ప్రస్తుతం కొందరిని సెన్సిటివిటీ సమస్య వెంటాడుతోంది. ఐస్ క్రీమ్, చల్లని నీరు, వేడి, టీ, కాఫీ తాగినప్పుడు పళ్లు జివ్వున లాగడానికి సెన్సిటివిటీనే కారణం. చాలా మందిలో ఈ సమస్య కొన్ని నిమిషాల పాటు ఉంటుంది. ఆ సమయంలో పంటి నొప్పితో ఎంతటివారైనా విలవిల్లాడిపోతారు. ఇలాంటి వారు ప్రత్యేక టూత్ పేస్ట్ వాడాల్సి ఉంటుంది. అప్పుడే పళ్లు దృఢంగా మారి నొప్పి నుంచి విముక్తి కలుగుతుంది. మన దేశంలో సెన్సిటివిటీ టూత్ పేస్టులు చాలానే ఉన్నాయి. ఇండియాలో దొరికే సెన్సెటివ్ టూత్ పేస్టులలో అత్యుత్తమైన వాటిని YouSay మీ ముందుకు తీసుకొచ్చింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
సెన్సోడైన్
సెన్సిటివిటీ విషయంలో ది బెస్ట్ టూత్ పేస్ట్‌గా సెన్సోడైన్ (Sensodyne)ను చెప్పుకోవచ్చు. రోజుకు రెండు సార్లు దీంతో పళ్లు తోముకుంటే ఒక నెలలోనే మంచి ఫలితాన్ని చూడవచ్చు. ఇది దంతాలను బాగు చేసి సమస్యలను దూరం చేస్తుంది. ఈ పేస్ట్ దంతాల లోపల నరాల పనితీరును మెరుగుపరుస్తుంది. చిగుళ్ల నొప్పి, వాపు నుంచి ఇది ఉపశమనం కలిగిస్తుంది.
కోల్గేట్ సెన్సిటివిటీ టూత్ పేస్ట్
ఈ పేస్ట్ బ్యాక్టీరియా, క్యావిటీ నుంచి రక్షిస్తుంది. చిగుళ్లను కాపాడి దంతాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సెన్సిటివిటీ ఉన్న దంతాలను సంరక్షించడంలో ఇది బాగా పనిచేస్తుంది. ఎనామిల్ ధృఢంగా ఉంచి సూక్ష్మక్రిముల నుంచి దూరంగా ఉంచుతుంది. వేడి, చల్లని, తియ్యని పదార్థాల వల్ల కలిగే నొప్పిని ఇది నివారిస్తుంది.
హిమాలయ హెర్బల్ సెన్సిటివ్ టూత్ పేస్ట్
మన దేశంలో హిమాలయ టూత్ పేస్ట్‌ను ఎక్కువ మంది వినియోగిస్తుంటారు. ఈ హిమాలయ హెర్బల్ పేస్ట్ పళ్ల నొప్పిని తగ్గిస్తుంది. చిగుళ్ల నుంచి రక్తస్రావం కాకుండా చూస్తుంది. ఈ పేస్టు ఎల్లప్పుడూ నోరు తాజాగా ఉండేలా చేస్తుంది. సెన్సివిటీ నివారణలోనూ ఈ పేస్ట్ మంచి పేరుంది.
థర్మోడెంట్ సెన్సిటివ్ హెర్బల్ టూత్ పేస్ట్
సెన్సిటివిటీ నుంచి తక్షణమే బయటపడాలంటే థర్మోడెంట్ సెన్సిటివ్ హెర్బల్ టూత్ పేస్ట్ సరైన ఎంపిక. ఇందులోని యాంటీ మైక్రోబయాల్.. బ్యాక్టీరియా నుంచి రక్షిస్తుంది. దంతాలకు సంబంధించిన అనేక సమస్యలను ఈ పేస్ట్ తొలగిస్తుంది.
ఆక్వా ఫ్రెష్ టూత్ పేస్ట్
ఆక్వా ఫ్రెష్ టూత్ పేస్ట్ దంతాల సమస్యలను వేగంగా పరిష్కరిస్తుంది. సున్నితమైన దంతాలు ఉన్నవారికిి ఇది బెస్ట్ ఆప్షన్. దంతాలను లోతుగా శుభ్రం చేస్తుంది. ఇది తాజా శ్వాసను కూడా అందిస్తుంది.
ఫ్రెష్ మింట్ టూత్ పేస్ట్
ఫ్రెష్ మింట్ టూత్ పేస్ట్ కావిటీస్, బ్యాక్టీరియా నుంచి రక్షిస్తుంది. ఇది దంతాల సున్నితత్వాన్ని నివారిస్తుంది. ఇది గ్లిజరిన్, సిలికా పదార్థాలు కలిగి ఉండి సూక్ష్మక్రిములకు వ్యతిరేకంగా పోరాడుతుంది. పుదీనా ఫ్లేవర్ ఉండే ఈ పేస్ట్ చల్లని, వేడి పదార్థాల వల్ల కలిగే నొప్పిని నివారిస్తుంది.