చేయరు..!